For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

క్రెడిట్ స్కోర్ బాగా లేక‌పోతే రుణం రాదా?

డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం పెరుగుతున్న దృష్ట్యా తప్పనిసరిగా మీ ద‌గ్గ‌ర కార్డు ఉంటే మేలు. కానీ, రెండు వైపులా పదునున్న క్రెడిట్‌ కార్డును వాడేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. అయితే ఈ క్రెడిట్

|

క్రెడిట్‌ స్కోరు... ఒక వ్యక్తి ఆర్థికంగా ఎంత బ‌లంగా, బ‌ల‌హీనంగా ఉన్నారో తెలుపుతుంది. అప్పులు ఇవ్వడం మొదలు.. ఉద్యోగ నియామకాల వరకూ ఇప్పుడిదే కీలకంగా మారింది. మీ స్కోరు కనీసం 750 ఉంటే బాగున్నట్లే లెక్క. ఇప్పటి వరకూ మీకు ఏ రుణమూ లేకపోతే.. మీ క్రెడిట్‌ స్కోరు, రుణ చరిత్రను పెంచుకునేందుకు వెంటనే ఓ క్రెడిట్‌ కార్డును తీసుకోండి. డిజిటల్‌ చెల్లింపులకు ప్రాధాన్యం పెరుగుతున్న దృష్ట్యా తప్పనిసరిగా మీ ద‌గ్గ‌ర కార్డు ఉంటే మేలు. కానీ, రెండు వైపులా పదునున్న క్రెడిట్‌ కార్డును వాడేప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిందే. అయితే ఈ క్రెడిట్ కార్డు వాడ‌కం వ‌ల్ల క్రెడిట్ స్కోర్ ఎలా ప్ర‌భావితం అవుతోందో, ఎందుకు అది ముఖ్య‌మో ఈ కింద తెలుసుకుందాం.

1. బిల్లులు స‌మయానికి చెల్లించండి

1. బిల్లులు స‌మయానికి చెల్లించండి

* తొలిసారిగా కార్డు వాడుతున్నారు కాబట్టి, బిల్లులకు సంబంధించిన విషయాల్లో కచ్చితంగా ఉండండి. మీపై నమ్మకం కలిగేలా ప్రవర్తించండి. అప్పుడే మీ క్రెడిట్‌ స్కోరు పెరగడానికి అవకాశం ఉంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ స‌మ‌యానికి బిల్లు చెల్లింపు అయ్యేలా చూసుకోండి

 2. ఎక్కువ కార్డులుంటే జాగ్ర‌త్త‌

2. ఎక్కువ కార్డులుంటే జాగ్ర‌త్త‌

* ఇప్పటికే మీ వద్ద మూడు క్రెడిట్‌ కార్డుల కన్నా ఎక్కువున్నాయా? మళ్లీ కొత్త కార్డు తీసుకోవాలని భావిస్తున్నారా? అయితే.. మీ చేజేతులా క్రెడిట్‌ స్కోరు తగ్గించుకోవడానికి కృషి చేస్తున్నారన్నమాట.

3. ఎక్కువ ప‌రిమితి ఉండే కార్డు వైపు మొగ్గు

3. ఎక్కువ ప‌రిమితి ఉండే కార్డు వైపు మొగ్గు

* గరిష్ఠ పరిమితి ఇచ్చే కంపెనీ కార్డును మాత్రమే ఎంచుకోండి. మీరు అంత మొత్తం వినియోగించుకోకున్నా ఎక్కువ మొత్తంలో ఉండటం వల్ల క్రెడిట్‌ స్కోరు పెరిగేందుకు ఆస్కారం ఉంటుంది.

4. పాత కార్డుకే ప్రాధాన్య‌త‌

4. పాత కార్డుకే ప్రాధాన్య‌త‌

* ఏళ్ల తరబడి వాడుతున్న దానిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకండి. కార్డును రద్దు చేసుకోవాల్సిన అవసరం వస్తే.. కొత్తగా తీసుకున్న వాటిని మొదట వదిలించుకోండి. ఎందుకంటే పాత కార్డులో రుణ చ‌రిత్ర రికార్డ‌యి ఉంటుంది. లోన్ రావ‌డానికి ఇది ఉప‌యోగ‌ప‌డొచ్చు

5. కార్డుంటే వాడ‌టం బెట‌ర్

5. కార్డుంటే వాడ‌టం బెట‌ర్

* ఒకటికి మించి కార్డులుంటే అన్ని కార్డులను వాడటానికి ప్రయత్నించండి. కొన్ని కార్డు కంపెనీలు మీరు ఆరు నెలలకు మించి వాడకుంటే.. మీరు కార్డును రద్దు చేసుకున్నట్లుగా భావిస్తాయి. ఇలాంటప్పుడు మీ క్రెడిట్‌ స్కోరు ప్రభావితం అయ్యే అవకాశాలున్నాయి.

6. ఒక‌టే అవ‌స‌రం అనుకుంటే మిగిలిన‌వి ర‌ద్దు చేయండి

6. ఒక‌టే అవ‌స‌రం అనుకుంటే మిగిలిన‌వి ర‌ద్దు చేయండి

* కొత్తగా వచ్చిన క్రెడిట్‌ కార్డుకు క్రెడిట్‌ పరిమితి భారీగా ఉండి, పాత కార్డుకు తక్కువ మొత్తంలో ఉందనుకోండి. రెండింటిలో ఒకదానిని రద్దు చేసుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు దేన్ని ఎంచుకోవాలి? ముందుగా మీ పాత క్రెడిట్‌ కార్డు బ్యాంకును సంప్రదించి మీ గురించి తెలియజేయండి. కొన్నేళ్లుగా ఎలాంటి ఆలస్యాలకు తావులేకుండా మీరు బిల్లులు చెల్లిస్తూ ఉంటే.. ఆ విషయాన్ని బ్యాంకుకు తెలియజేయండి. మీ కార్డు పరిమితిని పెంచాల్సిందిగా కోరండి. చాలా బ్యాంకులు ఈ విషయంలో సానుకూలంగా స్పందించే వీలుంది.

7. అన‌వ‌సరంగా కార్డు వాడొద్దు

7. అన‌వ‌సరంగా కార్డు వాడొద్దు

* క్రెడిట్‌ కార్డు పరిమితి ఉంది కదా అని చెప్పి.. అదేపనిగా కార్డును వాడటం మంచిది కాదు. మీ కార్డు పరిమితిలో 40శాతానికి మించి వాడకపోవడమే మంచిది. దీనివల్ల క్రెడిట్‌ కార్డు స్కోరు పెరగడానికి ఆస్కారం ఉంటుంది.

ఏడాదిలో ఒకసారి ఉచితంగా క్రెడిట్‌ స్కోరు, రుణ చరిత్ర పొందే అవకాశం ఉంది. దీనికోసం సిబిల్‌ వెబ్‌సైటును చూడండి.

Read more about: credit score credit card
English summary

క్రెడిట్ స్కోర్ బాగా లేక‌పోతే రుణం రాదా? | how your credit card usage will impact your credit score

It is important to note that when you pay the minimum amount on your credit card, it does not affect your credit score. Let us give en example. Normally, banks allow you to pay an outstanding of just 10 per cent of your total credit card outstanding amount
Story first published: Saturday, January 13, 2018, 15:16 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X