For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జీవిత బీమా రైడ‌ర్ల గురించి మీకు తెలియ‌ని 8 విష‌యాలు

బేస్ పాల‌సీకి అద‌న‌పు బీమా హామీ సొమ్మును ఈ రైడ‌ర్లు క‌ల‌గ‌జేస్తాయి. రైడ‌ర్ కోసం అద‌నంగా ప్రీమియం చెల్లించ‌డం వ‌ల్ల దాదాపు కొత్త పాల‌సీకి వ‌చ్చిన‌న్ని ప్ర‌యోజ‌నాలు అందుతాయి.రైడ‌ర్ల కొనుగోలు ప్ర‌యోజ‌నాల

|

జీవిత బీమా రైడ‌ర్ల గురించి మీకు తెలియ‌ని 8 విష‌యాలు/ నిజాలు
సాధార‌ణంగా జీవిత బీమా పాల‌సీ తీసుకున్న కొన్నేళ్ల త‌ర్వాత స‌మ్ అస్యూర్డ్ లేదా క‌వ‌రేజీ పెంచుకోవాలనే ఆలోచ‌న క‌లుగుతుంది. ప్ర‌స్తుతం ఉన్న పాల‌సీ స‌రిపోద‌ని భావించి కొత్త పాల‌సీకి ప్ర‌య‌త్నిస్తాం. దీనికి బ‌దులుగా ట‌ర్మ్ రైడ‌ర్ తీసుకుంటే త‌క్కువ ప్రీమియంకే అనుకున్న ప్ర‌యోజ‌నం చేకూరుతుంది.

బేస్ పాల‌సీకి అద‌న‌పు బీమా హామీ సొమ్మును ఈ రైడ‌ర్లు క‌ల‌గ‌జేస్తాయి. రైడ‌ర్ కోసం అద‌నంగా ప్రీమియం చెల్లించ‌డం వ‌ల్ల దాదాపు కొత్త పాల‌సీకి వ‌చ్చిన‌న్ని ప్ర‌యోజ‌నాలు అందుతాయి.
రైడ‌ర్ల కొనుగోలు ఎంత మేర‌కు లాభ‌దాయ‌కం, వాటి ప్ర‌యోజ‌నాల గురించి వివ‌రంగా తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం....

1. ఇష్ట‌ముంటేనే తీసుకోవ‌చ్చు

1. ఇష్ట‌ముంటేనే తీసుకోవ‌చ్చు

రైడ‌ర్ పాల‌సీకి అద‌న‌పు ప్రయోజ‌నాలను క‌ల్పిస్తుంది. పాల‌సీదారుకు ఇష్ట‌ముంటేనే రైడ‌ర్ తీసుకోవ‌చ్చు.

ప్ర‌ధాన పాల‌సీ కొనుగోలు స‌మ‌యంలోనే రైడ‌ర్ తీసుకోవ‌చ్చు. దీని గురించిన వివ‌రాలు బ్రోచ‌ర్‌లో ఉంటాయి.

వివిధ ర‌కాల రైడ‌ర్లు అందుబాటులో ఉంటాయి. వీటిలో ఏదో ఒక దాన్ని ఎంపిక చేసుకోవ‌చ్చు.

పాల‌సీదారు త‌న‌కు అనుకూల‌మైన రైడ‌ర్‌ను ఎంచుకోవచ్చు.

 2. ముఖ్య‌మైన రైడ‌ర్లు

2. ముఖ్య‌మైన రైడ‌ర్లు

రైడ‌ర్ల‌లో ముఖ్య‌మైన‌వి యాక్సిడెంట‌ల్ డెత్‌, శాశ్వ‌త వైక‌ల్య రైడ‌ర్లు.

పాల‌సీదారుకు అనుకోకుండా ఏదైనా జ‌రిగితే బీమా హామీ సొమ్మును ల‌బ్ధిదారుకు లేదా నామినీకి ఇస్తారు. అయితే ఇది వారికి స‌రిపోదు అని భావిస్తే అద‌నపు ప‌రిహారం కోసం రైడ‌ర్ల‌ను తీసుకోవ‌చ్చు.

