For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఎస్‌బీఐ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వ‌ర్డ్ మ‌రిచిపోయారా?

|

ఇంత‌కుముందు ఒక బ్యాంకు అకౌంట్ ఉంటే స‌రిపోయేది. ప్ర‌స్తుతం ఉద్యోగులు చాలా మంది 2,3 బ్యాంకుల ఖాతాలు, ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్‌, మొబైల్ బ్యాంకింగ్ వాడుతున్నారు. దీంతో పాస్‌వ‌ర్డ్‌లు మ‌ర్చిపోవ‌డం ప‌రిపాటైపోయింది. ఎవ‌రైనా ఖాతాదారుడు వ‌రుస‌గా మూడుసార్లు ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వ‌ర్డ్‌ను త‌ప్పుగా న‌మోదు చేస్తే కొన్ని గంట‌ల పాటు ఆ నెట్ బ్యాంకింగ్ ఖాతాను లాక్ చేస్తారు. సాధార‌ణంగా 24 గంట‌ల పాటు అది ప‌నిచేయ‌దు.
దాన్ని రీసెట్ చేసుకునేందుకు మూడు ప‌ద్ద‌తులు ఉన్నాయి.
అ. ఏటీఎమ్ కార్డును ఉప‌యోగించి
ఆ. ప్రొఫైల్ పాస్‌వ‌ర్డ్‌ను ఉప‌యోగించి
ఇ. ఏటీఎమ్ కార్డు వివ‌రాల్లేకుండా, ప్రొఫైల్ పాస్‌వ‌ర్డ్‌ను ఉప‌యోగించి

sbi net banking

పాస్‌వ‌ర్డ్ రీసెట్ కోసం అనుస‌రించాల్సిన సోపానాలు:
1: www.onlinesbi.com లో లాగిన్ అవ్వండి
2. ఫ‌ర్‌గాట్ పాస్‌వ‌ర్డ్(forgot password)పై క్లిక్ చేయండి
3: త‌ర్వాత ఫ‌ర్‌గాట్ లాగిన్ పాస్‌వ‌ర్డ్‌పై క్లిక్ చేయండి
4. మీ యూజ‌ర్ నేమ్‌, ఖాతా సంఖ్య‌, దేశం, పుట్టిన తేదీ, న‌మోదిత మొబైల్ సంఖ్య‌, క్యాప్చా కోడ్ ఎంట‌ర్ చేయండి
5. స‌బ్‌మిట్‌పైన క్లిక్ చేయండి
అప్పుడు మీ నమోదిత మొబైల్ నంబ‌రుకు ఓటీపీ వ‌స్తుంది.
ఓటీపీని ఎంట‌ర్ చేయండి
6. క‌న్‌ఫ‌ర్మ్ బ‌ట‌న్‌పై క్లిక్ చేయండి
స‌రైన ఓటీపీని ఎంట‌ర్ చేస్తే మీకు పాస్‌వ‌ర్డ్‌ను రీసెట్ చేసుకునేందుకు మూడు ఆప్ష‌న్లు ప్ర‌త్య‌క్ష‌మ‌వుతాయి.

అ. ఏటీఎమ్ కార్డును ఉప‌యోగించి
ఆ. ప్రొఫైల్ పాస్‌వ‌ర్డ్‌ను ఉప‌యోగించి
ఇ. ఏటీఎమ్ కార్డు వివ‌రాల్లేకుండా, ప్రొఫైల్ పాస్‌వ‌ర్డ్‌ను ఉప‌యోగించి

ఎస్‌బీఐ లాగిన్ పాస్‌వ‌ర్డ్‌ను మార్చుకోండిలా...
ఎస్‌బీఐ నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ అవండి
ప్రొఫైల్ ట్యాబ్‌కు వెళ్లండి
చేంజ్ పాస్‌వ‌ర్డ్‌పైన క్లిక్ చేయండి
ప్రొఫైల్ పాస్‌వ‌ర్డ్‌ను ఎంట‌ర్ చేయండి
ప్రొఫైల్ పాస్‌వ‌ర్డ్‌, లాగిన్ పాస్‌వ‌ర్డ్ ఒకలాగే ఉండ‌కూడ‌ద‌ని గుర్తుంచుకోండి
పాత పాస్‌వ‌ర్డ్‌ను ఎంట‌ర్ చేయండి
కొత్త పాస్‌వ‌ర్డ్‌ను సెట్ చేసుకోండి
రెండోసారి అదే పాస్‌వ‌ర్డ్‌ను టైప్ చేయాలి
స‌బ్‌మిట్ పైన క్లిక్ చేయండి.

గ‌మ‌నిక‌: నెట్ బ్యాంకింగ్ పాస్‌వ‌ర్డ్‌ను అప్పుడ‌ప్పుడు మార్చుకోవ‌డం మంచిది. దీని వ‌ల్ల మీరు హ్యాకింగ్ బారిన ప‌డ‌రు. మీ పాస్‌వ‌ర్డ్‌ను మ‌రీ సులువుగా కాకుండా ప్ర‌త్యేకంగా, క‌ష్టంగా ఉండేలా చూసుకోండి.

English summary

ఎస్‌బీఐ ఇంట‌ర్నెట్ బ్యాంకింగ్ పాస్‌వ‌ర్డ్ మ‌రిచిపోయారా? | How to reset sbi internet banking password

Individuals having multiple bank accounts often get confused or forget net banking Personal Identification Number (IPIN).Read more at: http://www.goodreturns.in/classroom/2016/10/how-reset-change-sbi-internet-banking-password-online-499556.html
Story first published: Friday, October 7, 2016, 15:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X