English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

అన‌వ‌స‌రంగా ఖ‌ర్చుల‌వుతున్నాయా.... అయితే ఇలా చేయండి

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

కాలేజీలో చ‌దువుకునేట‌ప్పుడు త‌ల్లిదండ్రులు స‌మ‌యానికి డ‌బ్బులు పంపుతారు. అప్పుడు ఖ‌ర్చు పెట్ట‌డం మ‌న ఇష్టం. ఒక ప్ర‌ణాళిక అంటూ లేకుండా జ‌ల్సా చేయ‌డం చాలా మంది చేసే ప‌ని. అదే ఒక‌సారి మ‌నం జీవితంలో ఏదో ఉద్యోగంలోనో, సొంత వ్యాపారం ద్వారా స్థిర‌ప‌డ్డామనుకోండి. మొత్తంగా అనూహ్యంగా సంపాద‌., పొదుపు లాంటి అంశాల‌పై మ‌న వైఖ‌రి మారిపోతుంది. అయితే చాలా కొద్ది మంది మాత్ర‌మే ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం ముందుకు సాగుతుంటారు. ఇంకొంత మంది ప్ర‌ణాళిక అయితే వేసుకుంటారు కానీ దానిని అనుస‌రించ‌రు. ఈ నేప‌థ్యంలో యువ ఉద్యోగులకు ఆర్థిక ప్ర‌ణాళిక‌కు సంబంధించిన సూచ‌న‌లు...

ఎవ‌రికి వారు ప్రశ్నించుకోవాలి:

ఎవ‌రికి వారు ప్రశ్నించుకోవాలి:

తగినట్లుగా క్రమం తప్పకుండా పొదుపు చేయాలంటే.. ఎందుకోసం పొదుపు చేస్తున్నాం? ఈ ప్రశ్న ఎవరికి వారు వేసుకోవాల్సిందే. ఈ లక్ష్యానికి తగినట్లుగా పెట్టుబడి సాధనాలను ఎంచుకోవచ్చు. ప‌ద‌వీ విర‌మ‌ణ‌, ఇంటి కొనుగోలు వంటి దీర్ఘకాల లక్ష్యాలకు పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకోవాలి.

హాలిడే టూర్, కార్ కొనుగోలు వంటి స్వ‌ల్ప కాలిక ల‌క్ష్యాల‌ కోసం లిక్విడ్ ఫండ్స్, రికరింగ్ డిపాజిట్స్‌ను ఎంచుకోవచ్చు. మీ లక్ష్యం ఎంత భారీగా ఉన్నా సరే, దాని గురించి ఎక్కువగా ఆలోచించేసి భయపడాల్సిన అవసరం లేదు. పరిస్థితులు ఎలా ఉన్నా దీర్ఘ కాల ప్రణాళికల్లో క్రమంగా మీ కలలు సాకారం చేసుకోవచ్చు.

అయితే ప్ర‌ణాళిక లేని మీ ఆర్థిక ప్ర‌యాణం మాత్రం చుక్కాని నావ లాగే సాగుతుంది.

 ఖ‌ర్చు కంటే పొదుపుకే ప్రాముఖ్య‌త‌

ఖ‌ర్చు కంటే పొదుపుకే ప్రాముఖ్య‌త‌

చాలా మంది ఉద్యోగులు మొదట తమ ఖర్చులకు ప్రాధాన్యం ఇస్తారు. మిగిలిన భాగాన్ని పొదుపు చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. ఈ విధంగా చేయడం ద్వారా పొదుపు సామర్ధ్యం గణనీయంగా త‌గ్గిపోతుంది. సహజంగా ఖర్చుల తర్వాత పొదుపు చేసేందుకు పెద్దగా మిగిలేది ఏమీ ఉండ‌క‌పోవ‌చ్చు

దీనికి బదులుగా పొదుపు చేసిన తర్వాత ఖర్చు చేయాలనే తత్వాన్ని అలవాటు చేసుకోవాలి. మీ బ్యాంకు నుంచి పెట్టుబడులకు ఎస్ఐపీ(సిప్‌) చేయడం, రికరింగ్ డిపాజిట్‌ వంటివి ప్రారంభిస్తే, ఆటోమేటిక్ ట్రాన్స్‌ఫర్ ద్వారా ఈ మొత్తం సేవింగ్స్ ఖాతా నుంచి బదిలీ అయిపోతుంది. అపుడు మిగిలిన మొత్తాన్ని ఖర్చులకు ఉపయోగించుకోవచ్చు.

