For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కరెంట్ అకౌంట్ ఎవరు తెరవాలో మీకు తెలుసా?

By girish
|

వ్యాపారం అంటేనే డబ్బుతో ముడిపడి ఉంటుంది అంటే రోజుకు ఎన్నో లావాదేవీలు ఉంటాయి. అలాగే ప్రతి రోజూ పెద్ద ఎత్తున ట్రాన్సక్షన్స్ జరుగుతుంటాయి. నోట్ల రద్దు తర్వాత నగదు ఆధారంగా నడిచే వ్యాపారాల్లో చాలామటుకు కార్డులు, వాలెట్ల ద్వారా జరుగుతున్నాయి.

పొదుపు ఖాతాలు

పొదుపు ఖాతాలు

పీఓఎస్ యంత్రాలు కావాలంటే కరెంటు ఖాతా ఉండాల్సిందే. మరి, ఇప్పటివరకూ పొదుపు ఖాతాలు మాత్రమే ఉన్న చిన్న వ్యాపారులూ కరెంటు ఖాతాలను ప్రారంభించాల్సిన అవసరం ఏర్పడింది. మరి వీటిని ఎవరు తీసుకోవచ్చు? ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.

వ్యాపారంలో

వ్యాపారంలో

వ్యాపారంలో ఎన్నో రకాల చెల్లింపులు జరుగుతుంటాయి. ఖాతాదారులు చెల్లించాల్సిన డబ్బు ఇతరుల నుంచి రావాల్సిన నగదును జమ చేసేందుకు, సరకు కొన్నప్పుడు చెక్కులు ఇవ్వడానికీ బ్యాంకు ఖాతా ఒకటి తప్పనిసరి అవసరం.

కరెంట్ ఖాతాలను

కరెంట్ ఖాతాలను

ఇలా రోజు నగదు లావాదేవీల నిర్వహణకు ప్రధానంగా కరెంట్ అకౌంట్. ఈ ఖాతాలో లావాదేవీలపై ఎలాంటి షాత్ల్య్ ఉండవు లేవు. రోజులో ఎన్నిసార్లైనా జమ చేసుకోవచ్చు, తీసుకోవచ్చు. సాధారణంగా బ్యాంకులు భిన్న రకాల కరెంట్ ఖాతాలను నిర్వహిస్తున్నాయి. అందించే సేవలు, సౌకర్యాలను బట్టి ఈ ఖాతాలను విభజించారు.

బ్యాంకులు

బ్యాంకులు

చిన్న వ్యాపారాలు నిర్వహించే వారికోసం రెగ్యులర్ కరెంటు ఖాతాలు, పెద్ద ఎత్తున వ్యాపారం నిర్వహించే వారికి ప్రీమియం ఖాతాలు అని బ్యాంకులు ఈ ఖాతాలను అందిస్తున్నాయి. ఎగుమతి, దిగుమతి వ్యాపారాలు చేసేవారికీ ప్రత్యేకంగా ఖాతాలుంటాయి. కొన్ని బ్యాంకులు 5-6 రకాల ఖాతాలనూ అందిస్తున్నాయి. ఖాతాదారులు తమ అవసరాలకు అనుగుణంగా ఉన్న ఖాతాను ఎంపిక చేసుకొని లావాదేవీలు నిర్వహించుకోవడమే తరవాయి. ఇప్పటికే మీకు ఉన్న పొదుపు ఖాతాను కూడా కరెంటు ఖాతాగా మార్చుకునేందుకు వీలుంది

కరెంట్ ఖాతాలను తెరవాలంటే

కరెంట్ ఖాతాలను తెరవాలంటే

  • వ్యక్తిగతంగా, ఉమ్మడిగా
  • యాజమాన్య సంస్థలు
  • భాగస్వామ్య సంస్థలు
  • హెచ్‌యూఎఫ్
  • లిమిటెడ్ కంపెనీలు
  • అసోసియేషన్, క్లబ్‌లు, సొసైటీలు మొదలైనవి
  • ట్రస్టులు
  •  కావాల్సిన పత్రాలు

    కావాల్సిన పత్రాలు

    • వ్యాపార నిర్వహణకు సంబంధించి స్థానిక సంస్థలు జారీ చేసిన అనుమతి పత్రాలు
    • చిరునామా ధ్రువీకరణకు కరెంట్ బిల్లు, టెలిఫోన్ బిల్లు, బ్యాంకు ఖాతా స్టేట్‌మెంట్లలో దేన్నైనా చూపించాలి.
    • వ్యక్తిగత గుర్తింపు రుజువుకు పాస్‌పోర్ట్ కాపీ, డ్రైవింగ్ లైసెన్స్, ఓటరు గుర్తింపు కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డులలో ఏదైనా ఉండాలి.
    • ఆదాయ రుజువు కోసం... పాన్ కార్డు, ఆదాయ వివరాలు వెల్లడించాలి.
    • వృత్తి నిర్వహించే వారు దానికి సంబంధించి తగిన ఆధారాలు.
    • సాధారణ పొదుపు ఖాతాలతో పోలిస్తే కరెంటు ఖాతాలకు ఉన్న ప్రత్యేకతలు వేరుగా ఉంటాయి. ఖాతాల నిర్వహణ సరిగ్గా ఉన్న వ్యాపార సంస్థలకు కొన్ని బ్యాంకులు ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్నీ ఇస్తాయి

Read more about: current account
English summary

కరెంట్ అకౌంట్ ఎవరు తెరవాలో మీకు తెలుసా? | How to Open Current Account in Bank

Business means money, which means there are many transactions per day. There are big transactions every day.
Story first published: Friday, October 12, 2018, 16:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X