For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బ్యాంకు లాక‌ర్లు వాడేవారు జాగ్ర‌త్త‌.... బ్యాంకుది మాత్రం కాదు బాధ్య‌త‌!

బ్యాంకు దోపిడీ వల్ల నష్టపోయిన వినియోగదారులకి ఏ పరిహారం చెల్లించబడదు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండీయా కూడా "లాకర్లలో విలువైన వస్తువుల నష్టానికి బ్యాంకు బాధ్యత ఏమీ ఉండదు" అని తేల్చిచెప్పింది. మరైతే అలాంటి కే

|

ఇటీవ‌ల దేశ ఆర్థిక రాజ‌ధాని ముంబ‌యి న‌గ‌రంలోని బ్యాంక్ ఆఫ్ బ‌రోడా శాఖ‌లో దొంగ‌లు ప‌డి లాక‌ర్ల‌లో ఉంచిన రూ. 40 ల‌క్ష‌ల విలువైన వ‌స్తువుల‌ను దోచుకుపోయారు. ఆశ్చర్యకరంగా, ఇదేమీ దేశంలో జరిగిన మొదటి బ్యాంకు లాకర్ దోపిడీయో, దొంగతనమో కాదు. డజన్ల కొద్దీ కేసులు ఇదివరకే జరిగి, రిపోర్టు కాబడినా, బ్యాంకు లాకర్లని మరింత పటిష్టం చేసే చర్యలు లేదా ఇలాంటి విషయాలలో బ్యాంకు బాధ్యతను పెంచే చర్యలు అంతంతమాత్రంగానే జరిగాయి. ఈ కేసులో కూడా, ఈ బ్యాంకు దోపిడీ వల్ల నష్టపోయిన వినియోగదారులకి ఏ పరిహారం చెల్లించబడదు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండీయా కూడా "లాకర్లలో విలువైన వస్తువుల నష్టానికి బ్యాంకు బాధ్యత ఏమీ ఉండదు" అని తేల్చిచెప్పింది. మరైతే అలాంటి కేసుల్లో మనం ఏం చేయాలి?

మీ విలువైన వస్తువులు సురక్షితంగా ఉంచుకోడానికి, బ్యాంకు లాకర్ల గురించి తెలుసుకోవాల్సిన 10 విషయాలు ఇక్కడ వివరించాం, చదవండి

1. బ్యాంకు లాక‌ర్లే అత్యుత్తమ ర‌క్ష‌ణ మార్గం కాదు

1. బ్యాంకు లాక‌ర్లే అత్యుత్తమ ర‌క్ష‌ణ మార్గం కాదు

మీ విలువైన వస్తువులకు బ్యాంకు లాకర్లే అత్యుత్తమ రక్షణ కల్పిస్తాయని భావిస్తే, మీరు తప్పుగా అనుకుంటుండవచ్చు. రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా "లాకర్లలో విలువైన వస్తువుల నష్టానికి బ్యాంకు బాధ్యత ఉండదు" అని చెప్పింది. దీని అర్థం బ్యాంకు సేఫ్ లలో మీరు దాచిన ఏ వస్తువైనా దొంగిలించబడితే ఏ పరిహారం మీకు చెల్లించబడదు, ఎందుకంటే లాకర్ తీసుకునేటప్పుడు మీరు రాసిన అగ్రిమెంట్ వల్ల అలాంటి బాధ్యతలేవీ బ్యాంకు తీసుకోదు. కొన్ని నెలల క్రితమే ఆర్బీఐ మరియు ఇతర 19 జాతీయ బ్యాంకులు ఆర్టిఐ కి ఇచ్చిన సమాధానంలో ఈ చేదునిజం బయటపడింది.

