For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆన్‌లైన్ మార్గంలో ఆధార్ ద్వారా పాస్‌పోర్ట్ తెచ్చుకోవ‌డం ఎలా?

ఆధార్ సాయంతో పాస్‌పోర్టు పొందేందుకు కేవ‌లం 10 రోజులు ప‌డుతుంది. 10 రోజుల్లో మీ ఇంటి వ‌ద్ద‌కే పాస్‌పోర్టు తెచ్చుకునేందుకు ఏం చేయాలో ఇక్క‌డ తెలుసుకోండి

|

మీరు కాలేజీ రోజుల్లో పాస్‌పోర్ట్‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌లేదు. త‌ర్వాత ఉద్యోగం వెతుకుతున్న‌ప్పుడో, ఉద్యోగం వ‌చ్చాకో పాస్‌పోర్ట్ ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ కాస్త క‌ష్ట‌మే. దీన్ని సుల‌భ‌త‌రం చేసేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది. దీని ద్వారా మీరు 10 రోజుల్లో పాస్‌పోర్టు పొంద‌వ‌చ్చు. ఆధార్ సాయంతో పాస్‌పోర్టు పొందేందుకు కేవ‌లం 10 రోజులు ప‌డుతుంది. 10 రోజుల్లో మీ ఇంటి వ‌ద్ద‌కే పాస్‌పోర్టు తెచ్చుకునేందుకు ఏం చేయాలో ఇక్క‌డ తెలుసుకోండి.

 ఆధార్ మీకు ఏ విధంగా సాయ‌ప‌డుతుంది?

ఆధార్ మీకు ఏ విధంగా సాయ‌ప‌డుతుంది?

యూఐడీఏఐ జారీ చేసే 12 అంకెల సంఖ్య ఆధార్‌. ఈ ఆధార్ కార్డులో మీ బ‌యోమెట్రిక్‌, మీ గుర్తింపు వివ‌రాలు ఉంటాయి. అన్నింటికీ ఆధార్ లింక్ చేస్తుండ‌టంతో ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉండ‌టంతో విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ శాఖ సైతం పాస్‌పోర్ట్ జారీ చేసేందుకు ఆధార్‌తో లంకె పెట్టింది.

ముఖ్య విష‌యాలు

ముఖ్య విష‌యాలు

* ఆధార్ సాయంతో చేసే ప్ర‌క్రియ కోసం పాస్‌పోర్ట్ అధికారిక వెబ్‌సైట్ మాత్ర‌మే ఉప‌యోగించాలి.

* ద‌ర‌ఖాస్తు ప్రక్రియ చివ‌ర‌లో గుర్తింపు ప‌త్రంగా ఆధార్‌ను జ‌త‌ప‌ర‌చాలి.

* ద‌ర‌ఖాస్తు దారుకు అపాయింట్‌మెంట్ 3 రోజుల్లో ల‌భిస్తుంది.

* త‌ర్వాత 7 రోజుల్లో ద‌ర‌ఖాస్తు దారు ఇచ్చిన చిరునామాకే పాస్‌పోర్ట్ వ‌స్తుంది.

ఆన్‌లైన్ ద‌రఖాస్తు ప్ర‌క్రియ‌

ఆన్‌లైన్ ద‌రఖాస్తు ప్ర‌క్రియ‌

1. ఆధార్ సాయంతో పాస్‌పోర్టును చాలా తొంద‌ర‌గా పొంద‌వ‌చ్చు. అందుకే మీకు ఆధార్ లేకుంటే ఆధార్ న‌మోదు కోసం యూఐడీఏఐ వెబ్‌సైట్ నందు న‌మోదు చేసుకోవాలి. అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని నేరుగా ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ కేంద్రానికి వెళ్లి ఆధార్‌కు ద‌ర‌ఖాస్తు చేయ‌వ‌చ్చు.

2. పాస్‌పోర్ట్ అధికారిక వెబ్‌సైట్లో రిజిస్ట‌ర్ నౌ(Register Now) అనే దానిపై క్లిక్ చేయాలి. ఒక కొత్త పేజీలో విండో ఓపెన్ అవుతుంది.

3. ఇచ్చిన ఆప్ష‌న్ల‌లో నుంచి అప్లై పాస్‌పోర్ట్ అనే దానిని ఎంచుకోవాలి.

4. అప్లికేష‌న్ ఫారంలో అవ‌స‌ర‌మైన వివ‌రాల‌ను నింపాలి.

5. ద‌ర‌ఖాస్తును ఆన్‌లైన్‌లోనే స‌మ‌ర్పించాలి.

6. చివ‌ర్లో చెల్లింపుల‌ను ఆన్‌లైన్‌లోనే చేపట్ట‌వ‌చ్చు.

7. పాస్‌పోర్ట్ ద‌ర‌ఖాస్తు రుసుము చెల్లించిన త‌ర్వాత దాని ప్రింట్ తీసుకుని, ఆధార్ కాపీని ఒక‌దాన్ని దానితో క‌లిపి ఉంచాలి.

8. ద‌ర‌ఖాస్తు ఫారం ప్రింట్, ఆధార్‌ను తీసుకుని పాస్‌పోర్ట్ కేంద్రానికి వెళ్లాలి.

పాస్ పోర్ట్ వెబ్‌సైట్ ద‌ర‌ఖాస్తు లింక్‌

 ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు అవ‌స‌ర‌మ‌య్యే వివ‌రాలు

ఆన్‌లైన్ ద‌ర‌ఖాస్తుకు అవ‌స‌ర‌మ‌య్యే వివ‌రాలు

ద‌ర‌ఖాస్తు దారు నింపాల్సిన వివ‌రాలు

  1. పాస్‌పోర్ట్ కార్యాల‌యం
  2. మీ పేరు
  3. పుట్టిన తేదీ
  4. ఈ-మెయిల్ ఐడీ
  5. లాగిన్ ఐడీ
  6. పాస్‌వ‌ర్డ్‌

Read more about: aadhar passport
English summary

ఆన్‌లైన్ మార్గంలో ఆధార్ ద్వారా పాస్‌పోర్ట్ తెచ్చుకోవ‌డం ఎలా? | How to get passport within 10 days with the help of Aadhaar

Applicant needs to apply online. Aadhaar card has to be attached as proof of Identity and proof of address. The applicant will get the appointment within three days. In the next 7 days, the applicant will get the passport delivered at the address
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X