For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈఎల్ఎస్ఎస్ ద్వారా ప‌న్ను ఆదా, ఇంకా పెట్టుబ‌డి రాబ‌డికి హామీ

తమ పొదుపులో అధిక భాగాన్ని ప్రజలు ఈక్విటీల్లో మదుపు చేసేందుకు ఆసక్తి చూపుతారు. అయితే, ఈఎల్ఎస్ఎస్ ప‌థ‌కాల వ‌ల్ల‌ పలు విధాలుగా ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో పెట్టుబడులు చేసేందుకు ముందు కొన్ని ముఖ్యమైన విషయాల

|

బాగా డ‌బ్బులు రావాలంటే ఎక్కువ మంది చూసే మార్గం స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్‌మెంట్ల వైపే. అంద‌రికీ ఈక్విటీల్లో పెట్టుబ‌డి పెట్టే ధైర్యం ఉండ‌దు. ఎందుకంటే అక్క‌డ రిస్క్ ఎక్కువ‌. అయితే ఇలాంటి వారి కోస‌మే కేంద్ర ప్ర‌భుత్వం రూపొందించిన విధానం మ్యూచువ‌ల్ ఫండ్ ఆధారిత ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్(ఈఎల్ఎస్ఎస్). ఈఎల్ఎస్ఎస్ స్కీమ్‌ల ద్వారా పన్ను మినహాయింపు లభించేలా ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం కలుగుతుంది. ఈ పెట్టుబడులపై పన్ను మినహాయింపులు లభించడంతో, తమ పొదుపులో అధిక భాగాన్ని ప్రజలు ఈక్విటీల్లో మదుపు చేసేందుకు ఆసక్తి చూపుతారు. అయితే, ఈఎల్ఎస్ఎస్ ప‌థ‌కాల వ‌ల్ల‌ పలు విధాలుగా ప్రయోజనాలు ఉంటాయి. వీటిలో పెట్టుబడులు చేసేందుకు ముందు కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాలి. ఈఎల్ఎస్ఎస్‌ల గురించి తప్పనిసరిగా తెలుసుకోవాల్సిన 6 అంశాలు ఇవే.:

1. ఏమిటీ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్?

1. ఏమిటీ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్?

ఈక్విటీ, ఈక్విటీ ఆధారిత సెక్యూరిటీలలో పెట్టుబడులు చేసే ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌నే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అంటారు. కొన్ని ఫండ్స్ అయితే కొంత భాగం కార్పస్ ఇన్వెస్ట్‌మెంట్‌ను డెట్ సెక్యూరిటీస్‌లో చేస్తాయి. లాంగ్‌టెర్మ్‌లో ఇన్వెస్టర్‌కు సంపద సృష్టించడమే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ అసలైన లక్ష్యం.

 2. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ఎంత మొత్తం పెట్టుబడి చేయవచ్చు?

2. ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్‌లో ఎంత మొత్తం పెట్టుబడి చేయవచ్చు?

ఏకమొత్తంగా కానీ లేదా సిస్టమాటిక్ ఇన్వెస్ట్‌మెంట్ ప్లాన్(సిప్) ద్వారా కానీ ఒక ఇన్వెస్టర్ తన సొమ్మును ఈఎల్ఎస్ఎస్‌లో పెట్టుబడి చేయవచ్చు. వీటిలో సిప్ విధానాన్ని ఉత్తమమైనదిగా చెబుతారు. క్రమశిక్షణతో కూడిన ప్రణాళిక ద్వారా పెట్టుబడులు చేసేందుకు సిప్ అకాశం కల్పిస్తుంది. మీ ట్యాక్స్ సేవింగ్స్ పెట్టుబడులను 12 భాగాలుగా చేయడంతో.. పెట్టుబడిని మీ లిక్విడిటీకి అనుగుణంగా చేసేందుకు అవకాశం ఏర్పడుతుంది. రూపీ-కాస్ట్ యావరేజ్ చేసేందుకు సిప్ ఉపయోగపడుతుంది. ఏకమొత్తంగా ఈఎల్ఎస్ఎస్‌లలో పెట్టుబడులు చేయడం అంటే.. కనిష్ట స్థాయిల వద్ద ఇన్వెస్ట్‌మెంట్ చేసే అవకాశం కోల్పోవడమే.

 3. ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడులు నాకు ఎలాంటి పన్ను ప్రయోజనాలను కల్పిస్తాయి?

3. ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడులు నాకు ఎలాంటి పన్ను ప్రయోజనాలను కల్పిస్తాయి?

ఆదాయపు పన్ను చట్టం సెక్షన్ 80సీ ప్రకారం ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడులను మీ స్థూల ఆదాయం నుంచి మినహాయించుకునే అవకాశం లభిస్తుంది. అయితే, ఒక ఏడాదిలో గరిష్టంగా రూ. 1.5 లక్షల వ‌ర‌కూ మాత్రమే పెట్టుబడుల వరకు మాత్రమే మినహాయింపులు లభిస్తాయి. ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడులకు మూడు రకాల మినహాయింపుల లాభం ఉంటుంది. అంటే మీరు చేసే పెట్టుబడులపై పన్ను మినహాయింపులతో పాటు.. అందుకునే డివిడెండ్స్.. అందుకునే క్యాపిటల్ గెయిన్స్‌పై కూడా ఎలాంటి పన్నులు ఉండవు.

