For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రీమియం చెల్లించ‌కపోయినందుకు పాల‌సీ ర‌ద్ద‌యిందా.. ఎలా?

అయితే, సరైన సమయంలో మీరు ప్రీమియం చెల్లించలేకపోయినపుడు ఏం చేయాలి? మీరు టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ పోగొట్టుకున్నట్లేనా లేక ఇచ్చిన సమయంలో తిరిగి పునరుద్ధరించుకోవచ్చా? ఈ విష‌యాల‌ను కింద తెలుసుకుందాం.

|

పాల‌సీ ల్యాప్స్ అయిందా... ఇలా చేయింది
కుటుంబ స‌భ్యుల‌కు ఆర్థిక ర‌క్ష‌ణ కోసం మ‌నం బీమా పాల‌సీ తీసుకుంటాం. వార్షిక ప్రీమియం తక్కువగా ఉండడం, సాధారణ వైద్య ప‌రీక్ష‌ల‌తో ఎవరైనా మంచి టెర్మ్ ఇన్సూరెన్స్ ప్లాన్ పొందడం ద్వారా.. మీ ప్రియమైన వ్యక్తులకు ఒక ఆర్థిక భ‌రోసా క‌ల్పిస్తాం.

అయితే, సరైన సమయంలో మీరు ప్రీమియం చెల్లించలేకపోయినపుడు ఏం చేయాలి? మీరు టెర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ పోగొట్టుకున్నట్లేనా లేక ఇచ్చిన సమయంలో తిరిగి పునరుద్ధరించుకోవచ్చా? ఈ విష‌యాల‌ను కింద తెలుసుకుందాం.

బీమా పాలసీ ల్యాప్స్ కావడం ఏంటి?

బీమా పాలసీ ల్యాప్స్ కావడం ఏంటి?

మీరు ఏ తరహా బీమా పాలసీ కొనుగోలు చేసినా, మీరు తప్పనిసరిగా స‌మ‌యానికి పాల‌సీ ప్రీమియం చెల్లించాలి. ఏవైనా కారణాలతో, బీమా కంపెనీ ఇచ్చిన గ్రేస్ పీరియడ్‌లోగా ప్రీమియం చెల్లించలేకపోతే, మీ పాలసీని నిలిపివేస్తారు. ఎక్స్‌పైర్ అయిన పాలసీని తిరిగి కొనసాగించే అవకాశం ఉండదు, ప్రత్యామ్నాయంగా మీరు మరొక సరికొత్త పాలసీ తీసుకోవాల్సి ఉంటుంది. సహజంగా ఇది ఎక్కువ ఖర్చుతో కూడుకున్న విషయం. పాలసీదారుని వయసు ఎక్కువ ఉంటే అప్పుడు ప్రీమియం ఎక్కువ ఉన్న పాల‌సీని కొనుగోలు చేయాల్సి వ‌స్తుంది.

జీవిత బీమా పాలసీ పాలసీ ల్యాప్స్ అయితే, అపుడు ఇలా చేయవచ్చు.

జీవిత బీమా పాలసీ పాలసీ ల్యాప్స్ అయితే, అపుడు ఇలా చేయవచ్చు.

ల్యాప్స్ అయిన పాలసీని పున‌రుద్ద‌రించుకోవచ్చు ఇలా...

మీరు తగిన సమయంలో మీ బీమా పాలసీకి ప్రీమియం చెల్లించకపోయినట్లయితే, మీ పాలసీని గ్రేస్ పీరియడ్ స్థితిలోకి బదలాయిస్తారు. ఈ సమయంలో కూడా సహజంగా పాలసీ అమలులోనే ఉంటుంది, మరణం వంటి సమయాల్లో బీమా హామీ మొత్తాన్ని క్లెయిం చేసే వీలు ఉంటుంది. ప్రీమియం నెల‌వారీ, ఆరు నెల‌ల‌కు ఒక‌సారి, సంవ‌త్స‌రానికి ఒక‌సారి చెల్లించే పాల‌సీలకు అన్ని కంపెనీలు 15 రోజుల గ్రేస్ పీరియ‌డ్ ఇస్తున్నాయి. ఈ గ్రేస్ పీరియడ్‌ను ఒక్కో కంపెనీ ఒక్కోలా నిర్ణయించే అవకాశముంది. మొద‌ట ప్రీమియం చెల్లించేందుకు ఇబ్బంది అయినా క‌నీసం ఈ గ్రేస్ పీరియ‌డ్‌లోనైనా ప్రీమియం చెల్లించే ఏర్పాటు చేసుకోవాలి. అయినా డ‌బ్బు చెల్లింపు చేయ‌కపోతే ఏమ‌వుతుంద‌ని అనుకుంటున్నారా అయితే ఇది తెలుసుకోండి.