బడ్జెట్ వేసుకోండి

బడ్జెట్ వేసుకోండి

సంపాద‌న బాగా ఉన్న వ‌య‌సులో చాలా మంది చేసే ప‌ని మొద‌ట ఏదో ఖ‌ర్చు ద‌ర్జాగా చేసేయ‌డం. త‌ర్వాత దాని గురించి బాధ‌ప‌డ‌టం. ఇప్పుడు మీలో కూడా ఇలాంటి ల‌క్షణం ఉంటే ఇలా చేయండి. అన‌వ‌స‌ర‌ ఖర్చు నుంచి తప్పించుకోవడానికి సులభమైన మార్గం బడ్జెట్ వేసుకోవడం. పొదుపు ప్రారంభించే వాళ్లు 70-30 రూల్‌ని పాటించాలి. అంటే నెలవారీ ఆదాయంలో 70 శాతం మాత్రమే ఖర్చు చేయాలి. అద్దె, ఆహారం, లైఫ్‌స్టైల్ వంటివన్నీ ఈ 70శాతంలోనే ఉండాలి. మిగిలిన 30 శాతం పొదుపు, పెట్టుబడుల కోసం ఉపయోగించాలి.

బాగా ఒత్తిడి కలిగించే కొన్ని నెలల్లో ఈ సిద్ధాంతం పాటించలేకపోవచ్చు. కానీ ఈనెలల్లో కూడా వీలైనంతంగా పొదుపు చేసేందుకే ప్రయత్నించాలి.

 అప్పు చేస్తున్నారా.... కాస్త ఆలోచించండి...

అప్పు చేస్తున్నారా.... కాస్త ఆలోచించండి...

ఇష్టం వచ్చినట్లుగా పరిమితి, పరిధి మించి ఖర్చు చేయడానికి ప్రధాన కారణంగా క్రెడిట్‌ కార్డులను చెప్పచ్చు. ఇలాంటి ప్రణాళిక లేని ఖర్చులను కచ్చితంగా తప్పించాలి. అత్యవసరం ఉంటే తప్ప క్రెడిట్ కార్డ్ ఉపయోగించకూడదనే ఆలోచనకు కట్టుబడి ఉంటాలి. స్నేహితుడి నుంచో బ్యాంకు నుంచో అప్పు తీసుకుని ఉంటే, అందుకు తగినట్లుగా రీపేమెంట్ ప్రణాళిక మీ దగ్గర ఉండాలి. అలాగే వీలైనంత త్వరగా తీర్చేయాలి.

పాత‌ రుణాలను తీర్చేందుకు మరిన్ని కొత్త‌ అప్పులు చేయడం వంటివి అసలు చేయకూడదు. పెట్టుబడి కంటే ముందు రుణాలను తీర్చివేయడానికే మొద‌టి ప్రాధాన్యత ఇవ్వాలి. ఎందుకంటే పొదుపు, పెట్టుబడులపై వచ్చే వడ్డీ కంటే.. రుణాలకు చెల్లించే వడ్డీ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది.

పెట్టుబడులపై వాస్తవికంగా ఉండాలి

పెట్టుబడులపై వాస్తవికంగా ఉండాలి

నిర్ణయించుకునే లక్ష్యాల విషయంలో వాస్తవ దృక్పథంతో ఆలోచించాల్సి ఉంటుంది. భారీ లక్ష్యాలను నిర్దేశించుకుని నిత్యావసరాలను కూడా తగ్గించుకునే స్థాయిలో పొదుపు ఉండడం సమంజసం కాదు. అసాధ్యమైన ఆర్థిక ల‌క్ష్యాల‌ కోసం కష్టపడితే.. సాధారణ జీవితం ఇబ్బందికి గురి అయే ప్రమాదం ఉంటుంది.

ఒకానొక స్థాయిలో రెండిటినీ సమతూకం పాటించడం కష్టం అయిపోతుంది. అందుకే పొదుపు విషయంలో కచ్చితంగా ఉన్నా, వచ్చే ఆదాయంతో రోజువారీ జీవితం ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి.

English summary

5 financial tips for young employees

Having regular inflow in your account will bring along so many loan offers from banks and when you are not sure about your goals and requirements, you will surely get tempted to go overboard and take loans for many not required things. Till the time you don’t get confidence in managing your finances you should not indulge into any kind of loan…be it for a bigger car or apartment. Taking loans at this stage will create long term commitments which permanently commit you to higher spending in the future and can make it harder to deal with uncertainties of life later.
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC