For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పొదుపు అంటే ఏమిటి: సాధనాలివే (ఫోటోలు)

By Nageswara Rao
|

పొదుపు, పెట్టుబడి, మదుపు.... పేరు ఏదైనా సరే భవిష్యత్తుకు భరోసానిచ్చేది ఇదే. డబ్బు సంపాదన మొదలుపెట్టగానే ప్రతిఒక్కరి మదిలో మెదిలే ఆలోచన. సందపను ఎలా వృద్ధి చేయాలి. ఎక్కడ మదుపు లేదా పెట్టుబడి చేస్తే

సంపద వృద్ధి అవుతుంది. ఇలా ఆర్ధిక ఆలోచన ప్రతి ఒక్కరూ రేపటి గురించి చేసే ఆలోచన.

అసలు మన దేశంలో పొదుపు చేయడానికి ప్రభుత్వం పరంగా ఎన్ని మార్గాలున్నాయి. ఎవరెవరికి ఎలాంటి పొదుపు సాధానాలు సరిపోతాయి అనేది ఒక్కసారి చూద్దాం.

 బ్యాంక్‌ సేవింగ్స్ ఖాతా

బ్యాంక్‌ సేవింగ్స్ ఖాతా

పొదుపు అనగానే సామాన్య ప్రజలకు గుర్తుకు వచ్చే మొట్టమొదటి తొలి సాధనం ఇది. చిన్న మొత్తాల్లోని మిగులు దాచేందుకు అత్యుత్తమ మార్గం. తక్కువ వడ్డీ రేట్లు లభించడంతో పాటు రిస్క్ తక్కువ. అయితే ఎప్పుడు కావాలంటే అప్పుడు పొదుపు చేసిన మొత్తాన్ని తీసుకునే వెసులుబాటు ఉంటుంది. నిర్వహణ కూడా చాలా సులభం. ఎటిఎం కార్డుంటే ఎక్కడైన మన సొమ్మును వితడ్రా చేసుకోవచ్చు.

 లిక్విడ్‌ ఫండ్స్‌

లిక్విడ్‌ ఫండ్స్‌

సేవింగ్స్‌ అకౌంట్‌ కన్నా ఎక్కువ రిటర్న్‌లను ఇస్తాయి. బ్యాంక్‌ ఫిక్స్‌డ్‌ డిపాజిట్ల కన్నా తక్కువ వడ్డీ వస్తుంది. స్వల్పకాలిక ఫిక్స్‌డ్‌ ఆదాయ సాధనాల్లో ఈ ఫండ్స్‌ పెట్టుబడి పెడతాయి. రిటర్న్‌ల కన్నా పెట్టుబడిదారు పెట్టుబడి కాపాడేందుకు అధిక ప్రాధాన్యమిస్తాయి.

 బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్లు

బ్యాంక్ ఫిక్సిడ్ డిపాజిట్లు

ఆరు నుంచి పన్నెండు నెలల కాలానికి పెట్టుబడి పెట్టాలి. అంతేకాదు రిస్క్‌ తక్కువగా ఉండాలని భావించే వారికి అత్యుత్తమ సాధనం. వీటిని టర్మ్‌ డిపాజిట్లని కూడా అంటారు. అయితే ముందుగా విత్‌డ్రా చేయాలనుకుంటే జరిమానాలు పడతాయి. కాబట్టి పెట్టుబడి మొత్తాన్ని ఇప్పట్లో కదిల్చే పనిలేదనుకున్నప్పుడే వీటిని ఎంచుకోవాలి.

 పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ స్కీమ్‌

పోస్టాఫీస్‌ సేవింగ్స్‌ స్కీమ్‌

రిస్క్‌ ఉండదు. టిడిఎస్‌ కూడా ఉండదు. ఎఫ్‌డిలకన్నా ఎక్కువ రాబడులు వస్తాయి. అందుకే పోస్టాఫీసులు మధ్యతరగతి మదుపును ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ఎన్ఎస్‌సి, ఎన్‌ఎస్ఎస్‌, కెవిపి, నెలవారీ ఆదాయ పథకం, ఆర్‌డి స్కీమ్‌ పేరిట పోస్టాఫీసులు పలు పథకాలను నిర్వహిస్తున్నాయి.

 పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పిపిఎఫ్‌)

పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పిపిఎఫ్‌)

అధికంగా పన్ను చెల్లించేవారికి సరిపోయే సాధనం. 11 శాతం పోస్ట్‌ టాక్స్‌ రిటర్న్‌, 15.7 శాతం ప్రీ టాక్స్‌ రేట్‌, టాక్స్‌ రిబేట్‌ ఇందులో ఆకర్షణీయ అంశాలు. రిస్క్‌ తక్కువ. అయితే లిక్విడిటీ సమస్య ఉంటుంది. తొలి ఏడాది పెట్టిన పెట్టుబడి తీసుకోవాలంటే కనీసం 7 సంవత్సరాలు వేచిచూడాలి. కావాలనుకుంటే పెట్టుబడిపై రుణం తీసుకోవచ్చు.

English summary

పొదుపు అంటే ఏమిటి: సాధనాలివే (ఫోటోలు) | What is Investment?

An asset or item that is purchased with the hope that it will generate income or appreciate in the future. In an economic sense, an investment is the purchase of goods that are not consumed today but are used in the future to create wealth.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X