యాక్సిడెంట‌ల్ డెత్ రైడ‌ర్ తీసుకున్న పాల‌సీదారుకి ప్ర‌మాదం జ‌రిగి ప్రాణాలు విడిస్తే ప‌రిహారాన్ని నామినీకి అంద‌జేస్తారు.

అదే ఒక వేళ ప్ర‌మాదం వ‌ల్ల శాశ్వ‌త వైక‌ల్యం ఏర్ప‌డితే రైడ‌ర్ ప్ర‌యోజ‌నాల దృష్ట్యా బేస్ పాల‌సీది కాకుండా అద‌న‌పు ప‌రిహారం చేతికందుతుంది. దీని వ‌ల్ల పాల‌సీదారుకి క‌ష్ట‌కాలంలో డ‌బ్బుల ప‌రంగా ఇబ్బంది ఏర్ప‌డ‌దు.

3. ఇత‌ర రైడ‌ర్లు

3. ఇత‌ర రైడ‌ర్లు

క్రిటిక‌ల్ ఇల్‌నెస్ అంటే తీవ్ర‌మైన అనారోగ్య ప‌రిస్థితులు ఏర్ప‌డ‌వ‌చ్చు అనే సందేహం ఉన్న‌వారు ఈ రైడ‌ర్‌ను కొనుగోలు చేయ‌వ‌చ్చు. క్రిటిక‌ల్ ఇలెనెస్ తో బాధ‌ప‌డిన‌ప్పుడు ఆసుప‌త్రి ఖ‌ర్చులు విప‌రీతంగా ఉంటాయి. సాధార‌ణ జీవిత బీమా ఇలాంటి వాటికి ప‌రిహారం అందించ‌దు. అదే ఈ రైడ‌ర్ ఉన్న‌ట్ల‌యితే పాల‌సీదారుకు కొంతైనా ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.

వెయివ‌ర్ ఆఫ్ ప్రీమియం(ప్రీమియం ర‌ద్దు చేసే) రైడ‌ర్ మ‌రో ముఖ్య‌మైన‌ ర‌కం. పాల‌సీదారు చ‌నిపోతే పాల‌సీ మెచ్యూరిటీ గ‌డువు తీరేవ‌ర‌కు ప్రీమియంల‌ను చెల్లించే భారం కుటుంబ స‌భ్యుల‌పై ప‌డుతుంది. ఈ రైడ‌ర్ తీసుకుంటే వారి పేరిట మిగ‌తా ప్రీమియంల‌ను చెల్లించ‌న‌వ‌స‌రంలేదు. మెచ్యూరిటీ గ‌డువు ముగిశాక నామినీకి నిర్దేశించిన మొత్తం ప‌రిహారం చేతికందుతుంది.

4. క్లెయిం చేసుకున్న త‌ర్వాత‌...

4. క్లెయిం చేసుకున్న త‌ర్వాత‌...

ట‌ర్మ్ రైడ‌ర్ అంటే పాల‌సీదారు మృతి చెందాక ముందే నిర్ణ‌యించిన ప‌రిహారాన్ని ల‌బ్ధిదారునికి చెల్లిస్తారు. పాల‌సీ గ‌డువు లేదా రైడ‌ర్ గ‌డువు ముగిశాక లేదా క్లెయిం చేసుకున్న త‌ర్వాత ఇక ఆ రైడ‌ర్ ని తిరిగి రెన్యూవ‌ల్ ఛేసుకోలేం. అవ‌స‌ర‌మ‌నుకుంటే, బీమా సంస్థ అందిస్తే కొత్త రైడ‌ర్ కొన‌వ‌చ్చు.

5. ప్ర‌యోజ‌నాలు ఇవే..

5. ప్ర‌యోజ‌నాలు ఇవే..

