చాలా మంది ఏయే దేశాలు తిరగాలి, ఏ ప్రదేశాలు చూడాలి, ఎంత ఖర్చవుతుంది అనే విషయాల్లో ముందుగానే ప్రణాళిక వేసుకుంటారు. అయితే విదేశీ ప్రయాణాల్లో ఏదైనా జరిగితే ఖర్చులను తట్టుకునేలా ప్రయాణ బీమా పాలస
మధ్య తరగతి వాళ్లు సైతం విహార యాత్రలకు వెళ్లడం, కార్లు కొనడం వంటివి చేయడం మామూలైపోయింది. ఇదివరకటిలా పదవీ విరమణ తర్వాతి కోసం ఎంతో డబ్బు పొదుపు చేయాలి, పిల్లల కోసం చాలా సంపాదించాలనే ఆలోచన యువ నేస్తాల్లో మారిపోతోంది. ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలని ఉద్యోగులు భావిస్తున్నారు. తమ దగ్గర తగినంత లేకపోయినా బ్యాంకులు ఇచ్చే అప్పులతో విలాసాలకు వెనుకాడటం లేదు. చాలా మంది ఏయే దేశాలు తిరగాలి, ఏ ప్రదేశాలు చూడాలి, ఎంత ఖర్చవుతుంది అనే విషయాల్లో ముందుగానే ప్రణాళిక వేసుకుంటారు. అయితే విదేశీ ప్రయాణాల్లో ఏదైనా జరిగితే ఖర్చులను తట్టుకునేలా ప్రయాణ బీమా పాలసీ అవసరాన్ని మాత్రం అంతగా పట్టించుకోరు. ఈ నేపథ్యంలో విహార యాత్రలకు వెళ్లేవారు ప్రయాణ బీమా తీసుకుంటే కలిగే ప్రయోజనాలు అందులో ఉండే ముఖ్య విషయాలను తెలుసుకుందాం.

1. విదేశీ యానం-బీమా
ప్రస్తుతం చాలా బీమా సంస్థలు విదేశాలకు వెళ్లే ప్రయాణికులకు ప్రయాణ బీమా సౌకర్యాన్ని అందిస్తున్నాయి. పూర్తిస్థాయి బీమా పాలసీ తీసుకుంటే అనేక అంశాలకు బీమా కవరేజీ లభిస్తుంది. కొన్నింటిని కేవలం కొన్ని అవసరాల మేరకే తీసుకునే వెసులుబాటు కూడా ఉంటుంది. మీరు వెళ్లే ప్రాంతం, వ్యవధి, అవసరం, ఒక్కరే వెళుతున్నారా? జంటగా వెళుతున్నారా? అనే దాన్ని బట్టి ప్రయాణ బీమా పాలసీలు తీసుకోవచ్చు. వీటి ఆధారంగా కుటుంబ, కార్పొరేట్, సీనియర్ సిటిజన్, విద్యార్థి, ఒకసారి ప్రయాణానికి, అనేక సార్లు ప్రయాణానికి కవరేజీ ఉండేలా ఇలా రకరకాల పాలసీలను ఎంచుకోవచ్చు.

2. పాలసీ తీసుకునేటప్పుడు పరిశీలించాల్సిన అంశాలు
ఆరు నెలల వయసు నుంచి 70 ఏళ్ల వయసు వారి వరకూ... ఈ పాలసీలు అందుబాటులో ఉంటాయి. తీసుకున్న పాలసీని బట్టి, అందే ప్రయోజనాలు మారుతూ ఉంటాయి. అయితే చాలా పాలసీల్లో ఆసుపత్రి, వైద్య చికిత్స ఖర్చులకు పరిహారాన్ని పాలసీయే చెల్లిస్తుంది. మీ మొత్తం ప్రయాణ ఖర్చులో 5-8శాతం ప్రీమియం కోసం ఖర్చు అవుతుంది. జీవన ప్రమాణాల స్థాయి అధికంగా ఉన్న దేశాలు, ప్రమాదాలకు ఎక్కువ అవకాశం ఉండే దేశాలకు వెళ్లేటప్పుడు బీమా మొత్తం అధికంగా ఉండేలా చూసుకోవాలి. విదేశీ ప్రయాణానికి వెళ్లే కారణం మరో ముఖ్యాంశం. వ్యాపారానికి సంబంధించి వెళుతున్నారా? పర్యాటక ప్రాంతాలను చూడటానికి వెళుతున్నారా? అనేది బీమా మొత్తం నిర్ణయించడంలో కీలకం. సాహస క్రీడల్లాంటి వాటిల్లో పాల్గొనాలనే ఆలోచన ఉంటే... దానికి సంబంధించిన అనుబంధ పాలసీని తీసుకోవడం మర్చిపోకూడదు. ఇలాంటి వాటికి ప్రీమియం కూడా అధికంగానే ఉంటుంది.

