For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

చంద్ర‌న్న బీమా ప‌థ‌కంలో ఎలా ల‌బ్దిదారులుగా చేరాలి?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు "చంద్రన్న భీమా పధకం" ఏర్పాటు చేసారు. భారత దేశంలో అసంఘటిత కార్మికులకు భీమా కల్పించిన ఏకైక రాష్ట్రము "ఆంధ్రప్రదేశ్". దీని గురించి వివ‌రంగా తెలుసుకు

|

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దాదాపుగా ఎంతోమంది అసంఘటిత రంగానికి చెందిన వారున్నారు. అధికారుల లెక్కల ప్రకారం రెండు కోట్ల వరకు ఉండొచ్చని అంచనా. అసంఘటిత కార్మిక రంగం పరిధి లోనికి వచ్చే ప్రతీవ్యక్తి యొక్క కుటుంబ రక్షణ నిమిత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు "చంద్రన్న భీమా పధకం" ఏర్పాటు చేసారు. భారత దేశంలో అసంఘటిత కార్మికులకు భీమా కల్పించిన ఏకైక రాష్ట్రము "ఆంధ్రప్రదేశ్". దీని గురించి వివ‌రంగా తెలుసుకుందాం.

ప‌థకం ప్రారంభం

ప‌థకం ప్రారంభం

* 2016 అక్టోబ‌ర్ 2వ తేదీన ప్రారంభించారు.

* ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు దీన్ని ప్రారంభించారు.

న‌మోదుకు అర్హ‌త‌లు

న‌మోదుకు అర్హ‌త‌లు

వ‌య‌సు 18 నుంచి 70 సంవ‌త్స‌రాల మ‌ధ్య క‌లిగిన అసంఘ‌టిత రంగంలోని కార్మికులు

రూ.15 చెల్లించిన పూర్తి చేసిన ద‌ర‌ఖాస్తుతో పాటు ఆధార్ కార్డు, రేష‌న్ కార్డు బ్యాంకు ఖాతా వివ‌రాలు ఇవ్వాలి. ఇత‌ర ఏ ధ్రువీక‌ర‌ణ ప‌త్రాలు అవ‌స‌రం లేదు.

ఆధార్, బ్యాంకు ఖాతా లేనివారికి సైతం వాటిని స‌మ‌కూర్చి బీమా ప‌థ‌కంలో చేరుస్తారు.

బీమా ప‌థ‌కం ప్రీమియంను రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే చెల్లిస్తుంది.

ఆసంఘ‌టిత రంగంలోని కార్మికులు అంటే?

ఆసంఘ‌టిత రంగంలోని కార్మికులు అంటే?

  1. ఎవ‌రైనా నెల‌కు రూ.15,000కు మించ‌కుండా ఆర్జించే వారు.

  2. వ్య‌వ‌సాయం, అనుబంధ రంగాలైన పూలు,పండ్ల తోట‌ల పెంప‌కం, కొబ్బ‌రి కోయుట‌-వ‌లుచుట‌, ప‌శువుల పెంప‌కం, కోళ్ల పెంప‌కం మొద‌లైన రంగాల్లో ఉపాధి పొందుతున్న వారు

  3. క‌మ్మ‌రి, కుమ్మ‌రి, క్షౌర వృత్తి, చేనేత, స్వ‌ర్ణ‌కారులు, చాక‌లి మొద‌లైన చేతి వృత్తుల వారు

  4. వీధి వ్యాపారులు, చిన్న ఉత్ప‌త్తిదారులు, కిల్లీ, బ‌డ్డీ వంటి ఇత‌ర చిన్న వ్యాపార‌స్తులు, సైకిల్‌, స్కూట‌ర్, ఇత‌ర గృహోప‌క‌ర‌ణాల‌ను మ‌ర‌మ్మ‌తు చేసే చిన్న మెకానిక్‌లు

  5. క‌ళాకారుల వంటి స్వ‌యం ఉపాధి పొందే వారు

  6. ఇంటి ప‌ని, ఇండ్ల‌లో వృద్దుల‌కు సేవ చేసేవారు, లెట‌ర్లు, పార్శిళ్లు, వ‌స్తువులు, బిల్లులు వంటివి చేర‌వేసే కొరియ‌ర్ బాయ్స్, పారిశుద్ధ్య ప‌నివారు, ఇళ్ల వ‌ద్ద చెత్త సేక‌రించేవారు మొద‌లైన సేవా రంగం వ్య‌క్తులు

  7. అంగ‌న్ వాడీ, ఆశా వ‌ర్క‌ర్లు, ఆరోగ్య మిత్రా, బీమా మిత్ర‌, 104/108 మొద‌లైన ప్ర‌భుత్వ ప‌థ‌కాల అమ‌లులో గౌర‌వ వేత‌నం పొందేవారు