4. ఈఎల్ఎస్ఎస్‌లో ఎంతకాలం లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది?

4. ఈఎల్ఎస్ఎస్‌లో ఎంతకాలం లాక్-ఇన్ పీరియడ్ ఉంటుంది?

లాక్ఇన్ పీరియడ్ 3 ఏళ్లపాటు ఉంటుంది. ఈ కాలంలో మీరు ఈ యూనిట్స్‌ను విక్రయించుకోలేరు. అయితే, మధ్యలో డివిడెండ్ పేమెంట్స్ చెల్లించబడతాయి. అయితే ఇతర ట్యాక్స్ సేవింగ్ సాధనాలు అయిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఫిక్సెడ్ డిపాజిట్, కిసాన్ వికాస్ పత్రాలతో పోల్చితే ఈఎల్ఎస్‌ఎస్‌లలో లాక్ఇన్ గడువు తక్కువ.

5. ఈఎల్ఎస్ఎస్‌ల రాబడులపై గ్యారంటీ ఉంటుందా?

5. ఈఎల్ఎస్ఎస్‌ల రాబడులపై గ్యారంటీ ఉంటుందా?

ఈఎల్ఎస్ఎస్ పెట్టుబడులు రాబడులపై ఎలాంటి గ్యారంటీ ఉండదు. కానీ ఇవి మార్కెట్ ఆధారిత పెట్టుబడులు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. మూడేళ్ల లాక్ఇన్ పీరియడ్ అంటే లాంగ్‌టెర్మ్‌లో మార్కెట్స్ ఇచ్చే లాభాలను అందుకోవచ్చు. స్టా్క మార్కెట్ కరెక్షన్స్‌కు భయపడి మధ్యలో విక్రయించేందుకు అవకాశం లేకపోవడంతో.. లాంగ్‌టెర్మ్‌లో రిస్క్ తక్కువగానే ఉంటుంది

6. ఈఎల్ఎస్ఎస్‌ పెట్టుబడిపై రాబడి ఎలా వస్తుంది?

6. ఈఎల్ఎస్ఎస్‌ పెట్టుబడిపై రాబడి ఎలా వస్తుంది?

మీ కష్టార్జితాన్ని పన్ను భారం లేని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు చేసేందుకు, దీర్ఘకాలంలో సంపద సృష్టి చేసేందుకు ఈఎల్ఎస్ఎస్ ఇన్వెస్ట్‌మెంట్స్ ఉపయోగపడతాయి. ఇవి ఎలా పని చేస్తాయనే ఉదాహరణను చూద్దాం.

మీరు ఇన్వెస్ట్‌ చేసిన ఈఎల్ఎస్ఎస్ నిక‌ర ఆస్తుల విలువ‌ రూ. 30 అనుకుందాం. మీ దగ్గర రూ. 1.5 లక్షలు ఉన్నట్లయితే, ఆ మొత్తాన్ని సెక్షన్ 80సీ ప్రకారం పెట్టుబడి చేసి 5వేల ఈఎల్ఎస్ఎస్ యూనిట్లను పొందవచ్చు. మీరు గరిష్ట ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉన్నట్లయితే, మీరు మీ పెట్టుబడిపై 30 శాతం వరకు మినహాయింపు పొందవచ్చు. ఉదాహరణను సులభతరం చేసేందుకు సర్‌ఛార్జ్, సెస్‌లను మినహాయించి లెక్కించడం జరుగుతోందని గుర్తుంచుకోవాలి. పై ఉదాహరణ ప్రకారం రూ. 150000 పెట్టుబడిపై రూ. 45000 పన్ను మినహాయింపు లభిస్తుందన్న మాట. అంటే ఈఎల్ఎస్ఎస్‌లో మీ ప్రభావిత పెట్టుబడి అపుడు రూ. 1,05,000 మాత్రమే.

గత మూడేళ్లుగా ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ సగటున వార్షికంగా 13.8 శాతం రాబడులను అందించాయి. వార్షిక రిటర్న్ 13 శాతంగా లెక్కిస్తే, మీరు కొనుగోలు చేసిన యూనిట్ల ఎన్ఏవీ మూడేళ్ల చివరకు రూ. 43 అవుతుంది. అంటే మీరు పెట్టుబడి చేసిన రూ. 1,05,000.. రూ. 2,16,000కు వృద్ధి చెందుతుంది. అంటే మూడేళ్లలో మీ నికర పెట్టుబడి రెట్టింపునకు పెరిగిందన్న మాట.

English summary

ఈఎల్ఎస్ఎస్ ద్వారా ప‌న్ను ఆదా, ఇంకా పెట్టుబ‌డి రాబ‌డికి హామీ | How ELSS will be useful in getting tax benefits

what is the Elss how it will serve for tax savings ELSS is short for Equity Linked Savings Scheme. ELSS are tax-saving mutual funds which help the investors to reduce taxable income by up to Rs 1.5 lakh under Section 80C. ELSS funds have a lock-in period of only three years.
Story first published: Thursday, January 11, 2018, 16:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X