2. వారిది బాధ్య‌త కాద‌ని మీరే సంత‌కం చేస్తారు

2. వారిది బాధ్య‌త కాద‌ని మీరే సంత‌కం చేస్తారు

జాతీయ బ్యాంకులే కాదు ఇది ప్రయివేటు బ్యాంకులకి కూడా వర్తిస్తుంది. ఉదాహరణకి ప్రయివేటు బ్యాంకుల లాకర్ తీసుకునేటప్పటి అగ్రిమెంట్లో ఇలా రాసి ఉంటుంది, " లాకర్లలో ఉంచబడిన ఏ వస్తువుకి బ్యాంకు బాధ్యత వహించదు, ఇంకా వర్షం, అగ్నిప్రమాదాలు, వరదలు, భూకంపాలు, మెరుపులు, ఆందోళనలు, యుద్ధం,మతకలహాలు వంటి ఏ సంఘటనలప్పుడు జరిగే వస్తునష్టం లేదా పాడవటానికి బ్యాంకు ఎటువంటి పరిహారం చెల్లించదు, లాకర్ వినియోగించేవారు ఏ వస్తువులైనా లాకర్ బయట వదిలేయటం వంటి వాటికి కూడా బ్యాంకుకి ఏ సంబంధం ఉండబోదు". దానిలో ఇంకా "బ్యాంకు మీ వస్తువులను కాపాడటానికి సాధారణంగా తీసుకునే అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుంది కానీ లాకర్ లో ఎలాంటి నష్టానికి బాధ్యత తీసుకోదు, పరిహారం చెల్లించదు. అందుకే బ్యాంకు లాకర్లో ఏదైనా విలువైన వస్తువులు ఉంచేటప్పుడు అది పూర్తిగా వినియోగదారుడి సొంత పూచీకత్తుపై ఉంచటం మంచిదని మేము సూచిస్తున్నాం".

3. బ్యాంకు లాక‌ర్ల‌కు అద్దెలేమీ త‌క్కువ కాదు

3. బ్యాంకు లాక‌ర్ల‌కు అద్దెలేమీ త‌క్కువ కాదు

ఇలా ఉన్నా కూడా బ్యాంకు లాకర్లు ఉచితంగా ఏమీ రావు. వినియోగదారుల నుంచి సంవత్సరానికి మెట్రో కాని నగరాలలో 1000 రూపాయల నుంచి అద్దె తీసుకుంటుంటే, మెట్రో నగరాలలో పెద్ద సైజు లాకర్ కు 10,000 రూపాయల నుంచి మొదలవుతుంది. కానీ బ్యాంకులు లాకర్ వినియోగదారుడితో తమ బంధం అద్దెకి ఇచ్చేవాడు, తీసుకునేవారు మాత్రమే అని వాదిస్తున్నాయి. అందుకని లాకర్లో ఉన్న ఏ విలువైన వస్తువుకి, నష్టానికి బ్యాంకు బాధ్యత వహించదు.

4. న‌ష్టానికి ప‌రిహారం ఉండ‌దు

4. న‌ష్టానికి ప‌రిహారం ఉండ‌దు

ప్రజలు బ్యాంకు లాంటి సురక్షిత వ్యవస్థలను నమ్మి లాకర్లను అద్దెకి తీసుకుంటారని ఆర్థిక నిపుణులు చెప్తున్నారు. బ్యాంకులు లాకర్లను లీజుకి తీసుకున్నప్పుడు వాటికి రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తాయి. అందుకనే వాటిల్లో ఇక ఏ నష్టం జరిగినా అవి పరిహారం చెల్లించవు.

5. చివరి ప‌రిష్కార మార్గంగా వినియోగ‌దారు హ‌క్కును వినియోగించుకోవ‌చ్చు.

5. చివరి ప‌రిష్కార మార్గంగా వినియోగ‌దారు హ‌క్కును వినియోగించుకోవ‌చ్చు.

చాలా కేసుల్లో వివిధ కోర్టులు మరియు జాతీయ వినియోగదారుల పరిష్కార కమీషన్-ఎన్ సిడిఆర్ సి(NCDRC) అద్దెకి ఇచ్చే లాకర్లపై బ్యాంకుల బాధ్యతపై వినియోగదారులను సమర్థించింది. అందుకని ఒకవేళ లాకర్ కి ఏదైనా నష్టంకానీ, దొంగతనం కాని జరిగితే బ్యాంకులు పరిహారం ఇవ్వటానికి నిరాకరిస్తే వారు ఎన్ సిడిఆర్ సిని సంప్రదించాలి.

6. నియ‌మ నిబంధ‌న‌లు చ‌ద‌వాలి

6. నియ‌మ నిబంధ‌న‌లు చ‌ద‌వాలి

లాకర్ ను తీసుకునేటప్పుడు జాగ్రత్తగా పరిశీలించాల్సిన విషయం టర్మ్స్ మరియు కండీషన్స్(నియ‌మ నిబంధ‌న‌లు). అన్ని పత్రాలను జాగ్రత్తగా చదవండి. మీరు లాకర్లో ఏవి పెడదామనుకుంటున్నారో లిస్టు తయరుచేసుకోండి. దీనివల్ల ఏదైనా వస్తువు కన్పించకపోయినప్పుడు పరిహారం కోరడానికి మరియు మీరు పెట్టిన వస్తువుల విలువ కట్టడానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఎప్పుడూ, మీతో పాటు లాకర్ తెరవడానికి వచ్చిన బ్యాంకు ఉద్యోగి వెళ్ళాకనే మీ లాకర్ తెరవండి. అలాగే మీరు తిరిగొచ్చేటప్పుడు లాకర్ కు సరిగా తాళం వేసారో లేదో జాగ్రత్తగా చూసుకోండి.

