English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

బ్యాంకింగ్ వ్య‌వ‌హారాలు స్మార్ట్‌గా చేయాల‌నుకుంటున్నారా? అయితే మీ కోస‌మే ఈ చిట్కాలు

Written By:
Subscribe to GoodReturns Telugu

మీరు క్రెడిట్ కార్డు వాడుతున్నా, చెక్కు పుస్త‌కం లేదా పొదుపు ఖాతా ఉన్నా వాటి వాడుక‌కు సంబంధించి రుసుమ‌లను తెలుసుకోవ‌డం ముఖ్యం. ఏటీఎమ్ క‌నీస లావాదేవీల త‌ర్వాత రుసుముల‌ను వ‌సూలు చేస్తున్నారు. ఈ ప‌రిమితిని బ్యాంకులు ప్ర‌జ‌ల‌కు తెలియ‌ప‌ర‌చాలి. బ్యాంకులు క‌నీస ప్ర‌చారంపై అశ్ర‌ద్ద వ‌హిస్తుండ‌టంతో కొంత మందికి రుసుముల రూపంలో ఎక్కువ ఖ‌ర్చు పెట్టాల్సి వ‌స్తోంది. చార్జీలు మిన‌హాయించిన త‌ర్వాత తెలుసుకున్నా ప్ర‌యోజ‌నం ఉండ‌దు. ఈ నేప‌థ్యంలో బ్యాంకులు అందించే సేవ‌ల‌ను ఎలా వాడుకుంటే మ‌న‌కు ప్రయోజ‌న‌మో తెలుసుకుందాం.

1. ఏటీఎమ్ లావాదేవీలు

1. ఏటీఎమ్ లావాదేవీలు

చాలా బ్యాంకులు సొంత ఏటీఎమ్‌ల్లో కార్డు వాడ‌కాన్ని 5 సార్ల‌కు, ఇత‌ర బ్యాంకు ఏటీఎమ్‌ల్లో వాడ‌కాన్ని 3 సార్ల‌కు ప‌రిమితం చేశాయి. దీని తర్వాత వాడితే రుసుములు విధిస్తారు. ఇక్క‌డ 3 లావాదేవీల్లో వైట్ లేబుల్ ఏటీఎమ్‌(ఇండిక్యాష్ వంటివి) లావాదేవీలు సైతం నిర్వ‌హించుకోవ‌చ్చు.

2. పొదుపు ఖాతా

2. పొదుపు ఖాతా

ఒక పొదుపు ఖాతాను రెండేళ్ల పాటు అస‌లు వాడ‌క‌పోతే ఇన్ఆప‌రేటివ్ అకౌంట్‌గా ప‌రిగ‌ణిస్తారు. ఒక‌టి కంటే ఎక్కువ ఖాతాల‌ను వాడుతుంటే అన్నింటిలో అప్పుడప్పుడు లావాదేవీలు జ‌రిపేలా చూసుకుంటే మంచిది.

3. చెక్కు వ్యాలిడిటీ

3. చెక్కు వ్యాలిడిటీ

చెక్కు, డీడీ, బ్యాంక‌ర్స్ చెక్కుల వ్యాలిడిటీని 6 నెల‌ల నుంచి 3 నెల‌ల‌కు త‌గ్గించారు. ఒక‌సారి చెక్కు జారీ చేస్తే దానిని మూడు నెల‌ల్లోపు డ్రా చేసేలా ఉండేలా ఇవ్వండి. చెక్కు బౌన్స్ అయితే కేసులు ఉంటాయ‌న్న విష‌యాన్ని మ‌రిచిపోవ‌ద్దు.

4. ఏటీఎమ్‌-డెబిట్ కార్డు

4. ఏటీఎమ్‌-డెబిట్ కార్డు

ఏటీఎమ్ లావాదేవీల‌కు సంబంధించి ఏవైనా అభ్యంత‌రాలుంటే వెంట‌నే బ్యాంకుల‌కు తెలియ‌ప‌ర‌చాలి. ఇందుకు వారం రోజుల‌ను గ‌డువుగా చెపుతున్నారు. ఏటీఎమ్ లావాదేవీల్లో బ్యాంకు వైపు నుంచి పొర‌పాటు ఉంటే అందుకు రోజుకు రూ. 100 న‌ష్ట‌ప‌రిహారాన్ని బ్యాంకు చెల్లించాల్సి ఉంటుంది. అయితే కార్డు జారీ చేసిన బ్యాంకులో ఫిర్యాదు చేసిన‌ప్పుడు మాత్ర‌మే ఇది వ‌ర్తిస్తుంది.

