For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పేద పిల్లల ఆకలి తీర్చే అద్భుత కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.

పాఠశాలకు వెళ్లే పేద పిల్లల ఆకలిని తీర్చి తద్వారా వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు అన్నంరిత పథకాన్ని ప్రారంభించారు.

By bharath
|

పాఠశాలకు వెళ్లే పేద పిల్లల ఆకలిని తీర్చి తద్వారా వారి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసేందుకు అన్నంరిత పథకాన్ని ప్రారంభించారు.దీని వల్ల దేశం లో అనేక మంది పేద పిల్లకు లబ్ది చేకూరనుంది.

మధ్యాహ్న భోజనం కార్యక్రమం

మధ్యాహ్న భోజనం కార్యక్రమం

అన్నంరిత పథకాన్ని భారతదేశ ప్రభుత్వం చేపట్టిన మధ్యాహ్న భోజనం కార్యక్రమం మరియు దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన పాఠశాలల్లో ISKCON ఆహార రిలీఫ్ ఫౌండేషన్ (IFRF)వారు అమలు చేస్తున్నారు. వీటిలో ప్రభుత్వ మరియు ప్రభుత్వ-సహాయక పాఠశాలలు ఉన్నాయి

రెండు ప్రధాన ఉద్దేశాలు

రెండు ప్రధాన ఉద్దేశాలు

ఈ కార్యక్రమానికి రెండు ప్రధాన ఉద్దేశాలు ఒకటి పిల్లల ఆకలి తీర్చడం మరియు రెండు నిరక్షరాస్యతను పాడదోలడం.

IFRF అనేది 2004 లో ఏర్పడిన లాభాపేక్షలేని స్వచ్ఛంద సంస్థ. దీని ప్రధాన కార్యాలయం ముంబాయి లో ఉంది. మధ్యాహ్న భోజన కార్యక్రమానికి మద్దతు ఇచ్చేందుకు 20 వంటశాలలు ఏర్పాటుచేసింది.

ఏడు రాష్ట్రాల్లో

ఏడు రాష్ట్రాల్లో

ఢిల్లీ, జార్ఖండ్, హర్యానా, రాజస్థాన్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, పశ్చిమబెంగాల్ వంటి ఏడు రాష్ట్రాల్లో సుమారు 1.2 మిలియన్ల మంది పిల్లలు ఈ సౌకర్యాన్ని ప్రతిరోజూ పొందుతున్నారు.

ఎంపిక చేసిన పాఠశాలల్లో

ఎంపిక చేసిన పాఠశాలల్లో

ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ మధ్యాహ్న భోజన పథకం ఎంపిక చేసిన పాఠశాలల్లో బాగానే అమలవుతోంది కానీ,ఇంకా దేశం లోని అనేక ప్రాంతాల్లో పిల్లలు ఆకలితో అలమటిస్తూనే ఉన్నారు.

UNICEF నివేదిక ప్రకారం

UNICEF నివేదిక ప్రకారం

UNICEF నివేదిక ప్రకారం, మొత్తం సుమారు దేశవ్యాప్తంగా 60 మిలియన్ల పిల్లల్లో, 50 శాతం మంది బరువు తక్కువగా ఉన్నారు, 45 శాతం వారి వయసు కన్నా చాలా చిన్నగా ఉన్నారు,75 శాతం మంది రక్తహీనతో భాదపడుతున్నారు, 27 శాతం మంది వారి ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడం దీనికి ప్రధాన కారణం తీవ్రమైన పోషకాహార లోపం మరియు 75 శాతం విటమిన్ ఎ లోపం.

పిల్లలకు సహాయం

పిల్లలకు సహాయం

ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పట్నుండి, IFRF అనేక మంది బలహీనమైన పిల్లలకు సహాయం అందించింది. అన్నంరిత కార్యక్రమం కారణంగా, పాఠశాలల్లో హాజరు పెరిగింది మరియు పిల్లలు వారి పరీక్షల్లో మంచి ఫలితాలు సాధిస్తున్నారని అన్నారు.

ఆహరం యొక్క ప్రాముఖ్యత

ఆహరం యొక్క ప్రాముఖ్యత

అన్నంరిత అంటే 'food as pure as nectar'ప్రతిఒక్కరికి ఆహరం యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తుంది. ఈ కార్యక్రమం పిల్లలకు ఆరోగ్యకరమైన మరియు పోషకమైన ఆహారాన్ని అందించడం.

చిన్న సహాయంతో

చిన్న సహాయంతో

ఇప్పటికే అనేకమంది పిల్లలు ప్రయోజనం పొందుతున్నప్పటికీ,ఇంకా చాలా మంది పేద పిల్లలకు ఈ ప్రయోజనం ఆడాల్సి ఉంది.మీరు చేసే చిన్న సహాయంతో ఎంతో మంది పేద పిల్లల ఆకలి తీర్చచ్చంటున్నారు.

సంవత్సరానికి రూ.450 రూపాయలు

సంవత్సరానికి రూ.450 రూపాయలు

కాబట్టి, మీరు ఈ పిల్లలకు సహాయం చేయాలనుకుంటే,సంవత్సరానికి రూ.450 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమానికి మీ వంతు సహాయం చేసి పేద పిల్లల ఆకలి మరియు నిరక్షరాస్యతను పారదోలండి.

Read more about: govt scheme midday meal children
English summary

పేద పిల్లల ఆకలి తీర్చే అద్భుత కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది. | Annamrita, Midday Meal Program To Poor Children

In order to encourage poor children to go to schools and satisfy their hunger, Annamrita is launched.
Story first published: Thursday, October 4, 2018, 12:54 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X