For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డిజిట‌ల్ లావాదేవీలన్నీ సుర‌క్షిత‌మేనా?

ప్రస్తుతానికి క‌రెన్సీ త‌క్కువ ఉన్న నేప‌థ్యంలో అనివార్యంగానైనా చాలామంది డిజిట‌ల్ లావాదేవీల‌నే అనుస‌రిస్తున్నారు. ఇంట‌ర్నెట్‌,మొబైల్ బ్యాంకింగ్‌లను ఉప‌యోగిస్తున్న చాలా మంది ఇక్క‌డ దాని వ‌ల్ల ప్ర‌యోజ‌నా

|

డిజిట‌ల్ లావాదేవీల‌ను ప్రోత్స‌హించేందుకు ప్ర‌భుత్వం, ఆర్‌బీఐ తీవ్రంగా శ్ర‌మిస్తున్నాయి. యువ‌త కూడా పెద్దఎత్తున మొబైల్ బ్యాంకింగ్‌ను ఉప‌యోగించ‌డం ఎక్కువ చేశారు. స‌మ‌యం, ఓపిక లేని చాలా మందికి మొబైల్ బ్యాంకింగ్‌, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ పెద్ద వ‌రాల్లాంటివి. గ్రామీణ ప్రాంతాల్లో సైతం యువ‌త ఎల‌క్ట్రానిక్ లావాదేవీల గురించి పెద్ద‌వారికి సైతం అవ‌గాహ‌న క‌ల్పిస్తున్నారు. కార్డు లావాదేవీల‌పై రుసుముల కార‌ణంగా చాలా మంది వెనుక‌డుగు వేస్తున్న నేప‌థ్యంలో ప్ర‌భుత్వం చాలా చార్జీల‌ను కొంత‌కాలం పాటు ఎత్తివేసింది. ప్రస్తుతానికి క‌రెన్సీ త‌క్కువ ఉన్న నేప‌థ్యంలో అనివార్యంగానైనా చాలామంది డిజిట‌ల్ లావాదేవీల‌నే అనుస‌రిస్తున్నారు. ఇంట‌ర్నెట్‌,మొబైల్ బ్యాంకింగ్‌లను ఉప‌యోగిస్తున్న చాలా మంది ఇక్క‌డ దాని వ‌ల్ల ప్ర‌యోజ‌నాలు, రిస్కుల‌ను ఇక్క‌డ తెలుసుకోండి.

స‌మ‌యం ఆదా, సౌక‌ర్యవంతం

స‌మ‌యం ఆదా, సౌక‌ర్యవంతం

చేతిలో మొబైల్, ఇంట‌ర్నెట్ ఉంటే ఎక్క‌డినుంచైనా చెల్లింపులు, లావాదేవీల‌ను జ‌రిపేందుకు ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌,మొబైల్ బ్యాంకింగ్ అవ‌కాశం క‌ల్పిస్తాయి. బంధుమిత్రుల నుంచి క్ష‌ణాల్లో డ‌బ్బు పొంద‌వ‌చ్చు. చాలా బ్యాంకులు మొబైల్ బ్యాంకింగ్‌ను ఉచితంగా అందిస్తున్నాయి. ఎన్ని సార్లైనా మొబైల్ బ్యాంకింగ్ యాప్‌ను తెరిచి మీ బ్యాలెన్స్‌ను చెక్ చేసుకోవ‌చ్చు. ఇటీవ‌లి లావాదేవీల‌కు సంబంధించిన స్టేట్‌మెంట్ల‌ను చూడొచ్చు. న‌గ‌దు లావాదేవీల విష‌యంలో వ‌స్తుసేవ‌ల కొనుగోలు, అమ్మ‌కాలు జ‌రిగే చోట మ‌నం ఉండాలి. అక్క‌డ‌కు మ‌నం ప్ర‌యాణించాలి. ఇందుకోసం చాలా స‌మ‌యం కేటాయించాలి. అదే ఆన్‌లైన్ లావాదేవీలయితే ఈ రెండూ బాధ‌లు ఉండ‌వు.

ఎన్‌క్రిప్ష‌న్‌

ఎన్‌క్రిప్ష‌న్‌

ప్లేస్టోర్ నుంచి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకున్న‌ట్ల‌యితే మీ డేటా మీ మొబైల్‌లో కానీ సిమ్ కార్డులో సేవ్‌(నిక్షిప్తం) కావ‌ని బ్యాంకులు హామీ ఇస్తున్నాయి. అంతే కాకుండా యాప్‌ల‌న్నీ ఎన్‌క్రిప్ష‌న్ టెక్నాల‌జీని క‌లిగి ఉంటాయి. దీంతో మొబైల్ బ్యాంకింగ్‌, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్లు సుర‌క్షితంగా ఉండ‌టంతో పాటు భ‌ద్ర‌త‌ను క‌లిగి ఉన్న‌ట్లే.

ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ కంటే మొబైల్ బ్యాంకింగే మెరుగు

ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ కంటే మొబైల్ బ్యాంకింగే మెరుగు

చాలా మంది నిపుణులు చెప్పే దాని ప్ర‌కారం మొబైల్ బ్యాంకింగ్ ప్ర్ర‌క్రియ, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ కంటే మెరుగైన‌ది. ఎందుకంటే ఫోన్, డెస్క్‌టాప్‌ల్లో ట్రోజాన్ వైర‌స్ ఉండే అవ‌కాశం ఉంది. సైబ‌ర్ మోసాల‌కు పాల్ప‌డే వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటే ప్ర‌జ‌ల్లో డిజిట‌ల్ లావాదేవీల‌పై భ‌రోసా పెరుగుతుంది. లేకుంటే ఆన్‌లైన్ లావాదేవీలు పుంజుకునేందుకు అవ‌కాశాలు ప‌రిమిత‌మ‌వుతాయి.

సైబ‌ర్ నేర‌గాళ్లు కాచుకుని ఉంటారు

సైబ‌ర్ నేర‌గాళ్లు కాచుకుని ఉంటారు

క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ప్రీపెయిడ్ కార్డుల స‌మ‌చారం హ్యాక‌ర్ల బారిన ప‌డుతోంద‌ని అప్పుడప్పుడు వస్తున్న వార్త‌లు కార్డుదార్ల‌ను ఆందోళ‌న‌కు గురిచేస్తాయి. ఆన్‌లైన్ షాపింగ్ త‌రుచూ చేసేవారు ఎంత జాగ్ర‌త్త‌గా ఉన్నా ఒక్కోసారి కార్డు వివ‌రాల‌ను త‌స్క‌రించిన ఘ‌ట‌న‌లు ఉన్నాయి. వ‌స్తు సేవ‌ల‌ను పొందిన త‌ర్వాత ఆన్‌లైన్లో చెల్లింపులు జ‌రిపేట‌ప్పుడు సైబ‌ర్ కేటుగాళ్లు ఖాతా సంబంధిత వివ‌రాల‌ను చోరీ చేసి బ్యాంకు ఖాతాల్లోని సొమ్మును డ్రా చేయ‌డం లేదా పేమెంట్ల‌కు ఉప‌యోగించ‌డం చేస్తుంటారు. ఆన్‌లైన్ మోసాలు, హ్యాకింగ్‌కు సంబంధించి ప్ర‌భుత్వం ప‌టిష్ట భ‌ద్ర‌త‌ను ఏర్పాటు చేస్తేనే డిజిట‌ల్ లావాదేవీల‌ను నిశ్చింత‌గా చేసుకోవ‌చ్చు.

అన్నీ ఫోన్ ద్వారానే

అన్నీ ఫోన్ ద్వారానే

ప్ర‌స్తుతం అంతా ఫాస్ట్ ట్రాక్‌. మొబైల్ ఫోన్ నుంచి చెల్లింపులు చేయ‌డం బాగా అల‌వాట‌యిపోయింది యువ‌త‌కు. అది అటు వ్యాపార సంస్థ‌ల‌కు, క‌స్ట‌మ‌ర్ల‌కు ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటోంది. దీంతో టెక్ ప్రియులంతా మొబైల్ ఫోన్ల‌లో వివిధ బ్యాంకింగ్ యాప్‌, వ్యాలెట్ల‌ను ఇన్‌స్టాల్ చేసుకుంటున్నారు. వీటిల్లో కొంత‌మంది త‌మ కార్డుల వివ‌రాల‌ను నిక్షిప్తం చేసుకుంటున్నారు. కొంచెం భ‌ద్ర‌త‌పై దృష్టిపెట్టేవారు ఈ త‌ర‌హా యాప్‌ల‌కు సెక్యూరిటీ నంబ‌ర్లు(లాక్‌) పెట్టుకుంటారు. మ‌రికొంత మంది తెలియ‌ని త‌నంతో, మ‌రో త‌ర‌హా వారు బ‌ద్దకంతో సెక్యూరిటీ గురించి ప‌ట్టించుకోరు. ఒక‌వేళ అనుకోకుండా ఫోన్ పోగొట్టుకుపోతే దొరికిన వ్య‌క్తికి నేర స్వ‌భావం ఉంటే ఖాతాల్లో సొమ్మును క్షణాల్లో మాయం చేసే అవ‌కాశం ఉంది.

