For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ATM కార్డు రూల్స్: టాప్ బ్యాంకుల్లో ఛార్జీలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి

|

ఇప్పుడు దాదాపు అందరి చేతుల్లోను ఏటీఎం కార్డులు ఉంటున్నాయి. బ్యాంకులకు వెళ్లి నగదు తీసుకునే కాలం పోయింది. ఇప్పుడు ఏటీఎం సెంటర్లకు వెళ్లి డబ్బులు తీస్తున్నారు. ఎక్కడైనా ఏమైనా కొనుగోలు చేస్తే ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్ లేదా కార్డుతో డబ్బులు చెల్లిస్తున్నారు. అయితే ఏటీఎం కార్డును ఉపయోగించి ఆయా బ్యాంకుల కస్టమర్లు పరిమితమైనన్నిసార్లు మాత్రమే డబ్బులు ఉపసంహరించుకోగలరు. ఉచిత ట్రాన్సాక్షన్‌లు దాటితే దానికి ఛార్జ్ ఉంటుంది. ఏటీఎం కార్డును బట్టి, లొకేషన్‌ను బట్టి ఏటీఎం కార్డు ఉపయోగించి ఇన్నిసార్లు మాత్రమే డబ్బులు విత్ డ్రా చేసుకోవచ్చునని పరిమితి ఉంటుంది. మెట్రో, నాన్ మెట్రో, హోమ్ బ్యాంక్ ఏటీఎం, ఇతర బ్యాంకు ఏటీఎం.. వంటి అంశాల ఆధారంగా లిమిట్స్ ఉంటాయి.

 ఎస్బీఐ ఏటీఎం కమ్ డెబిట్ కార్డు

ఎస్బీఐ ఏటీఎం కమ్ డెబిట్ కార్డు

- ఎస్బీఐ నార్మల్ (క్లాసిక్/గ్లోబల్) ఏటీఎం కమ్ డెబిట్ కార్డును జారీ చేసేందుకు ఛార్జీలు ఏమీ ఉండవు. గోల్డ్ డెబిట్ కార్డు జారీ చేస్తే ట్యాక్స్‌తో కలిపి రూ100 ఛార్జ్, ప్లాటినమ్ డెబిట్ కార్డు అయితే ట్యాక్స్‌తో కలిపి రూ.306 చార్జ్ ఉంటుంది.

- డెబిట్ కార్డు యాన్యువల్ మెయింటెనెన్స్ ఛార్జీల కింద క్లాసిక్ డెబిట్ కార్డుకు రూ.100 (ట్యాక్స్ అదనం), సిల్వర్/గ్లోబల్/యువ/గోల్డ్ డెబిట్ కార్డుకు రూ.150 (ట్యాక్స్ అదనం), ప్లాటినమ్ డెబిట్ కార్డుకు రూ.200 (ట్యాక్స్ అదనం), ప్రైడ్/ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డుకు రూ.300 (ట్యాక్స్ అదనం) చార్జ్ ఉంటుంది.

- డెబిట్ కార్డు రీప్లేస్‌మెంట్ ఛార్జ్ రూ.204 (ట్యాక్స్‌తో కలిపి)

- డూప్లిక్టే పిన్/పిన్ రీజనరేషన్ కోసం రూ.51 (ట్యాక్స్‌తో కలిపి)

- డబ్బులు విత్ డ్రా విషయానికి వస్తే... స్టేట్ బ్యాంక్ గ్రూప్ ఏటీఎంలలో డబ్బులు విత్ డ్రా చేస్తే ఛార్చ్ ఉండదు. ఒక కేలండర్ నెలలో ఇతర బ్యాంకులలో 5సార్లు ఉచితం. అయితే ఇది కేవలం సేవింగ్స్ అకౌంట్‌కు మాత్రమే. 5సార్లకు మించి ఇతర బ్యాంకులలో ఏటీఎం కార్డును ఉపయోగిస్తే (సేవింగ్ ఐతే 5సార్లు, సేవింగేకతర అయితే మొదటిసారి).. ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.17 (ట్యాక్స్ కలిపి), నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.6 (ట్యాక్స్ కలిపి) ఛార్జ్ ఉంటుంది.

హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం కమ్ డెబిట్ కార్డు

హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం కమ్ డెబిట్ కార్డు

-హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎం కార్డుకు ఛార్జ్ ఉండదు. ఏటీఎం కార్డు రీప్లేస్‌మెంట్‌కు ట్యాక్స్‌తో కలిపి రూ.200 ఛార్జ్ చేస్తారు. డెబిట్ కార్డు యాన్యువల్ ఫీ (రెగ్యులర్) రూ.150, ప్లాటినమ్ అయితే రూ.750, డెబిట్ కార్డు రెన్యువల్ (రెగ్యులర్) అయితే రూ.150, ప్లాటినమ్ అయితే రూ.750 ఛార్జ్ చేస్తారు.

- రీప్లేస్‌మెట్ ఛార్జీలు రూ.200. యాడ్ ఆన్ కార్డకు మొదటి ఏడాది ఛార్జ్ ఉండదు. ఆ తర్వాత ఏడాదికి రూ.150.

- హెచ్‌డీఎఫ్‌సీ ఏటీఎంలలో ట్రాన్సాక్షన్స్‌కు ఛార్జ్ ఉండదు. హెచ్‌డీఎఫ్‌సీ యేతర బ్యాంక్ ఏటీఎంలలో అన్ని నగరాల్లో కూడా 5 ట్రాన్సాక్షన్లు ఉచితం.

5సార్లకు మించి ఇతర బ్యాంకుల ఏటీఎంలలో డబ్బులు డ్రా చేస్తే.. క్యాష్ విత్ డ్రా చేస్తే రూ.20 (అప్లికెబుల్ ట్యాక్స్), నాన్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్‌కు రూ.8.5 (అప్లికెబుల్ ట్యాక్స్)

- పిన్ రీజనరేషన్ ఛార్జ్ రూ.50 (ట్యాక్స్ అదనం)

- క్యుములేటివ్ ఆఫ్ డిపాజిట్స్ అండ్ విత్ డ్రా - రూ.2 లక్షల వరకు ఒక్కో అకౌంట్‌కు ఉచితం. రూ.2 లక్షలు దాటితే ప్రతి రూ.వెయ్యికి రూ.5 ఛార్జ్ చేస్తారు. కనీసం రూ.150 మరియు అప్లికెబుల్ ట్యాక్స్

- థర్డ్ పార్టీ ట్రాన్సాక్షన్ లిమిట్ రోజుకు రూ.25వేలు. రూ.150 ప్లస్ ట్యాక్స్.

 ఐసీఐసీఐ ఏటీఎం కమ్ డెబిట్ కార్డు

ఐసీఐసీఐ ఏటీఎం కమ్ డెబిట్ కార్డు

ఐసీఐసీఐ బ్యాంకులో జాయినింగ్ ఫీ రూ.250 ప్లస్ జీఎస్టీ. యాన్యువల్ ఫీ రూ.250 మరియు జీఎస్టీ. కార్డు రీప్లేస్‌మెంట్ అయితే రూ.199 మరియు జీఎస్టీ. ఐసీఐసీఐ బ్యాంకు ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకుంటే ఉచితం. ఇతర బ్యాంకుల నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకుంటే ఒకసారి విత్ డ్రాకు రూ.20 మరియు జీఎస్టీ. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి బ్యాలెన్స్ తెలుసుకోవాలనుకుంటే ఉచితం. ఇతర బ్యాంకుల ఏటీఎం ద్వారా బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే రూ.8 మరియు జీఎస్టీ.

English summary

ATM కార్డు రూల్స్: టాప్ బ్యాంకుల్లో ఛార్జీలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి | ATM Card Rules: Compare The Transaction Charges Levied By Top Banks

Here's a comparison of various types of ATM cum debit card charges levied by SBI, HDFC Bank and ICICI Bank.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X