For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంటి కోసం ఋణం తీసుకుంటున్నారా..ఐతే ఇవి తప్పక తెలుసుకోండి.

సొంతిల్లు ప్రతి సామాన్యుడి కల. చాలా మంది తమ సొంతింటి కలను బ్యాంకు నుంచి రుణం పొంది తీర్చుకుంటారు.

By bharath
|

సొంతిల్లు ప్రతి సామాన్యుడి కల. చాలా మంది తమ సొంతింటి కలను బ్యాంకు నుంచి రుణం పొంది తీర్చుకుంటారు. ఐతే బ్యాంకులు ఇంటి రుణం సులభంగా ఇస్తున్నప్పటికీ... రుణం పొందేవారు దానికి సంబంధించి పూర్తి వివరాలను ముందుగా తెలుసుకోవాలి.

బ్యాంకులు రుణం ఇచ్చే సమయంలో కొన్ని ముఖ్యమైన విషయాలను దాచవచ్చు లేదా బహిర్గతం చేయదు. కాబట్టి బ్యాంకు నుంచి రుణం తీసుకునే మందు కొన్ని విషయాలపై పూర్తి అవగాహనను పెంచుకుందాం. ఇంటిరుణం తీసుకునే ముందు తెలుసుకోవాల్సిన ప్రాథమిక నిబంధలను ఏంటో తెలుసుకుందాం.

వాల్యుయేషన్ ఫీజు

వాల్యుయేషన్ ఫీజు

బ్యాంకు ఇంటి రుణం ఇచ్చే ముందు మీ ఆస్తి పత్రాలను సరిచూస్తుంది. ఒక వేళ మీరు తీసుకున్న రుణం కట్టలేని విషయంలో తిరిగి ఆ మొత్తాన్ని రాబట్టుకునేలా ప్రణాళిక రచిస్తుంది. ఇందు కోసం గాను ఇంజనీర్లు మీ సైట్‌ను సందర్శించి.... భవనం లేదా అపార్ట్‌మెంట్‌పై కోట్స్‌ను ఇస్తారు. ఈ ఛార్జీలను దరఖాస్తుదారుడు భరించాల్సి ఉంటుంది.

డాక్యుమెంటేషన్ ఛార్జీలు

డాక్యుమెంటేషన్ ఛార్జీలు

ఇంటి రుణం పొందేందుకు ఎక్కవ భాగం పేపర్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఇందుకు గాను బ్యాంకులు రుణం ఇచ్చే మందు దరఖాస్తుదారుని నుంచి ఛార్జీలు వసూలు చేస్తారు. బ్యాంకుకు పేపర్లు సమర్పించే ముందు రెండు కాపీలు జిరాక్స్ తీసుకుని మీ వద్ద ఉంచుకుంటే మంచింది.

ఇంటి రుణం మార్చుకునే అవకాశం

ఇంటి రుణం మార్చుకునే అవకాశం

బ్యాంకు నుంచి ఇంటి రుణం పొందిన తర్వాత వడ్డీ రేటు ఎక్కువగా ఉంటే, మరొక బ్యాంకు తక్కువకే ఇంటి రుణం అందిస్తుంటే ఆ బ్యాంకుకు మారడం మంచిది. ఇలాంటి సందర్భంలో లోన్ మొత్తాన్ని ముందుగానే చెల్లించే ఆప్షన్‌ను ఎంచుకోండి.

కొన్ని సందర్భాల్లో బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేటు నుంతి తక్కువ వడ్డీ రేటు పొందే రుణానికి మార్చడం జరుగుతుంది. ఇలా మార్చుకునేటప్పుడు మీరు తీసుకున్న రుణాన్ని బట్టి కొంత ఫీజుగా బ్యాంకులు వసూలు చేస్తాయి.

స్టాంప్ డ్యూటీ

స్టాంప్ డ్యూటీ

స్టాంప్ డ్యూటీ అనేది రాష్ట్రాన్ని బట్టి మారుతుంది. మీరు కొనుగోలు చేసిన ఆస్తిని బట్టి స్టాంప్ డ్యూటీ ఆధాపడి ఉంటుంది. వాల్యుయేషన్ సంస్థనుంచి మీ అపార్ట్‌మెంట్ విలువ, కారు పార్క్ విలువ, ఫ్లోర్ రేటు లాంటి అంశాలు ఉంటాయి.

వేరే ఇతర ఛార్జీలు

వేరే ఇతర ఛార్జీలు

ఇంటి రుణం పొందిన దరఖాస్తు దారు తర్వాత చెల్లించాల్సినవి చాలానే ఉన్నాయి. ప్రాసెసింగ్ ఛార్జీలు, డాక్యుమెంటేషన్, చివరి చెల్లింపు, ఫ్లోటింగ్ వడ్డీ రేటు రుణం, చట్టపరమైన ఫీజు, సాంకేతిక తనిఖీ రుసుము, రుణ పదవీకాలం, రుణ పునర్నిర్మాణ సమయంలో వివిధ రుణ ప్యాకేజిలు చెల్లించాల్సి ఉంటుంది.

ఖాతాదారు చైతన్యం

ఖాతాదారు చైతన్యం

ప్రతి రుణదాత మీరు తీసుకున్న ఫీజుకి సరైన అంచనా ఉండాలి. ఈ రుసుము మీరు తీసుకున్న బ్యాంకు మీద ఆధారపడి మాఫీ చేయవచ్చు లేదా చర్చించుకోవచ్చు. మీ ఆర్ధిక ప్రణాళికలో స్టాంపు డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఖర్చులను మర్చిపోకుండా సూచించాలి.

Read more about: loan home loan money housing loan
English summary

ఇంటి కోసం ఋణం తీసుకుంటున్నారా..ఐతే ఇవి తప్పక తెలుసుకోండి. | Important Things You Should Know Before Taking A Home Loan

Taking a home loan is easier said than done. Though it may seem all banks are eager to lend, getting a loan sanctioned can be a tedious task.
Story first published: Monday, March 4, 2019, 16:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X