5. మెసేజ్, మెయిల్ అల‌ర్టులు

5. మెసేజ్, మెయిల్ అల‌ర్టులు

కార్డు ద్వారా జ‌రిపే లావాదేవీల వివ‌రాల‌ను బ్యాంకులు ఎప్ప‌టిక‌ప్పుడు మొబైల్‌కు, మెయిల్‌కు అల‌ర్టుల రూపంలో పంపాలి. ఇవి ఎప్ప‌టిక‌ప్పుడు మీకు అందుతున్నాయా లేదా చూసుకోండి. అల‌ర్టులు రాక‌పోతే బ్యాంకు క‌స్ట‌మ‌ర్ కేర్‌ను సంప్ర‌దించండి. ఇన్‌స్టంట్ అల‌ర్ట్ స‌దుపాయం కోసం బ్యాంకులు కొద్ది మొత్తంలో రుసుములు వ‌సూలు చేస్తాయి. ప్ర‌భుత్వ బ్యాంకుల‌తో పోలిస్తే ప్రైవేటు బ్యాంకులు కాస్త అధికంగా ఈ రుసుముల‌ను విధిస్తుంటాయి.

6. ఆధార్ లింకింగ్‌

6. ఆధార్ లింకింగ్‌

కేవైసీ విధానాన్ని సుల‌భ‌త‌రం చేసేందుకు బ్యాంకులు ఆధార్‌పై ఆధార‌ప‌డ‌టాన్ని చూస్తున్నాం. మీకు ఆధార్ ఉంటే బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేస్తే కేవైసీ ధ్రువీక‌ర‌ణ‌కు ఇదొక్క‌టే చాలు.

ప్ర‌స్తుతం ఈ-కేవైసీని సైతం అధికారిక ధ్రువీక‌ర‌ణ ప‌త్రంగా అంగీక‌రిస్తున్న త‌రుణంలో ఆధార్‌ను విస్తృతంగా వాడుకోవ‌చ్చు. ఒక‌సారి ఈ-కేవైసీ పూర్త‌యితే చాలా ఆర్థిక సాధ‌నాల్లో పెట్టుబ‌డుల‌కు అది ఉప‌యోగ‌ప‌డుతుంది. బ్యాంకు ఖాతాకు, ఆధార్ అనుసంధానం చేయ‌క‌పోతే ఖాతాను కొద్ది రోజులు తాత్కాలికంగా నిలిపివేస్తార‌న్న సంగ‌తి మ‌రిచిపోవ‌ద్దు.

7. పాస్‌బుక్‌

7. పాస్‌బుక్‌

పొదుపు ఖాతాదార్లంద‌రికీ బ్యాంకులు పాస్‌బుక్ జారీచేయాల్సి ఉంది. పాస్‌బుక్ ఇవ్వ‌క‌పోతే ఫిర్యాదు చేసి తెచ్చుకోవ‌చ్చు. దీని ద్వారా చాలా ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. ఇప్పుడు ప్రైవేటు బ్యాంకుల‌న్నీ పాస్ బుక్ అవ‌స‌రం లేకుండా ఆన్‌లైన్లో మినీ స్టేట్ మెంట్, డిటైల్డ్ స్టేట్మెంట్ పొందేందుకు అవ‌కాశం క‌ల్పిస్తున్నాయి. ఇంకా మీకు వివ‌రాలు కావాలంటే మీరు ఏటీఎమ్ యంత్రాల్లో సైతం స్టేట్‌మెంట్ల‌ను తీసుకోవ‌చ్చు.

8. ముంద‌స్తు ముగింపు(ఫోర్‌క్లోజ‌ర్‌) రుసుము

8. ముంద‌స్తు ముగింపు(ఫోర్‌క్లోజ‌ర్‌) రుసుము

గృహ రుణం ఫ్లోటింగ్ వ‌డ్డీ రూపంలో తీసుకుని, ఆ రుణాన్ని ముంద‌స్తుగా ముగించాల‌నుకుంటే దానికి ఎటువంటి ముంద‌స్తు చెల్లింపు రుసుములు లేదా పెనాల్టీలు వ‌సూలు చేయకూడ‌దు. ఫిక్స్‌డ్ వ‌డ్డీ రేటుపై తీసుకున్న గృహ రుణాల‌కు ఈ రుసుములు ఉంటాయి. గృహ రుణం ద‌ర‌ఖాస్తు చేసేట‌ప్పుడే బ్యాంకును అడిగి ఈ విష‌యాన్ని తెలుసుకోండి.

ఈ స‌ల‌హాల‌తో మీ బ్యాంకింగ్ కార్య‌క‌లాపాల‌ను ఎటువంటి ఇబ్బందులు లేకుండా చేసుకోండి.

Read more about: banks, charges, atm, cheque
English summary

8 smart tricks to follow for using your banking services efficiently

Now a days for every one bank account is essential. The difficulty arises when you will come across some fees and charges which you had no idea about and which could have been avoided. Here are some smart things to know when doing any bank transactions.
Story first published: Wednesday, December 6, 2017, 13:00 [IST]
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC

Get Latest News alerts from Telugu Goodreturns