ద్రవ్యోల్బణం అంటే ఏమిటి?
నిత్యం మన సంపాదన పెరగనప్పటికీ ప్రతి సంవత్సరం చాలా వస్తువుల ధరలు మాత్రం మారుతుంటాయి. ఈ ధరల పెరుగుదలనే ద్రవ్యోల్బణం అని వ్యవహరిస్తుంటారు. చాలా సార్లు ఈ పదాన్ని విన్నప్పటికీ దాని అ
నిత్యం మన సంపాదన పెరగనప్పటికీ ప్రతి సంవత్సరం చాలా వస్తువుల ధరలు మాత్రం మారుతుంటాయి. ఈ ధరల పెరుగుదలనే ద్రవ్యోల్బణం అని వ్యవహరిస్తుంటారు. చాలా సార్లు ఈ పదాన్ని విన్నప్పటికీ దాని అర్థం మాత్రం ఎక్కువ మందికి తెలిసి ఉండదు. ఈ పదం గురించి కొంచెం సమాచారం తెలుసుకుందాం. సాధారణ పదాల్లో చెప్పాలంటే ధరల పెరుగుదల ఏ రేటుతో పెరుగుతుందో దాన్నే ద్రవ్యోల్బణం అని పిలుస్తారు.

ద్రవ్యోల్బణాన్ని ఎప్పుడూ శాతంలోనే చూపిస్తారు. అంతకుముందు కాలానికి, తర్వాతి కాలానికి మధ్య ఉండే వ్యవధిలో ధరల పెరుగుదల రేటు తెలుసుకునేందుకు ఇది పనికొస్తుంది. ఉదాహరణకు జూన్ 2016లో బ్రెడ్ రేటు 22 రూపాయలు ఉందనుకుందాం. అదే జూన్ 2017 నాటికి దాని ధర 28కి పెరిగింది అని అనుకుందాం. అప్పుడు ద్రవ్యోల్బణ పెరుగుదల రేటు 27% అని చెప్పొచ్చు. అంటే ఒక సంవత్సర కాలంలోనే బ్రెడ్ రేటు 27% పెరిగిందని అర్థం చేసుకోవాలి.
ప్రస్తుతం పెద్ద స్థాయిలో వాడే ద్రవ్యోల్బణం గురించి చూద్దాం. అంటే మీడియాలో మనకు తరచూ వినపడే ధరల పెరుగుదల. ఇది దేశంలో ఉండే ధరల పెరుగదలను గురించి తెలుపుతుంది. గణాంక, ప్రభుత్వ కార్యక్రమాల అమలు శాఖ దీన్ని లెక్కిస్తుంది. ఇందు కోసం ఆ శాఖ కొన్ని తిండి పదార్థాలు, తయారీ, పరిశ్రమ రంగానికి సంబంధించిన కొన్ని ఉత్పత్తులను పరిగణనలోకి తీసుకుంటుంది. ఒక్కో రంగానికి చెందిన వాటికి కొంత వెయిటేజీ ఇస్తారు. మొత్తం లెక్కించిన తర్వాత సగటును లెక్కగడతారు. చివరకు గతేడాది పోలిస్తే ఈ ఏడాది ధరల పెరుగుదల రేటును ప్రకటిస్తారు.


Click it and Unblock the Notifications