    గోదాములు, మార్కెట్ యార్డులు, దుకాణాలు, రైల్వే స్టేష‌న్లు, బ‌స్టాండ్లు, పోర్టులు, రేవుల వ‌ద్ద ప‌నిచేసే హ‌మాలీలు(లోడింగ్‌, అన్‌లోడింగ్ చేసేవారు)

  8. ప్ర‌భుత్వ మ‌రియు ప్రైవేటు ఆటో, కారు, వ్యాన్‌, ట్రాక్ట‌ర్‌, లారీ, బ‌స్సు వంటి రోడ్ ర‌వాణా ఇంకా లాంచీలు, ప‌డ‌వ‌లు, జ‌ట్టీలు, బ‌ల్ల‌క‌ట్టు వంటి జ‌ల ర‌వాణా రంగంలోని డ్రైవ‌ర్లు, ఇత‌ర ప‌నివాళ్లు

  9. చిన్న దుకాణాలు, సంస్థ‌లు, వాణిజ్య సంస్థ‌లు, ఫ్యాక్ట‌రీల‌లో రేగుల, క్యాజువ‌ల్‌, తాత్కాలిక‌, దిన‌స‌రి వేత‌నం, పేస్ రేటు, క‌మిష‌న్ ప‌ద్ద‌తిని ప‌నిచేసేవారు

  10. అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ప‌నివారు ప్ర‌భుత్వ శాఖ‌ల‌లో, ప్ర‌భుత్వ రంగ శాక‌ల‌లో మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌, మున్సిపాలిటీ లేదా పంచాయ‌తీల‌లో ప‌నిచేసే అవుట్ సోర్సింగ్‌, కాంట్రాక్ట్ ప‌నివారు
  11. భ‌వ‌నాలు లేదా ఇత‌ర నిర్మాణాల‌లో ప‌నిచేసే- తాపి ప‌ని, సెంట్రింగ్ ప‌ని, రాడ్ బెండింగ్‌, పంబ్లింగ్‌/ శానిట‌రీ, వండ్రంగి, రంగులు వేయడం, టైల్స్ ప‌ని, ఎల‌క్ట్రీషియ‌న్, బోర్ వెల్; ఇంటిరీయ‌ర్ డిజైన్ ప‌ని, ఇటుక బ‌ట్టీలు, ఫ్ల‌య్ యాష్, ఇత‌ర ఇటుక‌ల త‌యారీ, ఇసుక క్వారీలు, రాళ్ల క్ర‌ష‌ర్లు, కాంక్రీట్ మిక్స్ చేసేవారు, బావులు త‌వ్వ‌కం-పూడిక ప‌నిచేసేవాళ్లు, అన్ని ర‌కాల నిర్మాణ రంగాల్లో ప‌నిచేసే వారు, నిర్వ‌హ‌ణ ప‌నులు చేస్తున్న వారు

  12. ఉపాధి హామీ ప‌థ‌కం(NREGS) ప‌రిధిలోకి వ‌చ్చే మేట్‌, మ‌ట్టి ప‌ని, ఇత‌ర ర‌కాల ప‌నివారు అర్హులు
న‌మోదు ప్ర‌క్రియ‌, క్లెయిం ప‌రిష్కారం

న‌మోదు ప్ర‌క్రియ‌, క్లెయిం ప‌రిష్కారం

* గ్రామ సమాఖ్య అధికారి ఆధ్వర్యంలో అసంఘటిత కార్మికుల నమోదు ప్రక్రియ జరుగుతుంది.

* ఈ పధకం క్రింద లబ్ది దారుల నమోదుకు గ్రామాలలో ,పట్టణాలలో, నగరాలలో నివాస స్థాయి నమోదు సంఘాలు ఏర్పాటు చేయబడ్డాయి.

* ఈ పధకం క్రింద లబ్ది దారుల నమోదు మరియు పధకం ప్రయోజనాల అమలు పర్యవేక్షణ రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలలో ఏర్పాటు చేసిన కమిటీల బాధ్యత.

* జిల్లా కమిటీలో జిల్లా కలెక్టర్ అద్యక్షతన -ఫై.డి., డి.ఆర్.డి.ఓ. ఆధ్వర్యంలో ఈ పధకం అమలవుతుంది.

* ఈ పధకం క్రింద అస్న్ఘతిత కార్మికుల నమోదు మరియు క్లైముల పరిష్కారములో లబ్దిదారులకు సహాయ పడడానికి "కార్మిక సహాయ కేంద్రాలను" గ్రామాలలో, మండలాలో, పట్టణాలలో,నగరాలలో ఏర్పాటు చేస్తున్నారు.

Read more about: insurance ap andhra pradesh
English summary

చంద్ర‌న్న బీమా ప‌థ‌కంలో ఎలా ల‌బ్దిదారులుగా చేరాలి? | Chandrannabhima for unorgainsed sectors how to apply for it

All unorganised workers in the State in the age group of 18 to 70 years are eligible to be registered as unorganised workers and enrolled as beneficiaries of the Chandranna Bima Scheme.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X