కేవ‌లం డిజిట‌ల్ బ్యాంకింగ్‌నే ప్రోత్స‌హించ‌డం వల్ల నష్టాలు:

కేవ‌లం డిజిట‌ల్ బ్యాంకింగ్‌నే ప్రోత్స‌హించ‌డం వల్ల నష్టాలు:

* స్మార్ట్ ఫోన్ లేని వారు మొబైల్ బ్యాంకింగ్ లావా దేవీలను నిర్వహించ లేరు.

* మీ స్మార్ట్ ఫోన్‌లో వైరస్ ఉన్నట్లైతే మొబైల్ బ్యాంకింగ్ కన్నా, ఇంటర్నెట్ బ్యాంకింగే అత్యంత ఉత్తమం అని నమ్మేవాళ్లు చాలా మంది ఉన్నారు.

* మార్కెట్లో స్మార్ట్ ఫోన్‌లకు తక్కువ యాంటీ వైరస్ సాప్ట్ వేర్లు ఉంటాయి. మొబైల్ బ్యాంకింగ్ సుర‌క్షితంగా నిర్వహించాలంటే స్మార్ట్ ఫోన్‌లో యాంటీ వైరస్ తప్పనిసరి. అయితే ఉచిత సాఫ్ట్‌వేర్‌లు స‌రైన ర‌క్ష‌ణ క‌ల్పించ‌లేక‌పోతే ఇంట‌ర్నెట్‌ బ్యాంకింగ్‌కు భ‌రోసా ఉండ‌దు.

డిజిట‌ల్ బ్యాంకింగ్ సుర‌క్షిత లావాదేవీల కోసం

డిజిట‌ల్ బ్యాంకింగ్ సుర‌క్షిత లావాదేవీల కోసం

క‌చ్చితంగా మొబైల్ అల‌ర్ట్స్ వ‌చ్చే ఏర్పాటు చేసుకోవాలి. పీసీ లేదా ల్యాప్‌ట్యాప్‌ల్లో క్యాచి, (cache and cookie)కుకీల‌ను క్లియ‌ర్ చేస్తుండాలి. ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ హిస్ట‌రీని ఎప్ప‌టిక‌ప్పుడు చెరిపేయ‌డం మంచిది.

మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పొంద‌గ‌లిగే సేవ‌లు:

మొబైల్ బ్యాంకింగ్ ద్వారా పొంద‌గ‌లిగే సేవ‌లు:

1. ఖాతాలోని బ్యాలెన్స్ వివరాలు

2. గతంలో చేసిన మూడు లేదా ఐదు లావాదావీల వివరాలు

3. చెక్ బుక్

4. చెక్ పేమెంట్ నిలిపివేతకు ఆదేశాలిచ్చే వీలు

5. ఫిక్స్‌డ్ డిపాజిట్ వివరాలు

6. విద్యుత్, మొబైల్ ఫోన్, బేసిక్ ఫోన్ బిల్లుల చెల్లింపులు

English summary

డిజిట‌ల్ లావాదేవీలన్నీ సుర‌క్షిత‌మేనా? | Is digital banking safe in India and what are the online banking methods in the country

In India, net banking in pc, mobile banking on mobile can be done through mobile banking and mobile wallets, with more facilities offered to customers the chances of frauds tend to increase.In the internet era, mobile banking can be considered as boon as well as bane. However, many people still are not able to relay on mobile banking due to its exposure to risk. Here are few safety tips which you can consider
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X