English हिन्दी ಕನ್ನಡ മലയാളം தமிழ்

త‌క్కువ కాల‌ప‌రిమితి గ‌ల ఉత్త‌మ పెట్టుబ‌డి ప‌థ‌కాలు

Written By: Chandrasekhar
Subscribe to GoodReturns Telugu

గతంలో ఏడాది, మూడేళ్ల టర్మ్‌ డిపాజిట్లపై బ్యాంకుల ఫిక్స్‌డ్‌ డిపాజిట్లతో పోలిస్తే కాస్త అధిక వడ్డీ వ‌చ్చేది. అందుకే, చాలామంది వీటిలోనే ఎక్కువగా మదుపు చేసేవారు. బ్యాంకులు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లను నిలుపుకొనే లక్ష్యంతో తొందరపడి వడ్డీ రేట్లను తగ్గించేవి కావు. ప్రస్తుతం పొదుపు పథకాల వడ్డీ రేట్లను ప్రభుత్వం తగ్గించింది. ఆర్‌బీఐ గ‌త ఏడాదిన్న‌ర కాలంలో రేట్లు బాగా తగ్గించింది. దీంతో బ్యాంకులు కూడా అదే బాటలో పయనిస్తున్నాయి. ఈ నేప‌థ్యంలో స్వ‌ల్ప‌కాలానికి ఎక్కడ పెట్టుబ‌డి పెట్టాల‌నే అంశం బాగా చ‌ర్చ‌నీయ‌మైంది. చెప్పుకోద‌గ్గ రాబ‌డులతో 10 ఉత్త‌మ స్వ‌ల్ప‌కాలిక పెట్టుబ‌డుల‌ను ఇక్క‌డ చూడొచ్చు.

1.నెల‌వారీ ఆదాయ ప‌థ‌కాలు

1.నెల‌వారీ ఆదాయ ప‌థ‌కాలు

మీకు క్ర‌మంగా ఆదాయం కావాల‌నుకుంటే ఇప్ప‌ట్లో పోస్ట‌ల్ ఎంఐపీ(మంత్లీ ఇన్‌క‌మ్ ప్లాన్‌)లు ఉత్త‌మం. 5 ఏళ్ల కాలానికి నెలవారీ క్ర‌మ‌మైన ఆదాయం ఇచ్చేలా పోస్టాఫీసు నెల‌వారీ ఆదాయ ప‌థ‌కాలు ఉన్నాయి. వీటిలో క‌నీసం 7.5 నుంచి 8 శాతం వర‌కూ వార్షిక రాబ‌డుల‌ను ఆశించ‌వ‌చ్చు. త‌క్కువ ట్యాక్స్ శ్లాబులో ఉంటూ త‌క్కువ రిస్క్ తీసుకునే వారికి ఇవి బాగా న‌ప్పుతాయి. ఒక‌సారి ఈ ప‌థ‌కంలో చేరిన త‌ర్వాత ఏడాది గ‌డిచిన త‌ర్వాత మాత్ర‌మే విత్‌డ్రాయ‌ల్స్‌కు అనుమ‌తిస్తార‌ని గుర్తుంచుకోవాలి.

2.ఐదేళ్ల జాతీయ పొదుపు ప‌త్రాలు

2.ఐదేళ్ల జాతీయ పొదుపు ప‌త్రాలు

మీ ఆర్థిక ల‌క్ష్యం 5 ఏళ్ల‌ని త‌ప్ప‌నిస‌రిగా నిర్దేశించుకుంటేనే మీరు 5 ఏళ్ల జాతీయ పొదుపు(ఎన్ఎస్‌సీ)ని ఎంచుకోవ‌చ్చు. సాధార‌ణ ప‌రిస్థితి ఉన్న‌ప్పుడు గ‌డువు తీర‌క ముందే పెట్టుబ‌డిని వెన‌క్కి తీసుకునేందుకు వీల్లేదు. ఖాతాదారుడు మ‌ర‌ణించిన సంద‌ర్భంలో ఖాతాను మూసివేయ‌వ‌చ్చు. జాతీయ పొదుపు ప‌త్రాల‌ను జారీ చేసిన‌ప్ప‌టి నుంచి మెచ్యూరిటీ తీరేలోపు ఒక‌సారి ఒక‌రి పేరు మీద నుంచి మ‌రొక‌రి పేరిట బ‌దిలీ చేసుకునే స‌దుపాయం ఉంది.