3. ఏయే దేశాల్లో
కొన్ని దేశాలు తమ దేశానికి వచ్చే విదేశీ పర్యాటకులకు ప్రయాణ బీమా కచ్చితంగా ఉండాలనే నియమం ఉంది. కొన్ని దేశాలు దీని గురించి పట్టించుకోవడం లేదు. 60 ఏళ్లు దాటిన వారు అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా వెళ్లాలనుకుంటే కచ్చితంగా ప్రయాణ బీమా ఉండాల్సిందే. వైద్య చికిత్స ఖర్చులు అధికంగా ఉండే యూకే లాంటి దేశాలకు వెళుతున్నప్పుడు ప్రయాణ బీమా తీసుకోవడం మర్చిపోవద్దు. అయితే అనారోగ్యం, ప్రమాదాల బారిన పడటం లాంటి సంఘటనల నేపథ్యంలో ఇప్పుడు చాలా దేశాల్లో ప్రయాణ బీమా పాలసీ తీసుకోవాలని సూచిస్తున్నారు.

4. పాలసీ గడువు
విదేశీ ప్రయాణ బీమా పాలసీల గడువు ఒక రోజు నుంచి మొదలుకొని 6 నెలల వ్యవధి వరకూ ఉండేలా రూపొందించారు. విహార యాత్రలు, వ్యాపార నిమిత్తం వెళ్లేవారు ఒకసారి పూర్తి ప్రయాణానికి వర్తించేలా పాలసీని ఎంపిక చేసుకోవచ్చు. ఎక్కువ సార్లు విదేశాలను చట్టివచ్చేవారు ఏడాది వ్యవధికి పాలసీని తీసుకోవచ్చు. ఈ రెండు తరహా పాలసీలూ ప్రయాణాల్లో ఆర్థిక భరోసానిచ్చేవే. అనుకోని సంఘటనలు జరిగితే ఆదుకునేవే. ఒకసారి పాలసీని 6 నెలల కాలానికి తీసుకుంటే... మరో ఆరు నెలలకు దాన్ని పొడిగించుకునే వీలుంది. అయితే, పాలసీ తీసుకున్న ఆరు నెలల్లోపు ఏదైనా క్లెయిం చేసుకున్నప్పుడు మరోసారి పునరుద్దరించుకునేందుకు కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు అవకాశం కల్పించకపోవచ్చు.

5. మినహాయింపుల విషయంలో స్పష్టత అవసరం
చాలా రకాల ప్రయాణ బీమా పాలసీలు ముందస్తు వ్యాధుల చికిత్సకు పరిహారాన్ని ఇవ్వవు. ముఖ్యంగా హెచ్ఐవీ, మానసిక వ్యాధులకు పరిహారం చెల్లించే పాలసీలు దాదాపుగా అందుబాటులో లేవు. విదేశాల్లో క్రిమినల్ చర్యలకు పాల్పడినప్పుడు పాలసీదారుకు కలిగే నష్టానికి పరిహారం దక్కదు. ఉగ్రవాద చర్యల మూలంగా అత్యవసర పరిస్థితులు నెలకొన్నప్పుడు, ఆత్మహత్య చేసుకుంటే పాలసీ పరిహారం ఇవ్వదు. పాలసీ తీసుకునే ముందు వేటికి పరిహారం ఇస్తారు? వేటిని మినహాయిస్తారు అనే విషయంలో స్పష్టత కలిగి ఉండాలి.

6. ప్రయాణ బీమా ప్రయోజనాలు
- విదేశ ప్రయాణాల్లో అనారోగ్యం కారణంగా ఆసుపత్రిలో చేరితే చికిత్స ఖర్చులు
- అనారోగ్య అత్యవసర పరిస్థితుల్లో భారత్‌కు తిరిగొచ్చేందుకు
- అనుకోని విధంగా మరణిస్తే... మృతదేహాన్ని తరలించేందుకు
- ప్రమాదవశాత్తూ అయిన గాయాల చికిత్సకు
- ప్రయాణంలో బ్యాగేజి పోయినప్పుడు
- కొత్త పాస్‌పోర్ట్ తీసుకునేందుకు అయ్యే ఖర్చు
- అనివార్య కారణాలతో విమానం అందుకోలేని పరిస్థితుల్లో... వసతి, ఇతర ఖర్చులకు విదేశీ పర్యటనల్లో బీమా తీసుకున్న వ్యక్తి ద్వారా థర్డ్ పార్టీకి ఏదైనా నష్టం వాటిల్లి,దానికి పరిహారం ఇవ్వాల్సి వచ్చినప్పుడు ప్రయాణ బీమా ద్వారా ఆ పరిహారాన్ని క్లెయిం చేసుకునే అవకాశం
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు పసిడి రేటు ఎంత వరకు తగ్గిందంటే.. ఏప్రిల్ 13, సోమవారం ధరలు ఇవే..

బెంగళూరులో రూ. 5 వేలకే రూమ్..ఈ ఏరియాలోకి రమ్మని పిలుస్తున్న ఇంటి ఓనర్లు..

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications