For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ ఎందుకు?: కుటుంబం దాకా 'ఆర్థిక' ప్రయోజనాలివే!

|

ప్రమాద బీమా అవసరమా? ఏడాదికి బీమా మొత్తంగా వేలాది రూపాయలు చెల్లిస్తే అంతగా ఉపయోగం అనిపించడం లేదా? అలా ఆలోచిస్తే తప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. రోజు రోజుకు ప్రమాదాలు పెరుగుతున్నాయి. అనుకోని విధంగా ఏదైనా ప్రమాదం జరిగితే.. వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ ఎంతో ఉపయోగకరం. నామమాత్రపు ధర చెల్లించి కొనుగోలు చేసిన బీమా పథకం ఆర్థికంగా ఎంతో సహాయకారి అవుతుంది.

<strong>రూ.15వేల కంటే తక్కువ ఆదాయం వస్తుందా, ఈ స్కీం మీకోసమే?</strong>రూ.15వేల కంటే తక్కువ ఆదాయం వస్తుందా, ఈ స్కీం మీకోసమే?

 పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఎంతో ఉపయోగకరం

పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఎంతో ఉపయోగకరం

పర్సనల్ యాక్సిడెంట్ స్కీంను (వ్యక్తిగత ప్రమాద బీమా) ఎంతోమంది విస్మరిస్తున్నారు. మీ ఫైనాన్షియల్ సపోర్ట్‌కు ఇది బెస్ట్ ఛాయిస్. ఇది పాకెట్ ఫ్రెండ్లీ మరియు ఫ్లెక్సిబుల్. ఏడాదికి కేవలం రూ.800 నుంచి రూ.1500 ప్రీమియంతో రూ.10 లక్షల యాక్సిడెంట్ పాలసీ కవర్ అవుతుంది. ప్రమాదం కారణంగా పాలసీహోల్డర్ చనిపోయినా లేదా అంగవైకల్యం ఏర్పడినా పర్సనల్ యాక్సిడెంట్ స్కీం కవర్ అవుతుంది. తాత్కాలిక లేదా శాశ్వత వైకల్యం లేదా తీవ్ర ప్రమాదం జరిగితే అతను పని చేయలేని కాలానికి ఆదాయ నష్టపరిహారాన్ని అందించేందుకు వ్యక్తిగత ప్రమాద బీమా పాలసీ ఉపయోగపడుతుంది. ప్రమాదానికి గురై పని చేయలేని పరిస్థితుల్లో కుటుంబ ఖర్చుల కోసం రోజువారీ భత్యం కింద బీమా సంస్థ డబ్బు చెల్లిస్తుంది. అలాగే, వ్యక్తిగత ప్రమాద బీమా క్లెయిమ్ చేసేందుకు ప్రమాదస్థాయితో పట్టింపు లేదు. పెద్ద పెద్ద ప్రమాదాలకే కాకుండా సైకిల్ పైనుంచి పడిపోవడం వంటి చిన్న ప్రమాదాలకు అయ్యే ఖర్చు కూడా కవర్ అవుతుంది.

తరుచూ ప్రయాణాలు చేసేవారు బీమా తీసుకోవడం మంచిది

తరుచూ ప్రయాణాలు చేసేవారు బీమా తీసుకోవడం మంచిది

ప్రమాదానికి గురైన తీవ్రతను బట్టి బీమా సంస్థ చెల్లింపులు ఉంటాయి. మరణిస్తే మాత్రం వంద శాతం హామీ మొత్తం చెల్లిస్తారు. శాశ్వత లేదా పాక్షిక వైఫల్యం అయితే 75 శాతం చెల్లిస్తారు. అన్ని రకాల ప్రమాదాలకు పాలసీలు అందుబాటులో ఉన్నాయి. ప్రమాదంలో గాయపడిన వారికి చికిత్స అందించేందుకు ఎయిర్ అంబులెన్స్, ప్రమాదానికి గురైన వ్యక్తి చెల్లించే రుణాలు ఉంటే వాటికి హామీగా ఉండటం, ఈఎంఐలు ఉంటే వాటిని చెల్లించడం వంటి సేవలను కూడా బీమా పాలసీల ద్వారా పొందవచ్చు. ఆరోగ్య బీమాతో పాటు ప్రమాద బీమా కూడా ఎంతో ముఖ్యం. ఇది అందరికీ అవసరమే. తరుచు ప్రయాణాలు చేస్తున్నవారు అయితే తప్పనిసరిగా బీమా తీసుకోవడం మంచిది. వ్యక్తిగత బీమాని ప్రతి ఏటా పునరుద్ధరించుకోవాలి.

పర్సనల్ యాక్సిడెంట్ పాలసీతో...

పర్సనల్ యాక్సిడెంట్ పాలసీతో...

డిజబులిటీ కవర్: ప్రమాదం జరిగి పూర్తిగా లేదా పార్షల్‌గా అంగవైకల్యం ఏర్పడితే ఈ పాలసీ ఎంతో ఆర్థిక సహాయకారి అవుతుంది. అనుకోకుండా పాలసీ హోల్డర్ చనిపోతే నామినీకి యాక్సిడెంట్ డెత్ కంపన్షేషన్ బినిఫిట్స్ వస్తాయి.

ఎమర్జెన్సీ యాక్సిడెంట్ మెడికల్ ఎక్స్‌పెన్స్: పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ తీసుకుంటే ప్రమాదం జరిగితే.. ఆసుపత్రి బిల్లులు, అంబులెన్స్ ఛార్జీలు, మెడికల్ ట్రీట్మెంట్‌ను బీమా సంస్థలు చెల్లిస్తాయి. ఒకవేళ చనిపోతే రిపార్టేషన్ ఛార్జీలు, అంత్యక్రియల ఖర్చు కూడా భరిస్తాయి.

నష్టపోయిన ఆదాయానికి కంపన్షేషన్: పాలసీ హోల్డర్‌కు ఫ్రాక్చర్ లేదా అంగవైకల్యం ఏర్పడి ఆదాయ మార్గం లేని కాలానికి గాను బీమా సంస్థలు ఆ మొత్తాన్ని చెల్లిస్తాయి. పాలసీ హోల్డర్ టెంపరరీగా అంగవైకల్యంపాలైతే బీమా సంస్థలు వీక్లీ బెనిఫిట్స్ ఇస్తాయి.

పిల్లల చదువు: పాలసీ హోల్డర్ పిల్లల చదువులకు కూడా కొంత చెల్లిస్తుంది. మీరు చెల్లించిన బీమా మొత్తానికి పది శాతం లేదా సదరు విద్యా సంస్థ ఫీజు.. ఈ రెండింట్లో ఏది తక్కువ ఉంటే దానిని చెల్లిస్తుంది. అంతేకాదు మోడిఫికేషన్ అలవెన్సులు, పాలసీ హోల్డర్ ఇంటికి 150 కిలో మీటర్ల దూరంలోని ఆసుపత్రిలో ఉంటే కుటుంబ సభ్యుల రాకపోకల ఖర్చులు (పరిమితులు ఉంటాయి) కూడా చెల్లిస్తుంది.

Read more about: insurance
English summary

పర్సనల్ యాక్సిడెంట్ ఇన్సురెన్స్ ఎందుకు?: కుటుంబం దాకా 'ఆర్థిక' ప్రయోజనాలివే! | Why you need a personal accident insurance cover

An individual personal accident insurance is your best bet for financial support. It is highly pocket-friendly and flexible. One can buy 10 lakh of accidental cover for a premium of 800 to 1,500 per year, basis specific product benefits and insurer brand reliability.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X