For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ కార్డ్‌తో క్యాష్ తీసుకుంటున్నారా? ఇవి మర్చిపోవద్దు

By Chanakya
|

క్రెడిట్ కార్డ్ వినియోగం నేటి రోజుల్లో విస్తృతమైంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా ఈ మధ్య బ్యాంకులు ఇబ్బడిముబ్బడిగా కార్డులను ఇచ్చేస్తున్నాయి. ఒక్క క్రెడిట్ కార్డ్ ఉంటే చాలు.. నాలుగైదు బ్యాంకులు వెంటాడి మరీ కట్టబెడ్తున్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరికి కార్డుల సంఖ్య 25 శాతానికి పెరిగింది. అంతేకాదు ఏటీఎంల ద్వారా సదరు కార్డుల లావాదేవీలు కూడా అనూహ్యంగా 15 శాతం పెరిగాయి. వాస్తవానికి ఈ కార్డ్ ఎమర్జెన్సీ సమయాల్లో మాత్రమే వినియోగించాలని మనం పదే పదే చెప్పుకున్నా అధికసార్లు ఖర్చులు మన చేయిదాటిపోతాయి. అందుకే కొన్నిసార్లు నగదు కటకటతో క్రెడిట్ కార్డ్ తీసుకుని ఏటీఎంకు పోయి డబ్బులు విత్ డ్రా చేసుకుంటాం. అలాంటి వాళ్లంతా ఈ విషయాలను ఖచ్చితంగా గుర్తుంచోవాలి.

క్రెడిట్ కార్డులు వాడుతున్నారా, స్కోర్ తగ్గకుండా ఏం చేయాలి? ఎంత శాతం వాడాలో తెలుసా?క్రెడిట్ కార్డులు వాడుతున్నారా, స్కోర్ తగ్గకుండా ఏం చేయాలి? ఎంత శాతం వాడాలో తెలుసా?

ఫ్రీ పీరియడ్ ఉండదు

ఫ్రీ పీరియడ్ ఉండదు

సాధారణ మర్చంట్ ట్రాన్సాక్షన్స్‌కు బ్యాంకులు 30 నుంచి 50 రోజుల వరకూ ఇంట్రెస్ట్ ఫ్రీ పీరియడ్‌ను ఇస్తాయి. ఈ లోపు లావాదేవీ జరిపి డబ్బులు కట్టేయొచ్చు. కానీ నగదు విత్ డ్రా చేసుకున్నప్పుడు మాత్రం మొదటి రోజు నుంచే మీకు వడ్డీని ఛార్జ్ చేస్తాయి బ్యాంకులు. చాలా మందికి ఈ విషయం తెలియదని కొన్ని సర్వేలు చెబ్తున్నాయి. మీరు తీసుకున్న క్షణం నుంచే మీకు వడ్డీ పడ్తుందనే సంగతిని గుర్తుంచుకోండి.

వడ్డీ ఎంతుంటుంది?

వడ్డీ ఎంతుంటుంది?

ఏటీఎంలో నగదు ఉపసంహరణకు క్రెడిట్ కార్డ్ సంస్థలు నెలకు 2-3 శాతం వడ్డీని విధిస్తాయి. అంటే ఏడాదికి ఇది 24-36 శాతం వర్కవుట్ అవుతుంది. సింపుల్‌గా చెప్పాలంటే రూ.2-3 వడ్డీ విధిస్తాయి. వీటికి తోడు అదనపు ఛార్జీలైన ఫ్లాట్ ప్రాసెసింగ్ ఫీజు, జీఎస్టీతో కలిసి మీరు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఉదాహరణకు మీరు ఏదైనా ఏటీఎం నుంచి క్రెడిట్ ద్వారా రూ.10000 తీసుకున్నారని అనుకుందాం. నెల తిరిగే సరికి మీరు రూ.500-600 అధికంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో 3 శాతం అంటే వడ్డీ అయితే మిగిలినది రూ.200-300 వరకూ ఫిక్సెడ్ ఫీజ్. మీరు వెయ్యి రూపాయలు తీసుకున్నా రూ.200 ఫీజ్ కట్టాల్సి ఉంటుంది అనే సంగతి గుర్తుంచుకోండి.

ఎంత క్యాష్ తీసుకోవచ్చు

ఎంత క్యాష్ తీసుకోవచ్చు

మన క్రెడిట్ కార్డ్ ప్రొఫైల్‌ను బట్టి సబ్ లిమిట్‌ను నిర్ణయిస్తాయి బ్యాంకులు. ప్లాటినం, గోల్డ్ వంటి కార్డులకు ఒక లిమిట్ ఆ పై కార్డులకు మరో లిమిట్ ఉంటుంది. సాధారణంగా ఎంట్రీ లెవెల్ కార్డ్‌కు కనీసం 10 శాతం క్యాష్ విత్ డ్రా లిమిట్ ఉంటుంది. అంటే మీకు రూ.100000 లిమిట్ ఉంటే.. కేవలం రూ.10 వేలు మాత్రమే ఏటీఎం ద్వారా నగదు ఉపసంహరణ చేసుకోవచ్చు. మరికొన్ని కార్డులకు 30 శాతం వరకూ లిమిట్ ఉంటుంది.

ఎమర్జెన్సీ అవసరాలకు ఏం చేయాలి

ఎమర్జెన్సీ అవసరాలకు ఏం చేయాలి

సాధ్యమైనంత వరకూ క్రెడిట్ కార్డ్ ద్వారా నగదు ఉపసంహరణ చేయకపోవడం మంచిది. ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో తీసుకున్నా నెక్స్ట్ బిల్లింగ్ వచ్చేంత వరకూ ఆగొద్దు. ఒక వేళ మీకు వారం, పది రోజుల్లో డబ్బులు సర్దుబాటు అయిపోతే తక్షణం కట్టేయండి. లేని పక్షంలో బ్యాంకును సంప్రదించి సదరు ఔట్ స్టాండింగ్ బకాయిని పర్సనల్ లోన్‌గా మార్చుకోండి. ఎందుకంటే క్రెడిట్ కార్డుకు 24-36 శాతం వడ్డీ ఉంటే.. వ్యక్తిగత రుణాలకు 12-15 శాతంలోపు మాత్రం వడ్డీ ఉంటుంది. ఈ లెక్కన మీరు సేవ్ అవుతారు. అంతేకాదు అవసరాన్ని బట్టి ఈఎంఐ ఆప్షన్ పెట్టుకుంటే అప్పుల కుప్పలో కూరుకుపోకుండా ఉంటారు.

English summary

క్రెడిట్ కార్డ్‌తో క్యాష్ తీసుకుంటున్నారా? ఇవి మర్చిపోవద్దు | Interest rates and other processing fees for cash from ATMs through Credit cards

One must keep in mind about the interest rates and other processing fees before taking cash from ATMs through Credit cards.
Story first published: Sunday, April 21, 2019, 15:05 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X