ప్ర‌ధాన పాల‌సీతో లింక్ అయి ఉంటుంది కాబ‌ట్టి ప్రీమియం భారం త‌గ్గుతుంది.

మ‌న‌కు, మ‌న కుటుంబానికి స‌రిప‌డా బీమా క‌వ‌రేజీ లేద‌ని భావిస్తే మ‌రో పాల‌సీ కొనుగోలు చేయ‌న‌వ‌స‌రం లేకుండా రైడ‌ర్ తీసుకుంటే మేలు.

రైడ‌ర్ తీసుకుంటే త‌క్కువ ప్రీమియంలో స‌రిప‌డా బీమా క‌వ‌రేజీ పొంద‌వ‌చ్చు.

రైడ‌ర్ వ‌ల్ల ప్ర‌ధాన పాల‌సీ ప్రీమియంలో మార్పుండ‌దు.

ఇలా ప్ర‌తి అవ‌స‌రానికి జీవిత బీమా పాల‌సీలు తీసుకుంటూ వెళ్తే నిర్వ‌హ‌ణ భారం పెరుగుతుంది. దీనిని రైడ‌ర్‌తో త‌గ్గించుకోవ‌చ్చు.

6. విడిగా పాల‌సీ తీసుకుంటే భార‌మే

6. విడిగా పాల‌సీ తీసుకుంటే భార‌మే

ఉదాహ‌ర‌ణకు 30ఏళ్ల వ్య‌క్తికి రూ.10ల‌క్ష‌ల విలువ‌చేసే క్రిటిక‌ల్ ఇల్‌నెస్ రైడ‌ర్ కొనుగోలు చేసేందుకు రూ.3,741 ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. అదే విడిగా పాల‌సీ కొనుగోలు చేసేందుకు రూ.4,425 అవుతుంది.

7. కొనేముందు ఇవి చూడండి

7. కొనేముందు ఇవి చూడండి

విడిగా ప్ర‌ధాన‌ పాల‌సీని.. ముందే ఉన్న జీవిత బీమాకు రైడ‌ర్‌ను తీసుకొని ప్రీమియం ధ‌ర‌ల విష‌యాన్ని పోల్చి చూసుకోవాలి.

రైడ‌ర్‌కు సంబంధించిన పూర్తి ప్ర‌యోజ‌నాల‌ను తెలుసుకోవాలి.

రైడ‌ర్ క‌వ‌రేజీ పైనా కొన్ని ప‌రిమితుల‌ను విధించి ఉంటారు. వాటిని తెలుసుకోవాలి.

త‌క్కువ ప్రీమియం ఉన్న రైడ‌ర్ అంటే క‌వ‌రేజీ త‌క్కువ ఉండే అవ‌కాశాలున్నాయి. దీనిపై శోధించండి.

8. ప్ర‌ధాన పాల‌సీ అమల్లో ఉన్నంత వ‌ర‌కే..

8. ప్ర‌ధాన పాల‌సీ అమల్లో ఉన్నంత వ‌ర‌కే..

ప్ర‌ధాన పాల‌సీ అమ‌ల్లో ఉన్నంత మేర‌కే రైడ‌ర్ కు విలువ అనే సంగ‌తి తెలియాలి.

ప్ర‌ధాన పాల‌సీని స‌రెండ‌ర్ చేస్తే రైడ‌ర్ ప్ర‌యోజ‌నాల కోల్పోగ‌లం.

ప్ర‌ధాన పాల‌సీకి పొంద‌గ‌లిగే బీమా హామీ సొమ్ములో 100 శాతానికి మించి రైడ‌ర్‌ను కొనలేం.

Read more about: insurance policy
English summary

జీవిత బీమా రైడ‌ర్ల గురించి మీకు తెలియ‌ని 8 విష‌యాలు | policyholders :Importance of riders in life insurance policy

benefits and importance of Insurance Riders
Story first published: Sunday, November 5, 2017, 10:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X