పాలసీ ల్యాప్స్ అయినపుడు ఏం జరుగుతుంది?

పాలసీ ల్యాప్స్ అయినపుడు ఏం జరుగుతుంది?

ఒకవేళ గ్రేస్ పీరియడ్ కూడా పూర్తయిపోయి, దాన్ని తిరిగి యాక్టివ్ చేసేందుకు ఎలాంటి ప్రీమియంలు చెల్లించకపోయినట్లయితే, ఆ పాలసీ ల్యాప్స్ అవుతుంది. పాలసీదారుడు మరణించినా సరే.. లబ్ధిదారులు ఎలాంటి ప్రయోజనం పొందలేరు. అంటే పాల‌సీ ర‌ద్ద‌యి ఇంత‌కు ముందు చెల్లించిన ప్రీమియం ప్ర‌యోజ‌నాలు సైతం పొంద‌లేరు

ఒక ఉదాహరణను చూద్దాం. ఒక వ్యక్తి తన టెర్మ్ ప్లాన్‌కు ప్రీమియం చెల్లించడంలో విఫలం అయి.. అతను/ఆమె ఏదైనా యాక్సిడెంట్‌లో మరణించారని అనుకుందాం. గ్రేస్ పీరియడ్ సమయంలో ఈ యాక్సిడెంట్ జరగగా, కుటుంబసభ్యులు క్లెయిమ్ చేసినపుడు, బీమా కంపెనీ తప్పనిసరిగా ప్రయోజనం చెల్లించాల్సిందే. అయితే, పాలసీ ల్యాప్స్ అయిన తరువాత ఈ సంఘటన జరిగినపుడు, ఇన్సూరెన్స్ కంపెనీలు మరణించిన వ్యక్తి కుటుంబానికి ఎలాంటి ప్రయోజనాన్ని చెల్లించవు.

పాలసీ పునరుద్ధరణ

పాలసీ పునరుద్ధరణ

అయితే, పాలసీ ల్యాప్స్ అయినంత మాత్రాన అది పూర్తిగా వృథా అయిపోయినట్లు భావించాల్సిన పని లేదు. దీన్ని తిరిగి వాడుకలోకి తెచ్చేందుకు కొంత కసరత్తు చేయాల్సి ఉంటుంది. అనేక కంపెనీలు ల్యాప్స్ అయిన పాలసీని తిరిగి రివైవ్ చేసేందుకు అవకాశం కల్పిస్తాయి. అయితే, ఇది మరింత ఖరీదు అయ్యే అవకాశం ఉంటుంది. అంతే కాదు.. మెడికల్ చెకప్‌తోపాటు ఒకోసారి పెనాల్టీ మొత్తం కూడా చెల్లించాల్సి రావచ్చు.

ల్యాప్స్ అయిన బీమా పాలసీని తిరిగి యాక్టివ్ స్థితిలోకి తీసుకురావడాన్ని రీఇన్‌స్టేట్మెంట్ అంటారు. ఒక పాలసీకి గ్రేస్ పీరియడ్ కూడా ముగిసిపోయి.. పాలసీదారుడు-ఇన్సూరెన్స్ కంపెనీ మధ్య కాంట్రాక్ట్ ముగిసిన స్థితిలో మాత్రమే ఇలా చేయాల్సి ఉంటుంది. ఇలా పాలసీ పునరుద్ధరణ చేసే విధానంలో కంపెనీకి, కంపెనీకి మధ్య అంతరం ఉంటుంది. అలాగే ల్యాప్స్ అయిన తర్వాత జరిగిన సమయం, బీమా పథకం, బీమా ధర వంటి ప్రమాణాల ప్రకారం పాలసీదారులు ఇందుకు దరఖాస్తు చేసుకోవచ్చు

అంటే, మీరు ఒకవేళ ప్రీమియం చెల్లించడం మిస్ అయినా సరే, మీరు ఆ పాలసీని పునరుద్ధరించుకుని తిరిగి బీమాను కొనసాగించవచ్చు. అయితే.. ఒక పాలసీకి సకాలంలో చెల్లింపులు చేయడం అనే విషయమే ఎల్లవేళలా ఉత్తమం.

Read more about: insurance policy
English summary

ప్రీమియం చెల్లించ‌కపోయినందుకు పాల‌సీ ర‌ద్ద‌యిందా.. ఎలా? | What if your insurance policy lapses

If you have failed to pay the premium for your insurance policy and it eventually lapses, don't panic and surrender your policy. There are ways to get around this problem.Most people consider life insurance, to be just a tax saving device. As a result, they either forget to pay their premiums or face a problem in maintaining the policy. Not surprisingly, a number of policies are discontinued.
Story first published: Tuesday, December 5, 2017, 11:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X