జరగరాని ప్రమాదం జరిగితే ఆర్థికంగా రక్షిస్తుందని బీమా పాలసీ తీసుకుంటాం. అలానే చాలా ప్రమాద సమయాల్లో పాలసీ అండగా నిలవడం మనం చూస్తుంటాం. సాధారణంగా ఎవరైనా జీవిత బీమా తీసుకునే ముందు నిపుణుల అభిప్రాయం తీసుకుంటే సమస్యలు ఉండవు. ఐఆర్‌డీఏ వద్ద నమోదు కాని ఏజెంట్లు, ఆర్థిక అవగాహన లేని వ్యక్తుల మాటలు విని బీమా నిర్ణయం తీసుకుంటే భవిష్యత్తులో కష్టమే. ప్రస్తుతం చాలా మంది వెబ్‌సైట్లలో వెతికి, బంధు మిత్రుల సలహాలను, సూచనలను పాటిస్తూ పాలసీలను కొంటున్నారు. అయితే ఇది ఎలా ఉన్నప్పటికీ పాలసీకి సంబంధించిన నియమ నిబంధనలు క్షుణ్ణంగా చదివి పాలసీని కొనుగోలు చేయడమే ఉత్తమం. ఈ నేపథ్యంలో పాలసీదారుకు అవసరమైన విధులు, హక్కుల గురించి బీమా నియంత్రణ, అభివృద్ది ప్రాధికార సంస్థ పాలసీదారులకు తెలియాల్సిన పలు విషయాలను వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. వాటి గురించి తెలుసుకుందాం.

పాలసీదారుడి విధులు
* పాలసీ పత్రాన్ని మొత్తం చదవి పాలసీదారే స్వహస్తాలతో వివరాలను నింపాలి.
* ఏ కాలమ్‌ను పూర్తిచేయకుండా వదిలేయరాదు. ఖాళీ పాలసీ పత్రంపై సంతకం చేసి ఏజెంటుకు ఇవ్వకూడదు.
* పాలసీ పత్రంపై సంతకం చేసిన తర్వాత అందులో వివరాలన్నీ నిజం అని ధ్రువీకరించినట్లు లెక్క.
* అవసరాలకు తగిన పాలసీని ఎంచుకోవాలి.
* ప్రీమియంను మన వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా ఎంచుకుంటే మంచిది.
* ప్రీమియాన్ని ఏకమొత్తంలో ఒకేసారి చెల్లించాలా లేదా పలు వాయిదాల్లో చెల్లించాలా అనే విషయాన్ని మొదటే నిర్ణయించుకోవాలి.
* ఈసీఎస్(ఎలక్ట్రానిక్ క్లియరింగ్ సర్వీస్) పద్ధతిలో ప్రీమియం చెల్లించడం ద్వారా సమయం ఆదా అవుతుంది. ఇది భద్రతతో పాటు రికార్డులను భద్రపరుచుకునే వీలును కల్పిస్తుంది.
* పాలసీ కొనేటప్పుడు కచ్చితంగా నామినీ పేరును నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. నామినీ పేరులో ఎలాంటి తప్పులు లేకుండా చూసుకోవాలి.

పాలసీ కొన్న తర్వాత
*పాలసీ పత్రాన్ని బీమా కంపెనీకి సమర్పించిన తర్వాత 15 రోజుల్లోగా బీమా సంస్థ 15 రోజుల్లోగా పాలసీదారుని సంప్రదిస్తుంది.
*అలా జరక్కపోతే, పాలసీదారుడు కంపెనీ ప్రతినిధుల వద్ద విచారించాల్సి ఉంటుంది.
*పాలసీ తీసుకునేందుకు అవసరమైన ఎటువంటి అదనపు పత్రాలనైనా వెనువెంటనే ఇవ్వాలి.
*పాలసీ ప్రతిపాదనను బీమా కంపెనీ ఆమోదించిన క్రమంలో గడువులోపు మీరు పాలసీ బాండును అందుకోవాలి.
*పాలసీ బాండును అందుకున్న తర్వాత మీరు భావించిన పాలసీ బాండునే అందుకున్నారో లేదో చూసుకోవాలి.
*పాలసీ షరతులన్నింటినీ చదివి, పాలసీ మధ్యవర్తి లేదా బీమా కంపెనీ అధికారి మీకు మొదట చెప్పినట్లే పాలసీ ఉందా లేదా అనే అంశాన్ని సరిచూసుకోవాలి.
*బీమా మధ్యవర్తిని లేదా కంపెనీ ప్రతినిధులను సంప్రదించి అనుమానాలను తీర్చుకోవాలి.
*అవసరమైతే నేరుగా బీమా కంపెనీ కార్యాలయానికి వెళ్లాలి.

పాలసీ నిర్వహణ సమయంలో
పాలసీ ప్రీమియంను గడువుతేదీ లేదా గ్రేస్ పీరియడ్ లోపు కట్టేయాలి.
ప్రీమియంను చెల్లించేందుకు మీకు వీలైన మార్గాన్ని ఎంచుకుని సకాలంలో చెల్లించే ప్రయత్నం చేయాలి.
చిరునామాలో మార్పు ఉంటే, బీమా కంపెనీకి తెలియపరచాలి.

నామినేషన్
పాలసీ తీసుకునేటప్పుడు నామినీని నియమించడం తప్పనిసరి.
పాలసీ తీసుకున్న తర్వాత అవసరాన్ని బట్టి నామినీని మార్చుకునే వీలుంది.
మైనర్లను నామినీగా నియమించుకోవాల్సిన అవసరం వస్తే అపాయింటీని కూడా సూచించాలి.
ఒప్పంద పత్రంపై అపాయింటితో సంతకం చేయించవలసి ఉంటుంది.

పాలసీ బాండును పోగొట్టుకుంటే
పాలసీ బాండును పోగొట్టుకున్నట్లు గుర్తించిన సమయంలో సాధ్యమైనంత తొందరగా బీమా కంపెనీకి సమచారాన్నివ్వాలి.
విధివిధానాలను పాటించి డూప్లికేట్ పాలసీని తీసుకునేందుకు చూడాలి.
డూప్లికేట్ పాలసీబాండు అయినా ఒరిజినల్ బాండు ద్వారా పొందే ప్రయోజనాలను పొందవచ్చు.
More From GoodReturns

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..



Click it and Unblock the Notifications