For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మిస్డ్‌కాల్‌తో పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎలా చేక్ చేసుకోవాలి? మరిన్ని విషయాలు తెలుసుకోండి

|

మీ ప్రావిడెంట్ ఫండ్ బ్యాలెన్స్ వివరాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఒక్క మిస్డ్ కాల్ ఇస్తే పీఎఫ్ అకౌంట్లో ఎంత మొత్తం ఉందో తెలుసుకోవచ్చు. అయితే ఇందుకోసం యూఏఎన్ నెంబర్, రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ అవసరం. ఈ రెండింటిని కనుక మీరు కలిగి ఉంటే 011 229 01 406 ఫోన్ నెంబర్‌కు మిస్డ్ కాల్ ఇచ్చి మీ అకౌంట్‌లో ఎంత బ్యాలెన్స్ ఉందో తెలుసుకోవచ్చు. మీ ఫోన్ నెంబర్‌కు అమౌంట్‌కు సంబంధించి ఎస్సెమ్మెస్ వస్తుంది. అందులో మీ పీఎఫ్ నెంబర్, వయస్సు, పేరు, బ్యాలెన్స్ తదితరాలు ఉంటాయి.

కొత్త ఐటీ రిటర్న్స్ ఫారమ్స్ ఇవే: ఈ వివరాలు తెలుసుకోండికొత్త ఐటీ రిటర్న్స్ ఫారమ్స్ ఇవే: ఈ వివరాలు తెలుసుకోండి

ఇవి తప్పనిసరి

ఇవి తప్పనిసరి

మీ అకౌంట్‌లోని ఈపీఎఫ్ బ్యాలెన్స్ మిస్డ్ కాల్ ద్వారా తెలుసుకోవాలంటే ఇవి తప్పనిసరిగా ఉండాలి. తప్పనిసరిగా యూఏఎన్ నెంబర్ ఉండాలి. మీ యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ అయి ఉండాలి. యూఏఎన్‌కు రిజిస్టర్డ్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. వేరే నెంబర్‌తో చేస్తే ప్రయోజనం ఉండదు. ప్రస్తుతం మీరు ఉపయోగిస్తున్న మొబైల్ నెంబర్ కనుక లేకుంటే వెంటనే అందులో మార్చుకోవాల్సి ఉంటుంది. ఫోన్ నెంబర్ అప్‌డేట్ చేసుకోవాలి. యూఏఎన్‌కు ఏ ఫోన్ నెంబర్ ఇచ్చారో అదే మొబైల్ నుంచి కాల్ చేసి తెలుసుకోవచ్చు. మీ యూఏఎన్ పాన్ కార్డ్/ఆధార్ కార్డు/బ్యాంకు అకౌంట్‌కు లింక్ అయి ఉండాలి.

ఇలాంటి సందర్భాల్లో మీరు బ్యాలెన్స్ వివరాలు పొందలేరు

ఇలాంటి సందర్భాల్లో మీరు బ్యాలెన్స్ వివరాలు పొందలేరు

ఆ తర్వాత మీరు 011-22901406 మిస్డ్ కాల్ ఇవ్వాలి. ఆ తర్వాత మీకు ఎస్సెమ్మెస్ వస్తుంది. ఇందులో మెంబర్ ఐడీ, పీఎఫ్ నెంబర్, పేరు, పుట్టిన తేదీ, ఈపీఎఫ్ బ్యాలెన్స్, లాస్ట్ కంట్రిబ్యూషన్ వంటి వివరాలు ఉంటాయి. ఇక్కడ మీరు ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి. మీరు పనిచేసే కంపెనీ ప్రయివేటు ట్రస్ట్ అయి ఉంటే అప్పుడు మీరు మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు పొందలేరు. మీరు మీ కంపెనీని సంప్రదించాల్సి ఉంటుంది.

మిస్డ్ కాల్ సర్వీస్ పని చేయకుంటే

మిస్డ్ కాల్ సర్వీస్ పని చేయకుంటే

కొన్ని సందర్భాల్లో మిస్డ్ కాల్ సర్వీస్ పని చేయకపోవచ్చు. ఇలాంటి సమయంలో మీరు ఈపీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకునేందుకు ఇతర మార్గాలను అనుసరించడం మేలు. మొబైల్ ఎస్సెమ్మెస్, ఉమాంగ్ యాప్ సాయంతో బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. డైరెక్ట్‌గా ఈపీఎఫ్‌వో పోర్టల్‌కు వెళ్లి కూడా ఈపీఎఫ్ బ్యాలెన్స్ చూసుకోవచ్చు.

మిస్డ్ కాల్ వల్ల

మిస్డ్ కాల్ వల్ల

మీరు మిస్ కాల్ ఇచ్చేందుకు స్మార్ట్ ఫోన్ మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. ఏ ఫోన్ నుంచి అయినా మిస్డ్ కాల్ ఇవ్వవచ్చు. ఎప్పుడో ఓసారి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాం. దీనికి మొబైల్ యాప్ అంతగా ఉపయుక్తం కాదు. అంతేకాదు, దీని కోసం మీ ఫోన్లో డేటా, స్పేస్ వంటివి చూసుకోవాలి. ఎస్సెమ్మెస్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. టైప్ చేయడం కంటే మిస్డ్ కాల్ బెట్టర్ అనుకునే వారు కూడా ఉంటారు. ముఖ్యంగా ఎస్సెమ్మెస్ వంటివి ఎక్కువగా చేయలేని వారికి మిస్డ్ కాల్ ఉపయుక్తం. ఈ సేవలు ఉచితం.

Read more about: epf pf eps ఈపీఎప్
English summary

మిస్డ్‌కాల్‌తో పీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ ఎలా చేక్ చేసుకోవాలి? మరిన్ని విషయాలు తెలుసుకోండి | How To Check Your EPF Balance By Missed Call?

You can check your PF balance by giving a missed call. For that, we need valid UAN number and Registered mobile number. Once you have both, give a missed call on 011 229 01 406. You will receive an SMS that will denote your PF number, age, name, and balance.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X