For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సురక్షిత పెట్టుబడులకు ఏది అత్యుత్తమం?

By Nageswara Rao
|

తక్కువ కాలంలో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించాలంటే షేర్లలో మదుపు చేయడమే మంచిదని చాలా మంది మదుపరుల నమ్మకం. అందుకే వీటిల్లో పెట్టుబడులు పెట్టేందుకు చాలా మంది ఆసక్తి చూపిస్తారు. అయితే ఇందుకు ధైర్యం ఉండాలనేది మరికొంత మంది వాదన.

నిజమే, షేర్ మార్కెట్‌లో నష్ట భయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలాంటి వారు స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులకు దూరంగా ఉండాల్సిందేనా? అంటే అలాంటి అవసరం లేదంటున్నారు మార్కెట్ నిపుణులు. అలాంటి వారి కోసం డెట్ ఫండ్లు అందుబాటులో ఉన్నాయి.

డెట్ పండ్లలో అనేక రకాలున్నాయి. వీటిలో మంత్లీ ఇన్ కం ప్లాన్లు, లాంగ్ టర్మ్ డెట్ ఫండ్లు, గిల్ట్ ఫండ్లు, మధ్యస్ధ, దీర్ఘకాలిక ఫండ్లు, స్వల్పకాలిక ఫండ్లు, లిక్విడ్ ఫండ్లు ఇలా అనేక రకాలున్నాయి. మీరు పెట్టే పెట్టుబడి ఆధారంగా వేటిని ఎంచుకోవాలన్నది మీరే నిర్ణయించుకోవాలి.

 సురక్షిత పెట్టుబడులకు ఏది అత్యుత్తమం?

సురక్షిత పెట్టుబడులకు ఏది అత్యుత్తమం?

డెట్ ఫండ్లు ఖచ్చితంగా మంచి రాబడిని ఇస్తాయా అంటే చెప్పలేం. అయితే మీరు పెట్టే ఎంచుకునే పథకం దీర్ఘకాలిక పథకం అయితే రెండంకెల రాబడిని ఇస్తుందని చెప్పవచ్చు. ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తే, ఆర్‌బీఐ వడ్డీ రేట్లను సవరిస్తే.. దీర్ఘకాలిక డెట్ ఫండ్లు ఖచ్చితంగా రాబడినిస్తాయి.

 సురక్షిత పెట్టుబడులకు ఏది అత్యుత్తమం?

సురక్షిత పెట్టుబడులకు ఏది అత్యుత్తమం?

ఆదాయపు పన్ను విషయంలో డెట్ ఫండ్లు కొంత మేరకు ప్రయోజనాన్ని ఇస్తాయి. పిక్స్‌డ్ డిపాజిట్ల మీద వచ్చే వడ్డీకి వర్తించే ఆధారంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. గరిష్టంగా మీకు లభించే వడ్డీకి 30 శాతం ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

సురక్షిత పెట్టుబడులకు ఏది అత్యుత్తమం?

సురక్షిత పెట్టుబడులకు ఏది అత్యుత్తమం?

సాధారణంగా సురక్షిత పథకాల్లో మదుపు చేసేటప్పుడు వెంటనే నగదు మార్చుకోవాడానికి కొంత ఇబ్బందిగా ఉంటుంది. అయితే డెట్ ఫండ్లలో అలాంటి ఇబ్బంది ఉండదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు సులభంగా నగదు మార్చుకోవచ్చు.

సురక్షిత పెట్టుబడులకు ఏది అత్యుత్తమం?

సురక్షిత పెట్టుబడులకు ఏది అత్యుత్తమం?

పదవీ విరమణ ప్రణాళికలు, ఇంటి కొనుగోలు, పిల్లల ఉన్నత చదువులకు ఇలా దీర్ఘకాలిక లక్ష్యాలున్న వ్యక్తులకు డెట్ ఫండ్లలలో మదుపు చేయడం ఎంతో ప్రయోజనకరం.

English summary

సురక్షిత పెట్టుబడులకు ఏది అత్యుత్తమం? | Debt fund investments better than fixed deposits

In the current scenario, most risk-averse investors would opt for FDs. The lure of near double-digit annual returns with almost no risk is too hard to resist given that the average return given by the top 50 income funds in the past one year has been just 8 per cent.
Story first published: Monday, June 29, 2015, 16:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X