For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఏటీఎం నుంచి నగదు: డెబిట్ కార్డులా స్మార్ట్‌ఫోన్

By Nageswara Rao
|

21వ శతాబ్దంలో మానవుని కనిపెట్టిన సాధనాల్లో ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్న వస్తువు మొబైల్. మొబైల్‌ను పలు రకాలుగా వినియోగిస్తున్నారు. తాజాగా స్మార్ట్‌ఫోన్‌తో మరో ఉపయోగం ఉన్నట్లు తెలిసింది. స్మార్ట్‌ఫోన్‌ని బ్యాంక్ డెబిట్ కార్డులా ఉపయోగించేలా రూపొందించనున్నారు.

డెబిట్ కార్డు లేకుండా స్మార్ట్‌ఫోన్‌ పరిజ్ఞానంతో పనిచేసే ఏటీయం మెషిన్లను ఏర్పాటు చేసే విషయంలో అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్ ఉపయోగించి లావాదేవీల్ని వేగంగా, మరింత సురక్షితంగా చేయవచ్చని చెబుతున్నారు.

ఇప్పటికే అమెరికాలోని పలు బ్యాంకులు ఈ తరహా ఏటీఎంలను ఏర్పాటు చేయడంపై దృష్టిని సారించాయి. అమెరికా ప్రఖ్యాత బ్యాంకింగ్ దిగ్గజాలైన వెల్స్‌ఫార్గో, బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా, ఛేజ్‌ ఈ తరహా కొత్త ఏటీఎంలను ఏర్పాటు చేయనున్నాయి.

 స్మార్ట్‌ఫోన్ డెబిట్ కార్డులా ఎలా పనిచేస్తుంది?

స్మార్ట్‌ఫోన్ డెబిట్ కార్డులా ఎలా పనిచేస్తుంది?

మొబైల్‌ యాప్‌ ద్వారా నగదు కోసం ఆదేశాలు జారీ చేసేందుకు వీలయ్యేలా, సంకేతాన్ని అందించడం ద్వారా డెబిట్‌ కార్డు ద్వారా నగదు పొందగలిగేలా ప్రస్తుతం ఉన్న ఏటీఎం మెషిన్లలో మార్పులు చేపడుతున్నారు. స్మార్ట్‌ఫోన్‌కు వచ్చే పాస్‌వర్డ్‌ను ఏటీఎం మెషిన్‌లో నమోదు చేయడం ద్వారా డబ్బులు తీసుకోవచ్చు. అంతేకాదు స్మార్ట్‌ఫోన్‌ను ఏటీఎం యంత్రానికి తాకించడం ద్వారా డబ్బులు పొందవచ్చని చెబుతున్నారు.

 స్మార్ట్‌ఫోన్ డెబిట్ కార్డులా ఎలా పనిచేస్తుంది?

స్మార్ట్‌ఫోన్ డెబిట్ కార్డులా ఎలా పనిచేస్తుంది?

ఏటీఎంల వాడకంలో స్మార్ట్‌ఫోన్లను ఉపయోగించే నమూనాలతో చాలావరకు పొరపాట్లు, మోసాలు తగ్గుతాయని భావిస్తున్నట్లు ఏటీఎంలకు సాఫ్ట్‌వేర్‌, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందజేసే ఎఫ్‌ఐఎస్‌ గ్లోబల్‌ సంస్థకు చెందిన డగ్‌ బ్రౌన్‌ పేర్కొన్నారు. ఎఫ్‌ఐఎస్‌ కార్డురహిత వ్యవస్థను అమెరికాలో కనీసం 28 బ్యాంకులు నిర్వహించే 2వేల ఏటీఎంలలో ఉపయోగిస్తున్నట్లు తెలిపారు.

 స్మార్ట్‌ఫోన్ డెబిట్ కార్డులా ఎలా పనిచేస్తుంది?

స్మార్ట్‌ఫోన్ డెబిట్ కార్డులా ఎలా పనిచేస్తుంది?

స్మార్ట్‌ఫోన్‌ సాంకేతిక ద్వారా లావాదేవీల్లో వేగం పెంచడంతోపాటు, నేరగాళ్లు ఏటీఎం కార్డు స్లాట్‌లోకి హ్యాకింగ్ చేయడం ద్వారా కార్డుపై సమాచారాన్ని దొంగిలించే స్కిమ్మింగ్‌ సమస్యను అరికట్టొచ్చు. ఏటీఎం కేంద్రంలో గడిపే 30 నుంచి 40 సెకన్ల సమయాన్ని ఈ ప్రక్రియ 10 సెకన్లకు తగ్గిస్తుందన్నారు. పలుప్రాంతాల్లో ఎన్‌ఎఫ్‌సీ అనే పరిజ్ఞానంతో కూడిన ఏటీఎంలు ప్రవేశపెట్టాలని యోచిస్తున్నట్లు బ్యాంక్‌ ఆఫ్‌ అమెరికా అధికార ప్రతినిధి బెట్టీ రీస్‌ పేర్కొన్నారు.

 స్మార్ట్‌ఫోన్ డెబిట్ కార్డులా ఎలా పనిచేస్తుంది?

స్మార్ట్‌ఫోన్ డెబిట్ కార్డులా ఎలా పనిచేస్తుంది?

ఏటీఎంలను తయారుచేసే డైబోల్డ్‌ అనే సంస్థ తలలేని నగదు మెషిన్‌ను రూపొందించే పనిలో ఉంది. ఇందులో తెర, కీబోర్డు ఉండవు, స్మార్ట్‌ఫోన్‌తో జరిపే అనుసంధానతతోనే నగదు పొందొచ్చు. ఈ తరహా పరిజ్ఞానాల్లో వినియోగదారులు తమ వ్యక్తిగత గుర్తింపును తనిఖీ చేసుకోవాల్సి ఉంటుంది. కనుపాప స్కానింగ్‌గానీ, వేలిముద్ర పరీక్షగానీ చేస్తే సరిపోతుంది.

English summary

ఏటీఎం నుంచి నగదు: డెబిట్ కార్డులా స్మార్ట్‌ఫోన్ | Now, use your smartphone to withdraw money from ATM

The "cardless" automatic teller machine (ATM) is gaining ground in the US and around the world, with smartphone technology allowing for speedier and more secure transactions.
Story first published: Wednesday, February 24, 2016, 12:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X