పెట్టుబడులు పెట్టేవారు చేసే చిన్న తప్పుల వల్ల ఒక్కోసారి మ్యూచువల్ ఫండ్లో లక్ష్యంగా నిర్దేశించుకున్న సొమ్మును సంపాదించలేరు. ఇక్కడ పెట్టుబడిదారులు సిప్ మార్గంలో చేసే ఐదు తప్పులను తెలుసుకుందాం.
సిప్ మార్గంలో పెట్టుబడులు పెడుతూ ఉండటం వల్ల దీర్ఘకాలంలో ఒక ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. రోజువారీ, నెలవారీ, మూడు నెలలకు, ఆరు నెలలకు ఒకసారి చొప్పున పెట్టుబడులు పెట్టే వీలును మ్యూచువల్ ఫండ్ సిప్ కల్పిస్తుంది. అయితే పెట్టుబడులు పెట్టేవారు చేసే చిన్న తప్పుల వల్ల ఒక్కోసారి మ్యూచువల్ ఫండ్లో లక్ష్యంగా నిర్దేశించుకున్న సొమ్మును సంపాదించలేరు. ఇక్కడ పెట్టుబడిదారులు సిప్ మార్గంలో చేసే ఐదు తప్పులను తెలుసుకుందాం.

1. సిప్ లక్ష్యాన్ని నిర్దేశించే ముందు మన గురించి తెలుసుకోవాలి
ప్రస్తుత ఆర్థిక స్థితిని బేరీజువేసుకున్న తర్వాత మాత్రమే మొత్తం సిప్ మార్గంలో ఎంత పెట్టుబడులు పెట్టాలనే విషయాన్ని నిర్దారించుకోవాలి. మొదట్లో ఎక్కువ మొత్తం కమిట్ అయితే తర్వాత మధ్యలో లక్ష్యం మార్చుకోవడం, భవిష్యత్తులో పెట్టుబడుల పట్ల ఆసక్తి కోల్పోవడం వంటివి జరుగుతాయి. ఒకవేళ తక్కువ మొత్తంలో సిప్ ప్రారంభిస్తే మీరు నిర్దేశించుకున్న మొత్తం డబ్బును ఆర్జించలేకపోవచ్చు. అందుకే పెట్టుబడులు ప్రారంభించేటప్పుడే ఆర్థిక స్థితిని అంచనా వేసుకోవడం ముఖ్యం. అంతే కాకుండా రిస్క్ ఏ మేరకు తీసుకునేందుకు సిద్దం, లక్ష్యం చేరుకునేందుకు క్రమ పద్దతిలో ఎంత పెట్టుబడులు అవసరం అనేవి చూసుకుని సిప్ ద్వారా మినహాయించే సొమ్ము భారం కాకుండా చేసుకోవాలి.

2. దీర్ఘకాలం సంతోషం కోసం ఇప్పటి గురించి ఎక్కువ చింత వద్దు
చాలా మంది సిప్ మార్గంలో చేసే తప్పు తక్కువ కాలానికి పెట్టుబడులు పెడతారు. చాలా మంది అర్ధం చేసుకోని అంశం ఏమిటంటే ఎంత దీర్ఘకాలం పాటు సిప్ కొనసాగితే రాబడులు అంత మంచిగా ఉంటాయని. ఉదాహరణకు ప్రతి నెలా రూ.5000 చొప్పున 5 ఏళ్లు సిప్ కొనసాగించారు., అంటే మొత్తం రూ.3 లక్షలు పెట్టుబడి పెట్టారు. అప్పుడు 12% రాబడితో లెక్కిస్తే 5 ఏళ్లలో వచ్చే మొత్తం సొమ్ము రూ.4.12 లక్షలు. అంటే 5 సంవత్సరాల్లో 1.12 లక్షల రాబడి వచ్చింది. అదే సిప్‌ను మరో 10 ఏళ్ల పాటు ప్రతి నెలా సిప్ ద్వారా కొనసాగిస్తుంటే మొత్తం రూ.9 లక్షలు పెట్టుబడి పెట్టారనుకుందాం. 12% వార్షిక రాబడి చొప్పున లెక్కిస్తే పదిహేనేళ్లలో వచ్చే డబ్బు రూ.25.23 లక్షలు అవుతుంది. అందుకే సిప్ మార్గాన్ని ఎంచుకోగానే దీర్ఘకాలం పాటు పెట్టుబడి పెట్టాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంటే మంచిది.

3. సంపదను ఎక్కువ చేసుకోవాలంటే పెట్టుబడి పెట్టే మొత్తం సైతం పెరగాలి
వృత్తిపరంగా మీరు ఎదుగుతుంటే వేతనం కూడా దానితో పాటు పెరుగుతూ ఉంటుంది. అయితే మీ సిప్ పెట్టుబడి పెరుగుతున్నదా? ఉదాహరణకు మొదట్లో విహార యాత్ర లక్ష్యంగా రూ. 50,000 ఖర్చు అవుతుంది అనుకున్నారు. కాబట్టి రెండేళ్లకు నెలవారీ రూ.1000 సిప్‌తో ప్రారంభించారు. అప్పుడు కొద్ది రోజుల తర్వాత రూ.1000 సిప్ ద్వారా మీ లక్ష్యాన్ని చేరుకోలేరని తెలిసింది. అప్పుడు ఏం చేయాలంటే మీ సిప్ సొమ్మును పెంచాలి. బోనస్ వంటివి వచ్చినప్పుడు దాన్ని ఇలాంటి వాటికి ఉపయోగించవచ్చు.

4. పెద్ద లక్ష్యాలకు సిప్ మార్గం సరికాదనుకుంటే పొరపాటే
కొంత మంది పెట్టుబడిదారులకు సిప్ మార్గంపైన సదభిప్రాయం ఉండదు. ఇందులో చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టి, చిన్న చిన్న లక్ష్యాలకు మాత్రమే దీన్ని ఉపయోగించుకోవాలి అని అనుకుంటారు. అది సరి కాదు. మీ ఆర్థిక స్థితి, దీర్ఘకాలిక లక్ష్యం ఆధారంగా సైతం సిప్ ప్రారంభించవచ్చు. సిప్‌లు పెట్టేటప్పుడు వాటికేం గరిష్ట పరిమితి అని ఉండదు. ఉదాహరణకు వచ్చే 10 ఏళ్లలో ఇల్లు కొనాలని అనుకుంటారు. అప్పుడు సిప్ ద్వారా పెట్టే డబ్బు 2 లక్షలు అయితే 12% రాబడితో వచ్చే 10 ఏళ్లలో అది 4.65 కోట్లు అవుతుంది.

5. గ్రోత్ ఒక మంచి ఆప్షన్
పెట్టుబడిదారు ముందు రెండు ఆప్షన్లు ఉంటాయి. ఒకటి గ్రోత్ మరొకటి డివిడెండ్. మొత్తంలో నుంచి కొంత లాభాన్ని ఎప్పటికప్పుడు చెల్లించే ఆప్షన్ డివిడెండ్ అనేదానిలో ఉంటుంది. కాబట్టి కాంపౌండింగ్ ప్రభావం తగ్గుతుంది. అదే మరో వైపు గ్రోత్ ఆప్షన్లో లాభాన్ని తిరిగి ఇన్వెస్ట్ చేస్తారు కాబట్టి కాంపౌండింగ్ అవుతుంది. అంటే చక్రవడ్డీ లాంటి ప్రభావం కనబడుతుంది. అందుకే గ్రోత్ ఆప్షన్‌లో పెట్టుబడి పెట్టడం మేలు.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications