For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

PF నుండి రూ.1 లక్ష విత్‌డ్రా చేస్తే... అలా 11 లక్షలు కోల్పోతారు!

|

ఉద్యోగులకు ప్రావిడెంట్ ఫండ్ అత్యవసర పరిస్థితుల్లో అవసరానికి ఎంతో ఉపయోగపడుతుంది. ప్రస్తుతం కరోనా మహమ్మారి నేపథ్యంలో చాలామంది ఉద్యోగులు ప్రావిడెంట్ ఫండ్ నుండి నిబంధనల మేరకు తమ మొత్తాల నుండి నగదును ఉపసంహరించుకున్నారు. కరోనాతో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు పీఎప్ ఉపసంహరణ నిబంధనల్ని సడలించింది. అత్యవసరమైతే తప్ప పీఎఫ్ అకౌంట్ నుండి డబ్బును ఉపసంహరించుకోవద్దని నిపుణులు సూచిస్తుంటారు. పీఎఫ్ అకౌంట్ నుండి నగదును ఉపసంహరించుకోవచ్చా లేదా అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

Monetary Policy 2021: RBI మానిటరీ పాలసీ ముందు రిస్క్ ఫ్యాక్టర్స్Monetary Policy 2021: RBI మానిటరీ పాలసీ ముందు రిస్క్ ఫ్యాక్టర్స్

రూ.11 లక్షలు కోల్పోయినట్లే!

రూ.11 లక్షలు కోల్పోయినట్లే!

అయితే ఓ పీఎఫ్ కాలిక్యులేషన్ ప్రకారం పీఎఫ్ నుండి అత్యవసరం కాకున్నప్పటికీ ఉపసంహరించుకుంటే ఎలా ఉంటుందో చిన్న లెక్క ద్వారా తెలుసుకోవచ్చు! ఉదాహరణకు మీరు పీఎఫ్ అకౌంట్ నుండి రూ.1 లక్ష మొత్తాన్ని ఉపసంహరించుకుంటే రిటైర్మెంట్ కాలం ముప్పయ్యేళ్ళు అయితే ఈ కాలానికి గాను మీరు రూ.11 లక్షలు నష్టపోయినట్లేనని చెబుతున్నారు.

ఆదాయం రూ.38 లక్షలు

ఆదాయం రూ.38 లక్షలు

మీ వయస్సు 25 సంవత్సరాలు, నెలకు వేతనం రూ.10వేలు, పీఎఫ్ అకౌంట్‌లో రూ.1 లక్ష సేవ్ చేసి ఉంటే కనుక ఉద్యోగి వాటా 12 శాతంతో పాటు యజమాని వాటా కూడా ఉంటుంది. అంతా సవ్యంగా సాగితే మీకు 55 ఏళ్లు వచ్చేసరికి పీఎఫ్ అకౌంట్‌లో రూ.38,14,026 లక్షలు ఉంటుంది. అంటే ముప్పై ఏళ్ల సర్వీస్ కాలంలో మీ ఆదాయం రూ.38 లక్షలు అవుతుంది.

ఇదీ లెక్క

ఇదీ లెక్క

మీ పీఎఫ్ అకౌంట్ నుండి మీరు రూ.1 లక్ష కనుక ఉపసంహరించుకుంటే మీ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ సున్నా అవుతుంది. ఉపసంహరణ అనంతరం మీ పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కొనసాగినప్పటికీ 55 ఏళ్ల సర్వీస్ కాలానికి రూ.26,09,290 అవుతుంది. అంటే మీరు రూ.1 లక్ష ఇప్పుడు కరోనా కారణంగా ఉపసంహరించుకుంటే రూ.11 లక్షలకు పైగా తగ్గుతుంది.

English summary

PF నుండి రూ.1 లక్ష విత్‌డ్రా చేస్తే... అలా 11 లక్షలు కోల్పోతారు! | Withdrawing Rs 1 lakh from PF account? You are actually losing out on Rs 11 lakh

Provident Fund has always acted as an emergency backup for salaried employees. And, most of them are going through a tough phase due to the ongoing coronavirus crisis.
Story first published: Tuesday, April 6, 2021, 15:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X