For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పీఎఫ్ ఖాతా కోసం యూఏఎన్ నంబ‌రు ఎలా క్రియేట్ చేసుకోవాలి?

యూఏఎన్ నంబ‌రు ఉండ‌టం వల్ల ఒక సంస్థ నుంచి మ‌రో సంస్థ‌కు మారిన‌ప్పుడు పీఎఫ్ ఖాతా కొత్తది సృష్టించే అవ‌స‌రం లేకుండా ఆన్‌లైన్లో పీఎఫ్ సొమ్మును బ‌ద‌లాయించుకోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాక

|

ప్ర‌స్తుత ఆధునిక యుగంలో ఉద్యోగులు ఒకే కంపెనీలో చాలా ఏళ్లు ప‌నిచేయ‌డం ఊహించ‌లేం. అందుకోసమే ఉద్యోగ భవిష్య నిధి సంస్థ ఉద్యోగుల కోసం పీఎఫ్ నంబ‌రుతో పాటు యూఏఎన్(సార్వత్రిక ఖాత‌ సంఖ్య‌)ను తీసుకొచ్చింది. ఇప్పుడు ఎవ‌రైనా కొత్త‌గా ఉద్యోగంలో చేరుతుంటే వారే స్వ‌యంగా కొత్త‌గా యూఏఎన్ నంబ‌రును జ‌న‌రేట్ చేసుకోవ‌చ్చు. యూఏఎన్ నంబ‌రు ఉండ‌టం వల్ల ఒక సంస్థ నుంచి మ‌రో సంస్థ‌కు మారిన‌ప్పుడు పీఎఫ్ ఖాతా కొత్తది సృష్టించే అవ‌స‌రం లేకుండా ఆన్‌లైన్లో పీఎఫ్ సొమ్మును బ‌ద‌లాయించుకోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలో ప్ర‌తి ఉద్యోగి ఈపీఎఫ్ ఖాతాకు సంబంధించి యూఏఎన్ నంబ‌రును స్వ‌యంగా ఎలా క్రియేట్ చేసుకోవ‌చ్చో తెలుసుకుందాం.

యూఏఎన్ మెంబ‌ర్ వెబ్‌సైట్

యూఏఎన్ మెంబ‌ర్ వెబ్‌సైట్

1) ఉద్యోగి మొద‌ట యూఏఎన్ మెంబ‌ర్ వెబ్‌సైట్లోకి వెళ్లాలి https://unifiedportal-mem.epfindia.gov.in/memberinterface/

ఉద్యోగ భ‌విష్య నిధి సంస్థ ఉద్యోగులకు చాలా సేవ‌ల‌ను అందిస్తోంది.

ఆ వెబ్‌సైట్లోకి వెళ్లిన త‌ర్వాత యూఏఎన్ అలాట్‌మెంట్ అనే దానిపై క్లిక్ చేయాలి.

 ఆధార్ నంబ‌రుతో ప్ర‌క్రియ మొత్తం పూర్తి

ఆధార్ నంబ‌రుతో ప్ర‌క్రియ మొత్తం పూర్తి

అప్పుడు న‌మోదిత మొబైల్ నంబ‌రుకు ఓటీపీ వ‌స్తుంది.

ఓటీపీ అనేది ఆధార్ లింక్డ్ మొబైల్‌కు మాత్ర‌మే వ‌స్తుంది

 ఓటీపీ సాయంతో

ఓటీపీ సాయంతో

3) ఓటీపీ ఎంట‌ర్ చేసిన త‌ర్వాత‌, డిస్ క్లెయిమ‌ర్ అంగీక‌రిస్తున్న‌ట్లు అక్క‌డ టిక్ మార్క్ క్లిక్ చేయాలి.

అప్పుడు స‌బ్ మిట్ బ‌ట‌న్ ఎనేబుల్ అవుతుంది.

ఇప్పుడు ప్రొసీడ్ అయ్యేందుకు స‌బ్ మిట్ అనే దానిని నొక్కాలి.

 ఆధార్ వెబ్ సైట్ నుంచి వివ‌రాలు

ఆధార్ వెబ్ సైట్ నుంచి వివ‌రాలు

4) ఇదంతా అవ‌గానే ఆధార్లో ఉన్న మీ వివ‌రాలు స్క్రీన్ నందు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి.

అక్క‌డ వ‌చ్చిన వివ‌రాల‌ను స‌రిపోల్చుకోవాలి.

ఏవైనా త‌ప్పున్నా, లేదా ఏదైనా వివ‌రాల‌ను న‌మోదు చేయాల్సి వ‌చ్చినా ఈ ద‌శ‌లో చేయాలి.

ఇప్పుడు యూజ‌ర్ క్యాప్చా కోడ్ ఎంట‌ర్ చేసి రిజిస్ట‌ర్ బ‌ట‌న్ క్లిక్ చేయాలి. డిస్‌క్లెయిమ‌ర్ అంగీక‌రించిన‌ట్లు క్లిక్ చేయ‌డం మ‌రిచిపోవ‌ద్దు.

 ఆఖ‌రి మెట్టు

ఆఖ‌రి మెట్టు

5) రిజిస్ట‌ర్ బ‌ట‌న్ నొక్క‌గానే ఆన్‌లైన్లో యూఏఎన్ మీకు అలాట్ అవుతుంది.

ఇక్క‌డే యూఏఎన్ నంబ‌ర్ ప్ర‌త్య‌క్ష‌మ‌వుతుంది.

అవ‌స‌ర‌మ‌నుకుంటే దీని స్క్రీన్ షాట్ తీసి సేవ్ చేసి ఉంచుకోండి.

ఇంత‌వ‌ర‌కూ యూఏఎన్ లేనివారు సైతం యూఏఎన్ స్వ‌యంగా జ‌న‌రేట్ చేసుకుని యాజ‌మాన్యానికి సబ్ మిట్ చేయ‌వ‌చ్చు.

Read more about: uan pf epf
English summary

పీఎఫ్ ఖాతా కోసం యూఏఎన్ నంబ‌రు ఎలా క్రియేట్ చేసుకోవాలి? | Generate UAN now on your own with a mouse click here is How

The new facility is now all available for new employee base, aspirants and even for those who have the EPF accounts but do not have the necessary UAN account till date. Know the process to obtain the UAN by going online, here.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X