For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారంపై వీటి ప్రభావం, ఈ వారం పెరిగే ఛాన్స్: ధర పెరిగింది కానీ

|

యూఎస్ ద్రవ్యోల్భణం, రిటైల్ సేల్స్ డేటా ఇన్వెస్టర్లను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఆర్థికవేత్తలు కూడా ఈ డేటా పైన ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికాలో ద్రవ్యోల్భణం ఏడాది ప్రాతిపదికన ఏడు శాతంగా నిలిచింది. 1982 తర్వాత అంటే డిసెంబర్ 2021లో నలభై గరిష్టం వద్ద నమోదయింది. రిటైల్ విక్రయాలు పది నెలల్లో అత్యధికంగా 1.9 శాతం మేర పడిపోయాయి. ఇది పసిడి పైన ప్రభావం చూపుతుంది. ఇప్పటికే పసిడి ధరలు పెరిగాయి. ఈ వారం కూడా బులియన్ మార్కెట్లో ధరలు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ద్రవ్యోల్భణం ప్రభావం నేపథ్యంలో రానున్న రోజుల్లో యూఎస్ బాండ్ యీల్డ్స్, డాలర్ వ్యాల్యూ పసిడి పైన తీవ్ర ప్రభావం చూపుతుందని అంటున్నారు. యూఎస్ ఫెడ్ ఈ ఏడాది వడ్డీ రేట్లను మూడు పర్యాయాలు పెంచే అవకాశాలున్నాయి. అదే జరిగితే బంగారం ధరలు మళ్లీ పడిపోతాయి.

బంగారం ధరలు మరింత పెరగొచ్చు

బంగారం ధరలు మరింత పెరగొచ్చు

ట్రెజరీ యీల్డ్స్ ఎక్కువగా ఉన్నాయని, మార్చి నెలలో ఫెడ్ రేట్లు పెంచే అవకాశం 90 శాతం కంటే ఎక్కువగా ఉందని, ఇలాంటి పరిస్థితుల్లో పసిడి రెండు నెలల గరిష్టాల వద్ద మాత్రమే కనిపిస్తోందని బులియన్ మార్కెట్ నిపుణులు గుర్తు చేస్తున్నారు. అంటే వడ్డీ రేట్లు త్వరలో పెరగవచ్చుననే సంకేతాలు ఉన్నప్పటికీ భారీ పెరుగుదల కనిపించడం లేదంటున్నారు. వీటికి తోడు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లు కూడా బంగారం మార్కెట్ పైన ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం బంగారం 1820 డాలర్ల పైన ఉంది. పసిడి ఈ వారం 1830 డాలర్ల నుండి 1850 డాలర్లకు చేరుకునే అవకాశాలున్నాయని అంటున్నారు.

ధరలు పెరిగాయి కానీ

ధరలు పెరిగాయి కానీ

బంగారం ధరలు గతవారం పెరిగాయి. అయినప్పటికీ రూ.48,000కు దిగువనే ఉన్నాయి. క్రితం సెషన్లో ఫిబ్రవరి గోల్డ్ ఫ్యూచర్స్ రూ.84 పెరిగి రూ.47,820 వద్ద, ఏప్రిల్ గోల్డ్ ఫ్యూచర్స్ రూ.73 పెరిగి రూ.47,916 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో గతవారం 1820 డాలర్లు క్రాస్ చేసినప్పటికీ చివరి సెషన్లో 4 డాలర్లు తగ్గి 1817 డాలర్ల వద్ద ముగిసింది.

ఇక ఎంసీఎక్స్‌లో సిల్వర్ ఫ్యూచర్ మార్చి రూ.275 క్షీణించి రూ.61,645 వద్ద, మే సిల్వర్ ఫ్యూచర్స్ రూ.324 తగ్గి రూ.62,250 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్లో గతవారం 23 డాలర్లు దాటిన సిల్వర్ ఫ్యూచర్ ఆ తర్వాత కాస్త శాంతించింది. క్రితం సెషన్లో 0.177 డాలర్లు తగ్గి 22.985 డాలర్ల వద్ద ముగిసింది.

వివిధ నగరాల్లో ధరలు

వివిధ నగరాల్లో ధరలు

ముంబై 22 క్యారెట్ల పసిడి 47,080/- 24 క్యారెట్ల పసిడి 49,080/-

ఢిల్లీ 22 క్యారెట్ల పసిడి 47,150/- 24 క్యారెట్ల పసిడి 51,440/-

బెంగళూరు 22 క్యారెట్ల పసిడి 45,000/- 24 క్యారెట్ల పసిడి 49,100/-

హైదరాబాద్ 22 క్యారెట్ల పసిడి 45,000/- 24 క్యారెట్ల పసిడి 49,100/-

చెన్నై 22 క్యారెట్ల పసిడి 45,370/- 24 క్యారెట్ల పసిడి 49,450/-

కేరళ 22 క్యారెట్ల పసిడి 45,000/- 24 క్యారెట్ల పసిడి 49,100/-

కోల్‌కతా 22 క్యారెట్ల పసిడి 47,300/- 24 క్యారెట్ల పసిడి 50,000/-

English summary

బంగారంపై వీటి ప్రభావం, ఈ వారం పెరిగే ఛాన్స్: ధర పెరిగింది కానీ | US Inflation At 40 Years High Level, What Will Be The Upcoming Gold Rates Direction?

Recently published data regarding US inflation and retail sales have been concerning investors and economists all over the world. The inflation in the country stood at 7% YoY, at the 40 years high level in December.
Story first published: Sunday, January 16, 2022, 17:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X