For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Umang App: ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, లాభాలు ఏమిటి? తెలుసుకోండి...

|

కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాల వరకు ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోన్న అన్ని సర్వీసులను ఒకేచోట పొందేందుకు వీలుగా వచ్చిన యాప్ ఉమంగ్. ఉమంగ్ అంటే యూనిఫైడ్ మొబైల్ అప్లికేషన్ ఫర్ న్యూ ఏజ్ గవర్నెన్స్. ఈ సింగిల్ మొబైల్ యాప్‌లో 300కు పైగా ప్రభుత్వ సర్వీసులు అందుబాటులో ఉంటాయి. ఈ యాప్ 13 ప్రాంతీయ భాషల్ని సపోర్ట్ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వాలు అందించే 1200 పైచిలుకు సర్వీసులను ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. పాన్ కార్డు దరఖాస్తుకు, కరెక్షన్‍‌కు వేర్వేరు వెబ్ సైట్లు ఓపెన్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ యాప్‌లో సేవలు పొందవచ్చు. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఉమంగ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

మీ పిల్లల కోసం ఎల్ఐసీ కొత్త పాలసీ, రూ.206తో రూ.27 లక్షలుమీ పిల్లల కోసం ఎల్ఐసీ కొత్త పాలసీ, రూ.206తో రూ.27 లక్షలు

ఎలా సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి

ఎలా సబ్‌స్క్రైబ్ చేసుకోవాలి

- మొబైల్ నెంబర్ ఉపయోగించి ఉమంగ్ యాప్‌ను ఈ క్రింది విధంగా సబ్ స్క్రైబ్ చేసుకోవాలి.

- గూగుల్ ప్లే స్టోర్ లేదా యాపిల్ యాప్ స్టోర్ నుంచి ఉమంగ్ యాప్‌ను డౌన్ లోడ్ చేయండి

- యాప్ ఓపెన్ చేసి, లాంగ్వెజ్ సెలక్ట్ చేసుకోండి.

- new user పైన క్లిక్ చేయండి

- రిజిస్ట్రేషన్ కనిపిస్తుంది. అక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. Next పైన క్లిక్ చేయండి

- ఓటీపీ నెంబర్ ఎంటర్ చేయండి.

- ఎంపిన్ సెట్ టైప్ చేయండి. Confirm MPIN పైన క్లిక్ చేయండి.

- Proceed ను ఎంచుకోండి. సెక్యూరిటీ క్వశ్చన్లకు సమాధానం ఇవ్వండి. ఇక్కడ ఈ-మెయిల్ అడ్రస్, ప్రత్యామ్నాయ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీరు మీ ఎంపిన్ (MPIN) మరిచిపోతే ఎవరైనా మీకు సహకరించేందుకు ఇది ఉపయోగపడుతుంది.

- మీ ఆధార నెంబర్ ఎంటర్ చేయండి. మీకు ఇష్టమైతేనే ఎంటర్ చేయవచ్చు లేదంటే Skip పైన క్లిక్ చేయండి.

- ఆ తర్వాత Save & Proceed పైన క్లిక్ చేయండి. దీంతో మీ రిజిస్ట్రేషన్ పూర్తయినట్లు. ఆ తర్వాత హోంపేజీకి వెళ్లి, Sort & Filter ద్వారా సర్వీస్, కెటగిరీ ద్వారా మీకు కావాల్సింది బ్రౌజ్ చేయవచ్చు.

ఈ యాప్‌తో ఎన్నో లాభాలు

ఈ యాప్‌తో ఎన్నో లాభాలు

ఉమంగ్ యాప్‌తో ఎన్నో సేవలు పొందవచ్చు. మీ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు. క్లెయిమ్ రెయిజ్ చేయవచ్చు. క్లెయిమ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. దీని ద్వారా గ్యాస్, ఎలక్ట్రిసిటీ, వాటర్, డీటీహెచ్, టెలికం బిల్స్ పే చేయవచ్చు. ఎల్పీజీ బుకింగ్, డిస్ట్రిబ్యూటర్స్‌కు ఆన్‌లైన్ పేమెంట్స్, రీఫిల్ హిస్టరీ చూసుకోవచ్చు. అంతేకాదు, విద్యార్థులు తమ పరీక్ష ఫలితాలు, సీబీఎస్ఈ కాంపిటేటివ్ పరీక్షల సెంటర్లు చూసుకోవచ్చు.

 పాన్ కార్డు సేవలు

పాన్ కార్డు సేవలు

అంతేకాదు, ఉమంగ్ యాప్ ద్వారా పాన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. పాన్ కార్డు కరెక్షన్ కూడా ఈ యాప్ ద్వారా సులువు. వ్యక్తిగతంగానే కాకుండా కంపెనీలు కూడా ఈ యాప్ ద్వారా పాన్ కార్డు కోసం దరఖాస్తు చేయవచ్చు. కొత్త పాన్ కార్డు కోసం 49ఏ పాం ద్వారా దరఖాస్తు చేయాలి. పేరు, అడ్రస్, పుట్టినతేదీ, తండ్రి పేరు లాంటి తప్పుల్ని సరిదిద్దుకోవచ్చు. ఇందుకోసం ఛేంజ్ రిక్వెస్ట్ ఫామ CSF పూర్తి చేయాలి. కొత్త పాన్ కార్డు కోసం లేదా తప్పులు సరిచేసుకోవడానికి చేసుకున్న దరఖాస్తు స్టేటస్ చూసుకోవచ్చు. రిఫరెన్స్ నెంబర్ ద్వారా పాన్ కార్డు అప్లికేషన్ స్టేటస్ తెలుసుకోవచ్చు. అప్లికేషన్ నెంబర్ ఆధారంగానే పేమెంట్ చేయాలి.

English summary

Umang App: ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, లాభాలు ఏమిటి? తెలుసుకోండి... | Umang App: How To Register, Services Offered, Key Details

Mobile app Umang (Unified Mobile Application for New-age Governance) allows citizens to access a range of online government services, including facilities offered by central as well as state government bodies.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X