ఎల్ఐసీ ప్రీమియంను వివిధ మార్గాల్లో చెల్లించవచ్చు. ఎల్ఐసీ మొబైల్ యాప్, ఈసీఎస్, ఏటీఎం, ప్రీమియం పాయింట్ అండ్ లైఫ్ ప్లస్ సెంటర్లు, నెట్ బ్యాంకింగ్, సీనియర్ బిజినెస్ అసోసియేటర్స్, ఫ్రాంచైజీల ద్వారా ఇలా వివిధ మార్గాల్లో చెల్లించవచ్చు. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్ఓ) ద్వారా కూడా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించవచ్చు. ప్రీమియం తీసుకునే సమయంలోనే అవసరమైతే నేరుగా ఈఫీఎఫ్ఓ నుంచి చెల్లింపు జరిగేలా ఆప్షన్ ఎంచుకోవచ్చు. అలాగే ఈపీఎఫ్ఓ వెబ్ సైట్‌లో అందుబాటులోని ఫాం 14 ద్వారా కూడా ప్రీమియం చెల్లించవచ్చు.
చాలామందికి ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపు తేదీలు గుర్తుకు ఉండవు. ఆదాయ - ఖర్చు పరిమితుల కారణంగా కొందరు ప్రీమియం దగ్గరపడ్డాక ఇబ్బందులు పడుతుంటారు. వేతనజీవులు కూడా ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయితే శాలరైడ్ పీపుల్ తమ ఈపీఎఫ్ అకౌంట్ (ఈపీఎఫ్ కార్పస్ అకౌంట్) ద్వారా ఎల్ఐసీ ప్రీమియంను చెల్లించవచ్చు. ఈ విషయం అందరికి తెలియకపోవచ్చు.

ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపుకు ఈపీఎఫ్ కార్పస్‌ను ఎలా ఉపయోగించాలి
ఈపీఎఫ్ సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారు ఈపీఎఫ్ కార్పస్ ద్వారా ఎల్ఐసీ ప్రీమియం చెల్లించవచ్చు. ఇందుకోసం ఈపీఎఫ్ఓకు సూచించవచ్చు. మీరు ప్రీమియం కొనుగోలు చేసే సమయంలో లేదా ఆ తర్వాత కూడా ఫాం 14 ఫైల్ చేయడం ద్వారా దీనిని చెల్లించమని కోరవచ్చు. ఫాం 14 ఫాంను ఈపీఎఫ్ఓ వెబ్ సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యాక ఈపీఎఫ్ కార్పస్ ద్వారా ఎల్ఐసీ ప్రీమియంకు చెల్లింపులు జరుగుతాయి.

ప్రీమియంకు సరిపడే డబ్బు అందుబాటులో ఉండాలి
పాలసీ ఏదైనా ఈపీఎఫ్ కార్పస్ నుంచి ప్రీమియం మొత్తం చెల్లించొచ్చు. మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తక్కువగా ఉంటే ఈపీఎఫ్‌వో ఎల్ఐసీ ప్రీమియం మొత్తాన్ని చెల్లిచడం నిలిపివేస్తుంది. అప్పుడు సబ్‌స్క్రైబర్ సొంతంగానే ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఈపీఎఫ్ మొత్తం సరిపడినంత ఉన్నప్పుడే ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపు సౌలభ్యం అందుబాబులో ఉంటుంది. ఈపీఎఫ్ అకౌంట్ కలిగి కనీసం రెండేళ్ల తర్వాతే ఈ సౌలభ్యం ఉంది. రెండేళ్లకు తక్కువగా ఉండే మీరు ఈ సౌలభ్యాన్ని ఉపయోగించుకోలేరు.

ఈపీఎఫ్ కార్పస్ ద్వారా చెల్లించడంపై ఆలోచించాలి
ఈపీఎఫ్ మొత్తం అనేది రిటైర్మెంట్ కోసం దాచుకునే డబ్బు. అందువల్ల ఈపీఎఫ్ మొత్తం నుంచి ఎల్ఐసీ ప్రీమియం చెల్లింపుపై ఆలోచన చేయాలి. షార్ట్ టర్మ్ అవసరం కోసం ఈపీఎఫ్‌ను ఉపయోగించుకోవచ్చా అనే నిర్ణయం మీదే. అదే సమయంలో ఆర్థిక ఇబ్బందులు ఉన్న సమయంలో ఇది ఉపయోగపడుతుంది. ఒకవేళ మీరు దీనిని నిలుపుదల కూడా చేసుకోవచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..



Click it and Unblock the Notifications