For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీరు చేసిన అప్పు మంచిదా, చెడ్డదా?

By Nageswara Rao
|

ప్రస్తుత రోజుల్లో యువత తమ కోరికలను తీర్చుకునేందుకు అప్పు చేయడానికి సైతం వెనకాడటం లేదు. అందుకు కారణం నెలసి సులభ వాయిదాల్లో తీర్చే వెసులుబాటు ఉంది కాబట్టి. దీనివల్ల కొన్ని ప్రయోజనాలున్నా, శక్తికి మించిన అప్పులు చేసి, ఆర్ధికంగా ఇబ్బందులు పడుతున్నా వారు కూడా ఉన్నారు.

మీరు సంపాదిస్తున్న మొత్తంలో ఇలా ఈఎంఐల రూపంలో చెల్లిస్తుంటే అది మీ ఆర్ధిక స్థితిని ఇబ్బందుల్లో పడేసే ప్రమాదం ఉంది. అందుకే అప్పుల విషయంలోనూ, ఈఎంఐల విషయంలోనూ కాస్తంత జాగ్రత్తగా వ్యవహరించాలి.

ప్రతి విషయంలోనూ మంచి, చెడులు ఉన్నట్లే అప్పుల్లోనూ కొన్ని మంచి అప్పులు, కొన్ని చెడ్డ అప్పులు ఉంటాయి. సంపాదిస్తున్న మొత్తం బాకీలకే చెల్లిస్తుంటే, ఇక భవిష్యత్తు ఆర్ధిక భద్రత ఎలా? అన్నది మర్చిపోకూడదు.

 మీరు చేసిన అప్పు మంచిదా, చెడ్డదా?

మీరు చేసిన అప్పు మంచిదా, చెడ్డదా?

ఒక అప్పు తీసుకొని ఏదైనా పని చేసినా, ఒక వస్తువును కొన్నా దాని ద్వారా ఎంతో కొంత ప్రయోజనం ఉండాలి. దానినే మంచి అప్పు అంటారు. ఇక రోజురోజుకూ విలువ తగ్గే వాటికోసం చేసే అప్పులు చెడ్డ అప్పులుగా పేర్కొనొచ్చు. మంచి అప్పులకు చెల్లించే వాయిదాల వల్ల భవిష్యత్తులో మనకు ప్రయోజనం ఉంటుంది. అదే చెడ్డ అప్పుల కోసం చెల్లించే ఈఎంఐల వల్ల ఆర్ధికంగా భారం తప్ప ప్రయోజనం ఉండదు.

మీరు చేసిన అప్పు మంచిదా, చెడ్డదా?

మీరు చేసిన అప్పు మంచిదా, చెడ్డదా?

ఉదాహరణకు వ్యాపారాన్ని ప్రారంభించిడం లేదా విస్తరంచడం కోసం చేసే అప్పు మంచి అప్పు కిందకు వస్తుంది. తద్వారా భవిష్యత్తులో ఆదాయం పెరిగేందుకు అవకాశం ఉంది. మంచి ఇల్లు కొనుగోలు చేయడం కూడా మంచి అప్పు కిందకే వస్తుంది. అయితే స్తోమతకు మంచి పెద్ద ఇల్లు కొనుగోలు చేయడం, దానికోసం పెద్ద మొత్తంలో అప్పు చేయడం అనేది చెడ్డ అప్పు కిందకు వస్తుంది.

 మీరు చేసిన అప్పు మంచిదా, చెడ్డదా?

మీరు చేసిన అప్పు మంచిదా, చెడ్డదా?

అప్పు తీసుకునే ముందు వాస్తవంగా మనం ఎంత మేరకు దాన్ని భరించగలం అనే విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి. అప్పు తీసుకోవడం, ఈఎంఐని చెల్లించడం రెండు ఒకటి కాదు. ప్రస్తుతం మీరు ఆర్జిస్తున్న మొత్తాన్ని బట్టి, మీకు రూ. 20 లక్షల రుణం రావడం పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ నెలకు రూ. 20 వేల వరకూ ఈఎంఐ చెల్లించాల్సి రావడం కష్టంగా మారొచ్చు. భవిష్యత్తులో మీకు అనేక రకాల ఖర్చులు వస్తుంటాయి.

మీరు చేసిన అప్పు మంచిదా, చెడ్డదా?

మీరు చేసిన అప్పు మంచిదా, చెడ్డదా?

దీర్ఘకాలానికి రుణం తీసుకునేముందు ఒకటి రెండేళ్లను కాకుండా, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రుణం తీసుకోవాలి. నెలసరి ఈఎంఐ ఎంత చెల్లిస్తున్నామనేది కూడా ఎంతో ముఖ్యం. ఈరోజు మీరు తీసుకున్న అప్పు, ఐదు సంవత్సరాల తర్వాత చెల్లించలేని పరిస్ధితి రావడంతో చెడ్డ అప్పుగా అనిపించవచ్చు.

మీరు చేసిన అప్పు మంచిదా, చెడ్డదా?

మీరు చేసిన అప్పు మంచిదా, చెడ్డదా?

చాలా మంది ఎక్కువ వ్వవధి పెంచుకుని ఈఎంఐలు చెల్లిస్తుంటారు. ఇది చాలా పెద్ద పొరపాటు. వ్వవధి పెరిగే కొద్ది వాయిదా మొత్తం తగ్గుతుంది కానీ వడ్డీ మాత్రం ఎక్కువ మొత్తంలో కట్టాల్సి వస్తుందనే విషయాన్ని మాత్రం మర్చిపోకూడదు.

English summary

మీరు చేసిన అప్పు మంచిదా, చెడ్డదా? | Purchases made on EMI – Good or bad?

When its festival time and you notice almost every other shop offering discounts and offers, you are tempted to go on a shopping spree and buy even things you may not need. But what happens to your liquidity at such times and how do you settle your credit card bills after the shopping?
Story first published: Tuesday, August 25, 2015, 12:45 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X