సెక్ష‌న్ 80సీ కింద మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. అయితే వీటిపై వ‌చ్చే వ‌డ్డీకి ప‌న్ను క‌ట్టాల్సిందేన‌ని గుర్తుంచుకోండి.

3. ట్యాక్స్ ఫ్రీ బాండ్లు

3. ట్యాక్స్ ఫ్రీ బాండ్లు

గ‌త కొన్నేళ్లుగా ట్యాక్స్ ఫ్రీ బాండ్ల‌లో పెట్టుబ‌డుల ద్వారా వ‌చ్చిన రాబ‌డులు మ్యూచువ‌ల్ ఫండ్స్‌లో ఉండే మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ ఈక్విటీల కంటే ఎక్కువ అని విశ్లేష‌ణ‌లు వెల్ల‌డిస్తున్నాయి. గ‌తేడాది జ‌న‌వ‌రి-మార్చి మ‌ధ్య నాబార్డ్‌, హ‌డ్కో, ఐఆర్ఎఫ్‌సీ ట్యాక్స్ ఫ్రీ బాండ్ల‌ను మార్కెట్లో ప్ర‌వేశపెట్టాయి. ఇవి 7.6-7.7% మ‌ధ్య రేట్ల‌తో నిధుల‌ను సేక‌రించాయి. సాధార‌ణంగా బాండ్లు 22 నుంచి 28% మ‌ధ్య రాబ‌డుల‌ను ఇచ్చిన చ‌రిత్ర ఉంది. మీరు 20%,30% ట్యాక్స్ బ్రాకెట్లో ఉంటే ప‌న్ను ర‌హిత ఆదాయానికి ఈ బాండ్లు మీకు బాగా ఉప‌యోగ‌ప‌డ‌గ‌ల‌వు.

4.రిక‌రింగ్ డిపాజిట్లు

4.రిక‌రింగ్ డిపాజిట్లు

బ్యాంకులు ఆఫ‌ర్ చేసే ట‌ర్మ్ డిపాజిట్ల లాంటిదే ఆర్‌డీ. ఇప్పుడిప్పుడే పెట్టుబ‌డులు ప్రారంభించేవారు మొద‌ట ఏ విధంగా మొద‌లుపెట్టాలో సందేహం ఉన్న‌ప్పుడు ఏదో బ్యాంకులో లేదా పోస్టాఫీసులో ఆర్‌డీ ప్రారంభించ‌డం ఉత్త‌మం. 6 నెల‌ల కాల వ్య‌వ‌ధి మొద‌లుకొని 10 ఏళ్ల కాలప‌రిమితి ఉండేలా ఆర్‌డీల‌ను బ్యాంకులు అందుబాటులో ఉంచాయి. ఒక‌సారి మీరు ఆర్‌డీ చేసేట‌ప్పుడు నిర్ణ‌యించిన వ‌డ్డీ రేటే చివ‌రి వ‌ర‌కూ అమ‌ల్లో ఉంటుంది. బ్యాంకు ఆర్‌డీల్లో వ‌చ్చే వ‌డ్డీపై సైతం మీ ఆదాయ‌పు ప‌న్ను శ్లాబును అనుస‌రించి ప‌న్ను వ‌ర్తిస్తుంది. అయితే పోస్టాఫీసు ఆర్‌డీల్లో టీడీఎస్ ఉండ‌దు. అయితే మీ మొత్తం ఆదాయానికి వ‌డ్డీ ఆదాయాన్ని జ‌త‌చేసి చూపాల్సిందే.

