For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇది మీకు తెలుసా?: ఒరిజినల్ అడ్రస్ ప్రూఫ్ లేకుండానే ఆధార్ చిరునామా మార్చుకోవచ్చు

|

ఉద్యోగం, వ్యాపారం లేదా ఇతర కారణాల వల్ల కొందరు నిత్యం ఇళ్లు మారుతుంటారు. కొందరు తాము ఉండే గ్రామాలు లేదా పట్టణాలు కూడా మారుతుంటారు. ఏదైనా అవసరంరీత్యా, నిత్యం ఇళ్లు లేదా ఊళ్లు మారేవారు ఆధార్ కార్డులలో అడ్రస్ మార్చుకోవడానికి ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఇలాంటి వారికి యూఐడీఏఐ వెసులుబాటు కల్పించింది. ఒరిజినల్ అడ్రస్ ప్రూఫ్ లేకుండా కూడా ఆధార్ కార్డులో చిరునామాను మార్చుకోవచ్చు.

వాలిడేషన్ లెటర్

వాలిడేషన్ లెటర్

ఎవరైనా ఆధార్ కార్డు హోల్డర్ తమ అడ్రస్‌ను మార్చుకోవడానికి.. ఆ అడ్రస్‌లో (మార్చుకుంటున్న కొత్త చిరునామా) ఉంటున్న ఆధార్ కార్డు హోల్డర్ ఇచ్చే వాలిడేషన్ లేఖ ఇవ్వాల్సి ఉంటుంది. ఈ వాలిడేషన్ లేఖను ఇచ్చేవారు ఆ ఇంటి యజమాని కావొచ్చు లేదా మీ కుటుంబ సభ్యులు, బంధువు, స్నేహితుడు కావొచ్చు. అడ్రస్ వెరిఫికేషన్ పూర్తయ్యాక మీరు UIDAI పోర్టల్‌ను సందర్శించాలి. అక్కడ మీ అడ్రస్ వాలిడేషన్ లేఖను జనరేట్ చేయాలి. ఆధార్ నెంబర్ ద్వారా మీరు లాగిన్ కావాలి.

ఆధార్ అప్ డేట్

ఆధార్ అప్ డేట్

ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఈ లేఖకు సంబంధించి వెరిఫైయర్‌కు ఓ సీక్రెట్ కోడ్ పంపబడుతుంది. ఆ తర్వాత వెరిఫైయర్‌కు అడ్రస్ వాలిడేషన్ లెటర్ చేరుతుంది. ఆ తర్వాత పోర్టల్‌లోకి తిరిగి లాగిన్ అయి 'proceed to update address' పైన క్లిక్ చేయాలి. అడ్రస్ మార్చుకున్న తర్వాత డౌన్ లోడు చేసుకోవచ్చు. ఇలా కేవలం ఆడ్రస్‌ను మాత్రమే మార్చగలం. కానీ పేరు, జెండర్, రిలేషన్, మొబైల్ నెంబర్, పుట్టిన తేదీ, ఈమెయిల్ వంటి వాటిని ఫిజికల్ హాజరు ద్వారా మాత్రమే మార్చుకోగలం.

అడ్రస్ ప్రూఫ్‌తో ఆన్‌లైన్లో ఇలా మార్చుకోండి

అడ్రస్ ప్రూఫ్‌తో ఆన్‌లైన్లో ఇలా మార్చుకోండి

కొంతమంది ఉద్యోగ, వ్యాపారరీత్యా తాత్కాలిక చిరునామాపై ఆధార్ కార్డు తీసుకుంటారు. ఆ తర్వాత శాశ్వత చిరునామాతో మార్చుకోవాలని భావిస్తారు. ఆన్‌లైన్‌లో కూడా అడ్రస్ మార్చుకోవచ్చు. UIDAI వెబ్ సైట్ ఓపెన్ చేసి అడ్రస్ అప్ డేట్ రిక్వెస్ట్ పైన క్లిక్ చేయాలి. మరో ట్యాబ్‌లో పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడి సూచనలు చదివి ప్రొసీడ్ పైన క్లిక్ చేయాలి. మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ రిజిస్టర్‌డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేశాక మీ అడ్రస్‌ను ఎలా మార్చుకోవాలకుంటున్నారని అడుగుతుంది. దానిని సెలక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత పేజీలో మీ చిరునామా మార్పుకు సంబంధించిన వివరాలు ఎంటర్ చేసి సబ్‌మిట్ పైన క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ అడ్రస్ ప్రూఫ్ డాక్యుమెంట్‌లలో ఏదో ఒక దానిని అప్ లోడ్ చేయాలి. పాస్‌పోర్ట్, ఇన్సురెన్స్ పాలసీ, క్రెడిట్ కార్డు స్టేట్‌మెంట్, టెలిఫోన్ బిల్, ఆస్తిపన్ను రసీదు లాంటి వాటిని అడ్రస్ ప్రూఫ్‌గా పెట్టవచ్చు. చివరలో బీపీవో సర్వీస్ ప్రొవైడర్‌ను సెలక్ట్ చేసుకోవాలి. అక్కడి వివిధ సర్వీస్ ప్రొవైడర్లలో ఏదో ఒకదానిని సెలక్ట్ చేసుకొని దాని పక్కన రేడియో బటన్ క్లిక్ చేశాక, సబ్‌మిట్ పైన క్లిక్ చేయాలి. మీ అడ్రస్ మారినట్లే. మీ ఆధార్ నెంబర్ రిజిస్టర్డ్ మొబైల్‌తో అనుసంధానం అయి ఉండాలి.

English summary

ఇది మీకు తెలుసా?: ఒరిజినల్ అడ్రస్ ప్రూఫ్ లేకుండానే ఆధార్ చిరునామా మార్చుకోవచ్చు | How To Update Address In Aadhaar Card Without Address Proof?

In a bid to ease the hassle of aadhaar cardholders who migrate frequently or change their house, the UIDAI now allows change of address in aadhaar card of the holder, even without original address proof. All an aadhaar card holder needs to produce is an address validation letter which can be obtained from the address lender or verifier who thus would allow use of his or her aadhaar-registered address to be used by the resident.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X