For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI కార్పోరేట్ శాలరీ అకౌంట్: ట్రాన్సాక్షన్లు ఉచితం... అర్హత, లాభాలు తెలుసుకోండి

|

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) శాలరీ ప్యాకేజీ అకౌంట్ ఆఫర్ ఇస్తోంది. శాలరైడ్ ఉద్యోగులకు ప్రత్యేకంగా ఈ సేవింగ్స్ అకౌంట్ ఇస్తోంది. ఇది జీరో బ్యాలెన్స్ కలిగిన ప్రత్యేకమైన అకౌంట్. కేవలం వేతనజీవులకు మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ దళాలు, పారామిలిటరీ దళాలు, పోలీసులు, కార్పొరేట్స్/ఇన్‌స్టిట్యూషన్లు వంటి వివిధ విభాగాలకు చెందిన ఉద్యోగులు ఈ అంకౌట్ తీసుకోవచ్చు. ఎస్బీఐ కార్పొరేట్ శాలరీ ప్యాకేజ్ కింద అకౌంట్ తీసుకుంటే ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు.

<strong>SBI ATM Card Rules: క్యాష్ విత్ డ్రా లిమిట్, ట్రాన్సాక్షన్</strong>SBI ATM Card Rules: క్యాష్ విత్ డ్రా లిమిట్, ట్రాన్సాక్షన్

 ఎస్పీఐ కార్పోరేట్ శాలరీ ప్యాకేజీ (సీఎస్పీ) అకౌంట్

ఎస్పీఐ కార్పోరేట్ శాలరీ ప్యాకేజీ (సీఎస్పీ) అకౌంట్

కార్పోరేట్ శాలరీ ప్యాకేజీ అకౌంట్ కింద ఎన్నో లాభాలు ఉన్నాయి. సదరు కార్పోరేట్ ఇనిస్టిట్యూషన్ ఉద్యోగులకు ఆసుపత్రులు, హోటల్స్ వంటి సేవలు అందిస్తాయి. ఆర్గనైజేషన్, బ్యాంకు మధ్య ఉన్న సంబ్ధాలపై ఆధారపడి ఈ శాలరీ అకౌంట్‌ను కస్టమైజ్ కూడా చేసుకోవచ్చు. ఎస్బీఐ కార్పోరేట్ శాలరీ ప్యాకేజీ కింద కంపెనీలు వేతన చెల్లింపులకు ఎలాంటి ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎన్నిసార్లైనా ట్రాన్సాక్షన్ ఉచితం

ఎన్నిసార్లైనా ట్రాన్సాక్షన్ ఉచితం

శాలరీ అకౌంట్ కింద ఏ బ్యాంకు ఏటీఎంలోనైనా, ఎన్నిసార్లు అయినా (అపరిమితం) ట్రాన్సాక్షన్లు నిర్వహించుకోవచ్చు. ఎన్నిసార్లు అయినా డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చు. ఎస్బీఐ క్రెడిట్ కార్డు ఇస్తారు. పర్సనల్ యాక్సిడెంట్ పాలసీ ఇస్తోంది. అకౌంట్ హోల్డర్ రూ.20 లక్షల వరకు కవరేజ్ ఉంది. విమాన ప్రమాదంలో చనిపోతే రూ.30 లక్షల వరకు బీమా ఇస్తోంది. అలాగే ఉచిత ఆన్‌లైన్ సేవలు పొందవచ్చు. నెఫ్ట్, ఆర్టీజీఎస్ సర్వీసులు సహా మల్టీసిటీ చెక్, డ్రాఫ్ట్ ఇష్యూ వంటి సేవలు ఉచితం.

గ్రాస్ మంత్లీ ఇన్‌కం ఇలా ఉంటే అర్హులు

గ్రాస్ మంత్లీ ఇన్‌కం ఇలా ఉంటే అర్హులు

ఎస్బీఐ శాలరీ అకౌంట్‌లో పలు రకాలు ఉంటాయి. వేతనం ప్రాతిపదికన అకౌంట్ మారుతుంది.

ప్లాటినమ్: రూ.1,00,000 కంటే ఎక్కువ.

డైమండ్: రూ.50,000 నుంచి Rs. 1,00,000 వరకు

గోల్డ్: రూ.20,000 నుంచి 50,000 వరకు

సిల్వర్: రూ.5,000 నుంచి 20,000 వరకు

English summary

SBI కార్పోరేట్ శాలరీ అకౌంట్: ట్రాన్సాక్షన్లు ఉచితం... అర్హత, లాభాలు తెలుసుకోండి | SBI Corporate Salary Account: Eligibility, Benefits Explained Here

SBI offers the facility of opening a salary package account, which is a special savings account offered to salaried customers. A salary package account is a zero balance account.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X