For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా?

By Nageswara Rao
|

మనలో చాలా మందికి మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టాలని ఉంటుంది. కానీ వారికి అకౌంట్ లేకపోవడం వల్ల ఇది సాధ్యపడదు. ఆన్‌లైన్‌లో మ్యూచువల్ ఫండ్ కోసం అకౌంట్ ఓపెన్ చేయడం ఎలాగో తెలుసుకుందాం?

ఫండ్స్ ఇండియాలో భాగస్వామ్యమైన ఏదైనా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ (ఎఎంసీ)తో ఎవరైనా మ్యూచువల్ ఫండ్ అకౌంట్‌ను తెరవొచ్చు. మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎలాగో ఇప్పుడు చూద్దాం.

1. ముందుగా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలైన HDFCfund లేదా ICICIprufund లేదా SBIMF వెబ్‌సైట్స్‌ని సందర్శించండి.

How To Open Mutual Fund Account Online?

2. ఆన్‌లైన్‌లో పెట్టుబడి ఆప్షన్‌ను ఎంచుకోండి.

3. అప్లికేషన్ ఫామ్‌ను డౌన్ లోడ్ చేసుకోండి.

4. ఫామ్‌లో ఉన్న పూర్తి సమాచారాన్ని నింపండి.

5. KYC ఫామ్‌తో పాటు KYCకి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్‌ని జతపర్చండి.

6. వీటితో పాటు అడ్రస్ ధృవీకరణ పత్రం, ఐడీ ధృవీకరణ పత్రం, రెండు పాస్ పోర్ట్ సైజు ఫోటోలు జత పర్చండి.

7. చెక్ లేదా డీడీ కాపీని జతపర్చండి.

అసెట్ మేనేజ్మెంట్ కంపెనీకి సంబంధించిన వెబ్‌సైట్లో పేర్కొన్న అడ్రస్‌కి పైన పేర్కొన్న డాక్యుమెంట్స్ అన్నింటిని పంపండి. మీరు పంపిన డాక్యుమెంట్స్‌ని పరిశీలించిన తర్వాత కంపెనీ తిరిగి మీకొక పిన్ నెంబర్‌ను పంపిస్తుంది. దీని సాయంతో మీరే సొంతంగా మీ లావాదేవీలను నిర్వహించుకోవచ్చు.

మ్యూచువల్ ఫండ్ అంటే ఏమిటి?

మ్యూచువల్ ఫండ్, పెట్టుబడిదారుల నుంచి సేకరించిన మరియు ప్రకటించిన పెట్టుబడి లక్ష్యాలతో పెట్టుబడి పెట్టిన ధన నిధి. ఒక రకంగా చెప్పాలంటే మ్యూచువల్ ఫండ్స్ అంటే ఇన్వెస్టర్ల దగ్గర నుండి రకరకాల స్కీముల ద్వారా డబ్బు సేకరించి, వాటిని వారి తరఫున రకరకాల పెట్టుబడి సాధనాలలో పెట్టుబడి పెట్టడం. ఏ స్కీము ల్లో పెట్టుబడి పెట్టాలనేది ఆ ఇన్వెస్టర్ల అభీష్టం మీద ఆధారపడి వుంటుంది.

మ్యూచువల్ పంఢ్స్ వల్ల లాభాలు:

తక్కువ పెట్టుబడి: ఒక కంపెనీ షేర్లను కొనాలంటే మీరు రూ.25,000 పెట్టుబడి పెట్టాలి. కాని మీ దగ్గర కేవలం రూ. 1000 మాత్రమే వున్నాయి. అయినా ఆ కంపెనీ షేర్లలో సైతం మీరు పరోక్షంగా భాగస్వామి కావచ్చు. మ్యూచువల్‌ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా మనం అతి తక్కువ పెట్టుబడితో ప్రారంభించవచ్చు.

English summary

మ్యూచువల్ ఫండ్ అకౌంట్ ఓపెన్ చేయడం ఎలా? | How To Open Mutual Fund Account Online?

Are you a busy individual who is interested in investing in a mutual fund but lacks the time to open an account? Here is an online way through which you can open the account and invest in mutual fund online.
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X