For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆధార్ కార్డు స‌మాచారాన్ని ఆన్‌లైన్లో లాక్, అన్‌లాక్ చేయ‌డం ఎలా?

మీ ఆధార్ డేటా దుర్వినియోగం కాకుండా ఆన్‌లైన్‌లో మీ కార్డు వివ‌రాల‌ను లాక్‌, అన్‌లాక్ చేసుకోవ‌చ్చు. ఆ విధానం ఎలాగో కింద తెలుసుకుందాం.

|

ఇప్పుడు అంద‌రికీ ఆధార్ ప్రాముఖ్య‌త తెలిసి వ‌చ్చింది. అయితే ఆధార్ స‌మాచారం భ‌ద్రంగా ఉంటుంద‌నే న‌మ్మ‌కం చాలా మందికి లేదు. దీంతో యూఐడీఏఐ కొత్త సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. దీని ప్ర‌కారం మీ ఆధార్ డేటా దుర్వినియోగం కాకుండా ఆన్‌లైన్‌లో మీ కార్డు వివ‌రాల‌ను లాక్‌, అన్‌లాక్ చేసుకోవ‌చ్చు. ఆ విధానం ఎలాగో కింద తెలుసుకుందాం.

యూఐడీఏఐ వెబ్‌సైట్లో లాకింగ్‌

యూఐడీఏఐ వెబ్‌సైట్లో లాకింగ్‌

https://uidai.gov.in/ వెబ్‌సైట్లోకి వెళ్లండి

ఆధార్ సేవ‌ల్లో లాక్ లేదా అన్‌లాక్ బ‌యోమెట్రిక్స్ లింక్ మీద నొక్కాలి.

12 అంకెల ఆధార్ సంఖ్య‌ను, ప‌క్క‌నున్న కోడ్‌ను న‌మోదు చేయండి

మీ మొబైల్ నంబ‌రుకు ఓటీపీ వ‌స్తుంది. వెబ్‌సైట్లో ఈ ఓటీపీని ఎంట‌ర్ చేయండి.

లాకింగ్‌

లాకింగ్‌

వెబ్‌సైట్లో అన్ని వివ‌రాలు న‌మోదు చేసిన త‌ర్వాత లాక్‌పైన ఎనేబుల్ అనే ట్యాబ్ ను నొక్కండి.

లాకింగ్ పూర్త‌యిన త‌ర్వాత ఆధార్ బ‌యోమెట్రిక్ లాకింగ్ పూర్త‌యిన‌ట్లు మెసేజ్ వ‌స్తుంది.

ఒక‌సారి లాక్ అయిన త‌ర్వాత 10 నిమిషాల పాటు అన్‌లాక్ చేయ‌లేం.

ఆన్‌లైన్‌లోనే అన్‌లాక్ చేయ‌డం ఎలా?

ఆన్‌లైన్‌లోనే అన్‌లాక్ చేయ‌డం ఎలా?

యూఐడీఏఐ వెబ్‌సైట్లోకి వెళ్లండి. ఆధార్ బ‌యోమెట్రిక్ లాక్/అన్‌లాక్ లింక్ మీద క్లిక్ చేయాలి.

అది కొత్త విండోలోకి ఎంట‌ర్ అవుతుంది.

వివ‌రాల న‌మోదు

వివ‌రాల న‌మోదు

ఇప్పుడు 12 అంకెల ఆధార్ సంఖ్య‌, కోడ్ ఎంట‌ర్ చేయండి. త‌ర్వాత సెండ్ ఓటీపీ పైన నొక్కండి.

యూఐడీఏఐ మీ న‌మోదిత మొబైల్ నంబ‌రుకు ఓటీపీని పంపుతుంది. అవ‌స‌ర‌మైన చోట ఓటీపీని ఎంట‌ర్ చేసి లాగిన్ ఆప్ష‌న్‌ పైన నొక్కాలి.

ఓటీపీ కేవ‌లం 30 నిమిషాల పాటు ప‌నిచేస్తుంది కాబ‌ట్టి మొద‌టే మీ మొబైల్‌ను ద‌గ్గ‌ర ఉంచుకుంటే మంచిది.

ఆధార్ కార్డు అన్‌లాకింగ్‌

ఆధార్ కార్డు అన్‌లాకింగ్‌

ఇప్పుడు అన్‌లాక్ అనే దానిపైన నొక్కాలి. కోడ్ ద్వారా ఆధార్ బ‌యోమెట్రిక్ స‌మాచారం అన్‌లాక్ అవుతుంది. అంతే కాకుండా మ‌రో ఆప్ష‌న్ డిజేబుల్ అని ఉంటుంది. దీన్ని నొక్క‌డం ద్వారా మీరు పూర్తిగా ఆధార్ బ‌యోమెట్రిక్ డేటాను అన్‌లాక్ చేయ‌వ‌చ్చు. ఒక‌సారి ఈ విధానంలో ప‌ని పూర్త‌యిన త‌ర్వాత ఆధార్ అన్‌లాక్ అయిన‌ట్లు మెసేజ్ అందుకుంటారు.

Read more about: aadhar uidai
English summary

ఆధార్ కార్డు స‌మాచారాన్ని ఆన్‌లైన్లో లాక్, అన్‌లాక్ చేయ‌డం ఎలా? | How to lock and unlock aadhar bio metric data

What happens when Biometrics is locked:Locked Biometrics ensures the Aadhaar holder will not be able to use their Biometrics (fingerprints/iris) for authentications thus preventing potential misuse.
Story first published: Saturday, August 19, 2017, 14:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X