5. బ్యాంకు ఎఫ్‌డీలు లేదా పోస్ట‌ల్ ట‌ర్మ్ డిపాజిట్లు

5. బ్యాంకు ఎఫ్‌డీలు లేదా పోస్ట‌ల్ ట‌ర్మ్ డిపాజిట్లు

వివిధ పెట్టుబ‌డి ప‌థ‌కాల‌పై పెద్ద‌గా అవ‌గాహ‌న లేని వారికి ఈ మార్గం ఉత్త‌మం. ఒక్క‌సారిగా పెద్ద‌మొత్తంలో పెట్టుబ‌డి పెట్టాలంటే బ్యాంకు ఎఫ్‌డీలు స‌రైన‌వి. ఇప్ప‌టివ‌ర‌కూ ఎటువంటి ఎఫ్‌డీలు లేక‌పోతే ఆన్‌లైన్‌లోనే ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎఫ్‌డీని తెర‌వ‌చ్చు. మూడేళ్ల పైబ‌డి ప‌న్ను ఆదా కోస‌మైతే ఎఫ్‌డీల కంటే ఇత‌ర పెట్టుబ‌డి మార్గాల వైపు మ‌ళ్లొచ్చు. డెట్ ఫండ్లు లేదా ఆర్బిట్రేజ్ ఫండ్ల‌ను ప‌రిశీలించ‌వ‌చ్చు. కొంత మంది ఎక్కువ రాబ‌డుల కోసం కార్పొరేట్ ఎఫ్‌డీల‌ను ఇష్ట‌ప‌డ‌తారు. ఇందులో రాబ‌డి క‌చ్చిత‌త్వానికి హామీ లేదు. ఈ విధంగా చూస్తే కార్పొరేట్ ఎఫ్‌డీల కంటే పోస్ట‌ల్ ట‌ర్మ్ డిపాజిట్ల వైపు మొగ్గుచూప‌డ‌మే మంచిది.

6. లిక్విడ్ ఫండ్లు

6. లిక్విడ్ ఫండ్లు

లిక్విడ్ ఫండ్లు ప‌రోక్షంగా త‌మ నిధుల‌ను స్వ‌ల్ప‌కాలిక ప్ర‌భుత్వ సెక్యూరిటీల్లోనూ, స‌ర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్ల‌లోనే పెట్టుబ‌డులుగా పెడ‌తాయి. ర‌క్ష‌ణ ప‌రంగా చూస్తే ఈ ఫండ్లు స్వ‌ల్ప‌కాలంలో మంచి భ‌ద్ర‌త క‌లిగి ఉంటాయి. మీరు కావాల‌నుకున్న‌ప్పుడు ఈ ఫండ‌ల్లో పెట్టుబ‌డులు పెట్టొచ్చు, వ‌ద్దు అనుకున్న‌ప్పుడు మీ సొమ్ము వెన‌క్కి తీసుకోవ‌చ్చు. ప‌న్నుల‌న్నీ తీసివేస్తే 4 నుంచి 7% రాబ‌డుల‌ను వీటి నుంచి ఆశించ‌వ‌చ్చు. అత్య‌వ‌స‌ర నిధి, స్వ‌ల్ప‌కాలికి ల‌క్ష్యాల కోసం పొదుపు చేసే ఆలోచ‌న ఉన్న‌వారు వీటిల్లో డ‌బ్బు మ‌దుపు చేయ‌వ‌చ్చు.

7. అల్ట్రా షార్ట్ ట‌ర్మ్ ఫండ్లు

7. అల్ట్రా షార్ట్ ట‌ర్మ్ ఫండ్లు

క‌మ‌ర్షియ‌ల్ పేప‌ర్లు, స‌ర్టిఫికెట్ ఆఫ్ డిపాజిట్లు, బాండ్ ఫండ్ల‌లో ఈ ర‌క‌మైన ఫండ్లు మ‌దుపు చేస్తాయి. 6 నెల‌ల నుంచి మొద‌లుకొని 5 ఏళ్ల కాలావ‌ధికి ఈ అల్ట్రా షార్ట్ ట‌ర్మ్ ఫండ్లు అందుబాటులో ఉంటాయి. 6 నెల‌ల నుంచి సంవ‌త్స‌రం లోపు డ‌బ్బును పెట్టుబ‌డి పెట్టాల‌నుకునేవారు ఇందులో మ‌దుపు చేయ‌వ‌చ్చు. అయితే లిక్విడ్ ఫండ్ల కంటే అల్ట్రా షార్ట్ ట‌ర్మ్ ఫండ్లు కాస్త రిస్క్ ఎక్కువ క‌లిగి ఉంటాయి. ఎందుకంటే ఇవి వాటి పెట్టుబ‌డుల‌ను షార్ట్ ట‌ర్మ్ డెట్ సెక్యూరిటీల్లో ఉంచుతాయి.

8. మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ మ్యూచువ‌ల్ ఫండ్లు

8. మిడ్ క్యాప్‌, స్మాల్ క్యాప్ మ్యూచువ‌ల్ ఫండ్లు

ఈ ప‌థ‌కాల్లో సొమ్మును త‌క్కువ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ ఉన్న కంపెనీల్లో పెట్టుబ‌డులుగా పెడ‌తారు. పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌లో భాగంగా మొత్తంగా చూస్తే ఎక్కువ రాబ‌డులు కావాల‌నుకుంటే మిడ్‌క్యాప్‌,స్మాల్ క్యాప్ ఫండ్లు ఒక ఉత్త‌మ మార్గం. ప్ర‌స్తుతం చాలా రోజుల నుంచి ఫ్రాంక్లిన్ ఇండియా స్మాల‌ర్ కంపెనీస్ ఫండ్‌, డీఎస్‌పీ బ్లాక్‌రాక్ మైక్రోక్యాప్ ఫండ్‌, హెచ్‌డీఎఫ్‌సీ మిడ్‌క్యాప్ ఆప‌ర్చునుటీస్ ఫండ్‌, మిరాయి ఎమ‌ర్జింగ్ బ్లూచిప్ ఫండ్, మోతిలాల్ ఓస్వాల్ మిడ్‌క్యాప్ 30 ఫండ్‌ వంటివి ప‌నితీరు బాగా క‌న‌బ‌రుస్తున్నాయి.

 9. ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్లు

9. ఫిక్స్‌డ్ మెచ్యూరిటీ ప్లాన్లు

ఈ ఫండ్లు మూడేళ్ల లాక్ ఇన్ పీరియ‌డ్‌ను క‌లిగి ఉంటాయి. ఇవి దాదాపు డెట్ ఫండ్ల‌లానే ఉంటాయి కాబ‌ట్టి మీకు స‌రైన పెట్టుబ‌డి ల‌క్ష్యం ఉన్న‌ప్పుడే వీటివైపు మొగ్గుచూప‌డం మంచిది. దాదాపు బ్యాంకు ఎఫ్‌డీల్లానే ప‌నితీరు ఉన్న‌ప్ప‌టికీ, ప‌న్ను ఆదా కోణంలో చూస్తే ఎఫ్‌డీల కంటే ఎక్కువ రాబ‌డుల‌నే ఆశించ‌వ‌చ్చు.

10. ఆర్బిట్రేజ్ ఫండ్లు

10. ఆర్బిట్రేజ్ ఫండ్లు

వీటిని ఒక‌ర‌కంగా ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లాగా ప‌రిగ‌ణిస్తారు. క్రిసిల్ ఆర్బిట్రేజ్‌, ఆర్బిట్రేజ్ ప్ల‌స్ ఫండ్ల మ‌ధ్య తేడాను స్ప‌ష్టంగా చూసుకోవాల‌ని సూచించింది. అంతేకాకుండా వీటిల్లో పెట్టుబ‌డి పెట్టాల‌నుకున్న‌ప్పుడు ఎగ్జిట్ లోడ్ గురించి తెలుసుకుని ఉండ‌టం మంచిది. స్వ‌ల్ప‌కాలంలో బ్యాంకు డిపాజిట్ల కంటే ఎక్కువ ఆదాయం కావాల‌నుకునే వారికి ఇవి అనుకూల‌మైన‌విగా చెప్ప‌వ‌చ్చు. సాధార‌ణంగా మూడు నెల‌ల నుంచి ఆరు నెల‌ల కాల‌ప‌రిమితిలో వీటిలో పెట్టుబ‌డి పెట్టొచ్చు. అదే ప‌న్ను ప్ర‌యోజ‌నాల కోస‌మ‌యితే 12 నెల‌ల వ‌ర‌కూ సైతం పెట్టుబ‌డి పెట్ట‌వ‌చ్చు.

Read more about: invest, return, investments
English summary

10 best short term investment options in India

There are no dearth of investment opportunities, when it comes to short term investment ideas in India. However, one is always looking for investments that give you high returns and yields in India. Some of these are taxable and you need to consider the tax liability as well. Here are 10 best short term investments with high returns. These investments are safe in India for the year 2017
Please Wait while comments are loading...
Company Search
Enter the first few characters of the company's name or the NSE symbol or BSE code and click 'Go'
Thousands of Goodreturn readers receive our evening newsletter.
Have you subscribed?

Find IFSC