For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

భవిష్యత్తు కోసం పొదుపు మంచిదేగా..!

By Nageswara Rao
|

దేశంలో సాప్ట్‌వేర్ ఉద్యోగాలు వచ్చిన తర్వాత కాలగమనంలో పరిస్థితులు వేగంగా మారిపోతున్నాయి. లక్షల్లో జీతం ఆర్జిస్తున్న వారు సైతం పెరిగిపోతున్న ఖర్చులను తట్టుకోలేక చేతులు ఎత్తేస్తున్నారు. ఈ క్రమంలో నెల చివరి రోజులను భారంగా గడుపుతున్నారు. క్రెడిట్ కార్డులను సైతం జాగ్రత్తగా వాడుతున్నారు.

ఇలా మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఆకస్మికంగా ఖర్చులు వస్తుంటాయి. ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు వీలుగా ఆర్థిక వనరులను సిద్ధం చేసుకోవాలి. సాధ్యమైనంత వరకూ కష్టార్జితాన్ని పొదుపు, మదుపులకు మళ్లించాలి. ప్రస్తుతం మనం చేస్తున్న ఖర్చులను తగ్గించుకొని ఆ మొత్తాన్నే మన భవిష్యత్తు అవసరాలకు పెట్టుబడిగా మార్చుకోవడం చాలా ముఖ్యం.

పొదుపు చేయాలనే లక్ష్యం స్థిరంగా ఉండాలి

పొదుపు చేయాలనే లక్ష్యం స్థిరంగా ఉండాలి

ఉద్యోగం, వ్యాపారం, ఏదైనా సరే డబ్బు సంపాదించడమే ప్రతి ఒక్కరి లక్ష్యం. మరి అలా సంపాదించిన డబ్బును ఏదో ఒక దాంట్లో మదుపు చేయాలి. ఓ ఆర్థిక లక్ష్యం లేకుండా డబ్బు దాయడం వల్ల ప్రయోజనం లేదు. పిల్లల చదువులు, కారు, సొంతిల్లు ఇలా ఏదైనా సరే... ఒక నిర్దిష్ట లక్ష్యం నిర్ణయించుకొని, దాన్ని ఎన్నాళ్లలో సాధించాలి? ఎంత మదుపు చేయాలి? అని నిర్ణయించుకోవాలి. అప్పుడే మీ ఆర్థిక వృద్ధి సాధ్యం అవుతుంది.

ఖర్చులు పోను మిగిలిందే పొదుపు అనుకుంటే పొరపాటు

ఖర్చులు పోను మిగిలిందే పొదుపు అనుకుంటే పొరపాటు

మనలో చాలా మంది సంపాదించిన మొత్తంలో ఖర్చులు పోను మిగిలిందే పొదుపు అని అనుకుంటుంటారు. కానీ ఇది తప్పు. పొదుపు చేసిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఎలా ఖర్చు చేయాలో చూసుకోండి. నెల చివర్లో కాకుండా నెల మొదట్లోనే.. పొదుపు మొత్తాన్ని చూసుకోవడం ద్వారా ఆర్థిక క్రమశిక్షణ అలవడుతుంది. మనం సంపాదించే ఆదాయంలో కనీసం 20-30 శాతమైనా పొదుపు చేయాలన్నది ఆర్థిక నిపుణుల సూచన.

అనుకోని ఖర్చులు ఎదురైతే వాటిని తట్టుకోవాలి

అనుకోని ఖర్చులు ఎదురైతే వాటిని తట్టుకోవాలి

ఒకేసారి లక్షల్లో పొదుపు చేయడం అనేది ఎవరికీ సాధ్యం కాదు. భవిష్యత్తులో మనకు అనుకోని ఖర్చులు ఎదురైతే వాటిని తట్టుకోవాలనుకుంటే మనం ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిందేమిటంటే ఆదాయానికి తగ్గట్టే ఖర్చూ ఉండాలి, పొదుపూ చేయాలి.

ఖర్చులు అదుపులో ఉండాలి

ఖర్చులు అదుపులో ఉండాలి

డబ్బు అవసరం వచ్చినప్పుడు ఎవరినీ చేయి చాచకుండా అప్పులు చేయకుండా ఉండేలా మన పద్ధతులు మార్చుకోవాలి. ఒక రూపాయిని మిగిలిస్తే, ఒక రూపాయిని మీరు సంపాదించనట్లే. ఒక్క మాటలో చెప్పాలంటే ఖర్చులను బట్టి మన సంపాదన పెరగదు. అదే ఖర్చులను తగ్గించుకుంటే మాత్రం మీరు పొదుపు చేసినట్లే. మీ జేబునుంచి వెళ్లే ప్రతి రూపాయికీ లెక్క చూసుకోవాలి.

English summary

భవిష్యత్తు కోసం పొదుపు మంచిదేగా..! | Reasons Why You Should Save Money

Reasons Why You Should Save Money.
Story first published: Monday, November 2, 2015, 11:44 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X