7. బ్యాంకులో సీటీటీవీ ఉందో లేదో తెలుసుకోండి

7. బ్యాంకులో సీటీటీవీ ఉందో లేదో తెలుసుకోండి

మీరు లాకర్ తీసుకోవాలనుకుంటున్న బ్యాంకు శాఖలో సరియైన సిసిటివి వ్యవస్థ ఉందో లేదో చెక్ చేయండి. ఏదైనా దొంగతనం జరిగినపుడు పరిశోధక శాఖ వారు సులభంగా దొంగలను సిసిటివి కెమెరా ఫుటేజ్ తో కనుగొనగలరు.

 8. వ‌స్తు బీమా మ‌రో మంచి మార్గం

8. వ‌స్తు బీమా మ‌రో మంచి మార్గం

మీ విలువైన వస్తువులను కాపాడే మరో విధానం వాటిని బీమా చేయించడం. ప్రస్తుతానికి బ్యాంకు లాకర్లలో పెట్టే విలువైన వస్తువులకి, నగలకి ప్రత్యేకంగా బీమా విధానాలు లేవు. కానీ మార్కెట్లో కొన్ని ఇంటి యజమాని పాలసీలున్నాయి, ఇవి బ్యాంకు లాకర్లలో పెట్టిన నగలకు కూడా బీమా సౌకర్యం అందిస్తాయి. మీరు ఆ విలువైన వస్తువులను ఇంట్లోనే సురక్షిత లాకర్ లో పెట్టి కూడా బీమా చేయించవచ్చు.

9. గృహ బీమా ఒక్కోసారి మిమ్మ‌ల్ని ఆదుకుంటుంది

9. గృహ బీమా ఒక్కోసారి మిమ్మ‌ల్ని ఆదుకుంటుంది

కొన్ని గృహ బీమా పాలసీలు మీ నగలకి, విలువైన వస్తువులకి కేవలం ఇంటిలో దాచినప్పుడే కాదు, ప్రపంచంలో ఎక్కడ ప్రయాణిస్తున్నా అనుకోని ప్రమాదాలకి, నష్టాలకి పరిహారం చెల్లిస్తాయి. దీని ఖరీదు దాదాపు ప్రతి లక్ష రూపాయల వస్తువిలువకి 1000 రూపాయలుగా ఉంటుంది. మీరు 2 లక్షల నుంచి 10 లక్షల వస్తువిలువల మధ్యలో ఎంచుకోవచ్చు. వినియోగదారుడు తమ నగల వివరాలు, అంటే రకం, బరువు, పదిలక్షల రూపాయల వరకూ భర్తీ ఖర్చు వంటి వివరాలు అందించాల్సి ఉంటుంది. కానీ భర్తీ చేసే ఖర్చు 10లక్షల కన్నా ఎక్కువ ఉంటే, వినియోగదారుడు గృహ బీమా పాలసీ కొనేటప్పుడు వాల్యుయేషన్ సర్టిఫికేట్ కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది.

10. బీమా క‌వ‌రేజీ ప‌రిమితులు చూసుకోవాలి

10. బీమా క‌వ‌రేజీ ప‌రిమితులు చూసుకోవాలి

నగలకి సంబంధించి ఇంటి బీమా కవర్ లో ఏవైనా ప‌రిమితులు ఉన్నాయేమో కూడా మీరు చెక్ చేయాలి. ఐసిఐసిఐ లోంబార్డ్ మరియు టాటా ఎఐఎ జనరల్ వంటి సంస్థలలో, ఇంటి బీమా పాలసీ కింద నగల సెక్షన్ వేరే ఉండి దానికి సబ్ లిమిట్ నిర్ణయిస్తారు. అందుకని మీరు 3 లక్షల రూపాయల పాలసీ తీసుకుంటే, అందులో 25 శాతం లేదా 75000 రూపాయల విలువైన నగలు మాత్రమే పాలసీ కింద కవర్ అవుతాయి.

Read more about: banking bank lockers banks
English summary

బ్యాంకు లాక‌ర్లు వాడేవారు జాగ్ర‌త్త‌.... బ్యాంకుది మాత్రం కాదు బాధ్య‌త‌! | Here are tips to keep your valuables safe If you use bank lockers

Even the Reserve Bank of India says that “banks have no liability for loss of valuables in lockers.” So, what to do in such cases?Here are 10 things to know about bank lockers and how you can keep your valuables safe.
Story first published: Monday, November 20, 2017, 12:12 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X