Mukesh Ambani: దేశంలోని ప్రముఖ పారిశ్రామిక దిగ్గజం ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ గ్రూప్ ప్రస్తుతం ఎనర్జీ రంగంలో కూడా వ్యాపారాన్ని విస్తరిస్తోంది. ఇందులో భాగంగా సోలార్ నుంచి హైడ్రోజన్ వరకు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది.
అయితే ఈ న్యూ ఎనర్జీ వ్యాపారం ద్వారా 2030 నాటికి కంపెనీ 10-15 బిలియన్ డాలర్లను సంపాదించగలదని తెలుస్తోంది. మారుతున్న అవసరాలు, భవిష్యత్తు ఇంధన మార్పులను దృష్టిలో ఉంచుకుని రిలయన్స్ గ్రూప్ కొత్త సంస్థల కొనుగోళ్లు లేదా ఇతర సంస్థలతో భాగస్వామ్యాలను సాంకేతిక నైపుణ్యాల భర్తీకి వినియోగించుకుంటున్నట్లు శాన్ఫోర్డ్ సి.బెర్న్‌స్టెయిన్ నివేదికలో పేర్కొంది.

క్లీన్ ఎనర్జీ రంగంలో 2050 నాటికి రిలయన్స్ 2000 బిలియన్ డాలర్ల కొత్త వృద్ధి స్తంభంగా మారనుంది. ఈ క్రమంలో 2030 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ 280 GW సౌర సామర్థ్యం, 5 మిలియన్ టన్నుల గ్రీన్ H2 ఉత్పత్తిని లక్ష్యంగా పెట్టుకుంది. ఇదే సమయంలో ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణ వేగంగా జరుగుతున్నందున క్లీన్ ఎనర్జీ ప్రస్తుతం టోటల్ అవైలబుల్ మార్కెట్ 10 బిలియన్ డాలర్ల నుంచి 2030 నాటికి 30 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని వెల్లడైంది.
2030 నాటికి రిలయన్స్ సోలార్ మార్కెట్లో 60 శాతం, బ్యాటరీ మార్కెట్లో 30 శాతం మరియు హైడ్రోజన్ మార్కెట్లో 20 శాతం స్వాధీనం చేసుకుంటుందని బెర్న్‌స్టెయిన్ అంచనా వేశారు. తద్వారా కంపెనీకి 10-15 బిలియన్ డాలర్ల ఆదాయం రానున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో చమురు నుంచి టెలికాం వరకు అనేక వ్యాపారాల్లో విస్తరించిన రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లపై బ్రోకరేజ్ సంస్థ BUY రేటింగ్ ఇచ్చింది. షేర్ టార్గెట్ ధరను రూ.2,670గా నిర్ణయించింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications