For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ కార్డ్స్‌తో భద్రత ఎలా: NFC సపోర్ట్ చిప్ డెబిట్-క్రెడిట్ కార్డ్స్‌తో ఉపయోగం

|

పాత మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డుల స్థానంలో చిప్ ఆధారిత డెబిట్ లేదా క్రెడిట్ కార్డులు వచ్చాయి. ఈ మేరకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గత ఏడాది ఆదేశాలు జారీ చేసింది. దీని ప్రకారం అన్ని బ్యాంకులు తమ వినియోగదారులకు చిప్ ఆధారిత కార్డులను జారీ చేస్తున్నాయి. పాత కార్డులు ఉన్నవారు కూడా చిప్ ఉన్న కార్డులు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశాయి. పాత మాగ్నటిక్ స్ట్రిప్ కార్డుల ద్వారా ఎక్కువగా మోసాలు జరిగే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో కొత్త టెక్నాలజీతో రూపొందించిన ఈఎంవీ కార్డులను జారీ చేయాలని బ్యాంకుల్ని ఆర్బీఐ ఆదేశించింది.

Modi 2.0: మీ పర్సనల్ ఫైనాన్స్‌పై ఎలా ప్రభావం పడుతుంది?Modi 2.0: మీ పర్సనల్ ఫైనాన్స్‌పై ఎలా ప్రభావం పడుతుంది?

చిప్ ఆధారిత కార్డ్స్

చిప్ ఆధారిత కార్డ్స్

ఇప్పుడు బ్యాంకులు చిప్ ఉన్న క్రెడిట్, డెబిట్ కార్డులు కస్టమర్లకు అందిస్తున్నాయి. వాటిలోను ఇప్పుడు కొత్తగా నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్ (NFC) కార్డ్స్ అందుబాటులోకి వచ్చాయి. పాత మ్యాగ్నటిక్ స్ట్రిప్ కార్డుల ద్వారా ఏదైనా కొన్న తర్వాత పాయింట్ ఆఫ్ సేల్స్ (POS) యంత్రంలో కార్డును స్వైప్ చేసి, పిన్‌ను నమోదు చేస్తే లావాదేవీ పూర్తయ్యేది. గత కొంతకాలంగా కార్డు ద్వారా స్వైప్ చేసే లావాదావీలు పెరిగాయి. దీంతో ఆర్థిక మోసాలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో చిప్ ఆధారిత కార్డ్స్ వచ్చాయి. పాయింట్ ఆఫ్ సేల్స్ వద్ద చిప్ ఉన్న కార్డును స్వైప్ చేయాల్సిన అవసరం లేదా పిన్‌ను ఎంటర్ చేయాల్సిన అవసరం లేదు. కార్డును పైన తాసిక్తే చెల్లింపు పూర్తవుతుంది. ఈ కార్డును ప్రస్తుతం రూ.2,000 వ్యాల్యూ వరకు అనుమతిస్తున్నరు. అంతకుమించి చెల్లింపు అయితే పిన్ నమోదు చేయాలి.

చిప్ ఆధారిత కార్డుతో భద్రత ఎలా?

చిప్ ఆధారిత కార్డుతో భద్రత ఎలా?

పాత మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డుల కంటే ఇవి సురక్షితం. కార్డును స్వైప్ చేయాల్సిన అవసరం లేదు. పిన్ పేర్కొనాల్సిన అవసరం లేదు. కాబట్టి కీలకమైన సమాచారం బయటకు వెళ్తుందనే ఆందోళన అవసరం లేదు. నాలుగు సెంటీమీటర్ల దూరం నుంచి కార్డును గుర్తించి, అవసరమైన లావాదేవీలను పాయింట్ ఆఫ్ సేల్స్ పూర్తి చేస్తుంది. సాధారణ కార్డు ద్వారా లావాదేవీలు పూర్తి కావాలంటే అర నిమిషం పడుతుంది. కానీ కొత్త కార్డు ద్వారా నాలుగైదు సెకన్లలో పూర్తవుతుంది. సమయం కూడా ఆదా అవుతుంది. మాగ్నెటిక్ స్ట్రిప్ కార్డు... రీడర్‌లో పెట్టినప్పుడు జనరేట్ అయ్యే డాటా ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. దీంతో మోసపూరిత లావాదేవీలకు అవకాశం ఉంది. కానీ చిప్ కార్డుతో జనరేట్ అయ్యే డాటా యూనిక్‌గా ఉంటుంది. దీంతో ఒక లావాదేవీ మాత్రమే చేసేందుకు అవకాశముంది.

ఎన్ఎఫ్‌సీ ఆధారిత కార్డు

ఎన్ఎఫ్‌సీ ఆధారిత కార్డు

మరో విషయం ఏమంటే బ్యాంకులు ఎన్ఎఫ్‌సీ (నియర్ ఫీల్డ్ కమ్యూనికేషన్) ఆధారిత కార్డులను జారీ చేస్తున్నాయి. ఈ కార్డు పైన వైఫై వలె ఓ గుర్తు ఉంటుంది. వైర్‌లెస్ కమ్యూనికేషన్ టెక్నాలజీతో దీనిని రూపొందించారు. దీంతో ఈ డివైస్, లావాదేవీలు జరిపే పరికరం మధ్య డాటా ఎక్స్‌చేంజ్ జరుగుతుంది. అంటే దీని ద్వారా లావాదేవీలు జరుగుతాయి. ఇది కాంటాక్ట్‌లెస్ కార్డ్.

English summary

ఈ కార్డ్స్‌తో భద్రత ఎలా: NFC సపోర్ట్ చిప్ డెబిట్-క్రెడిట్ కార్డ్స్‌తో ఉపయోగం | Are you using chip based debit cards with NFC support?

Near Field Communication (NFC) technology is a standards-based wireless communication technology that allows data to be exchanged between devices that are a few centimeters apart.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X