For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఐసీఐసీఐ నెట్ బ్యాంకింగ్‌లో పీపీఎఫ్ ఖాతా

పీపీఎఫ్ ఖాతా తెర‌వాలంటే బ్యాంకు లేదా పోస్టాఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇటీవ‌ల ఐసీఐసీఐ ఆన్‌లైన్లో పీపీఎఫ్ ఖాతా తెరిచే స‌దుపాయాన్ని ప్రారంభించింది. దీనికి ఎటువంటి పేప‌ర్ వ‌ర్క్ అవ‌స‌రం లేదు.

|

ఒకేసారి ఎక్కువ రాబ‌డి సాధించ‌డం కంటే దీర్ఘ‌కాల మ‌దుపు ద్వారా మంచి రాబ‌డి సాధించాల‌నే కోరిక చాలా మందికి ఉంటుంది. అలాంటి మార్గాన్ని ఎంచుకోవాల‌నుకునే వారికి పీపీఎఫ్ బాగుంటుంది. అయితే పీపీఎఫ్ ఖాతా తెర‌వాలంటే బ్యాంకు లేదా పోస్టాఫీసుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇటీవ‌ల ఐసీఐసీఐ ఆన్‌లైన్లో పీపీఎఫ్ ఖాతా తెరిచే స‌దుపాయాన్ని ప్రారంభించింది. దీనికి ఎటువంటి పేప‌ర్ వ‌ర్క్ అవ‌స‌రం లేదు. అది ఎలాగో తెలుసుకుందాం.

 పీపీఎఫ్ ఖాతాను ఆన్‌లైన్లో ప్రారంభించ‌డం ఎలా?

ఇది వ‌ర‌కే మీకు ఐసీఐసీఐ బ్యాంకులో ఖాతా ఉంటే ఆన్లైన్ మార్గంలో మీరు ఖాతాను ప్రారంభించ‌డం సులువు.
ఐసీఐసీఐ ఖాతాదారులు బ్యాంకు శాఖ‌కు వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండానే పీపీఎఫ్ ఖాతాను తెర‌వొచ్చు.
ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ లాగిన్ అయ్యే ముందు ఆన్‌లైన్లో ప్రాడ‌క్ట్స్ అనే ఆప్ష‌న్ క్లిక్ చేయాలి.
అందులో ఇన్వెస్ట్‌మెంట్‌, స్థిర ఆదాయ ఉత్ప‌త్తులు, పెట్టుబ‌డి మార్గాలు, ఆన్‌లైన్ సేవ‌లు క‌నిపిస్తాయి.
అందులో మ‌ళ్లీ ఇన్వెస్ట్‌మెంట్స్ అనే దాన్ని ఎంచుకోండి.
కింద వివిధ ర‌కాల పెట్టుబ‌డి మార్గాలు క‌నిపిస్తాయి. వాటిల్లోంచి పీపీఎఫ్‌ను ఎంచుకోండి.
హైలెట్ చేయ‌బ‌డిన పీపీఎఫ్‌(ప‌బ్లిక్ ప్రావిడెంట్ ఫండ్) అనే దాన్ని క్లిక్ చేయండి
ఇప్పుడు అప్లై నౌ అనే ఆప్ష‌న్ ఒక ప్ర‌త్యేక‌మైన రంగులో క‌నిపిస్తుంది.
దానిపై క్లిక్ చేసి నిమిషాల్లో పీపీఎఫ్ ఖాతాను ప్రారంభించండి.

Read more about: ppf savings investments
English summary

ఐసీఐసీఐ నెట్ బ్యాంకింగ్‌లో పీపీఎఫ్ ఖాతా | How to open PPF account in ICICI bank in Online mode

Are you struggling to open a PPF account? Now you don't need to worry. Private lender ICICI Bank has launched a digital service to allow customers to open a PPF account online, eliminating the need for furnishing paper documents.
Story first published: Friday, December 8, 2017, 10:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X