For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

20 ఏళ్ల క్రితం రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే.. 2 లక్షల రెట్లు ప్రాఫిట్: ఈ 5 కొనొచ్చు!!

|

ముంబై: ప్రపంచ ఆర్థిక సంక్షోభం, లిక్విడిటీ క్రంచ్, క్రెడిట్ సంక్షోభం, దేశీయ ఆర్థిక మందగమనం వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ఈ శతాబ్దం ప్రారంభం నుంచి దలాల్ స్ట్రీట్ అనేక మల్టీబ్యాగర్లను పరిచయం చేసింది. మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తే లాభం ఉంటుందని చెప్పడానికి లేదు. కానీ పలు కంపెనీల్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్లు మాత్రం వందలు, వేలు, లక్షల రెట్లు లాభాలు చవిచూశారు.

జీఎస్టీ భారం మరో 3 శాతం: రాష్ట్రాల ఒత్తిడి, సెస్ పెంచనున్నజీఎస్టీ భారం మరో 3 శాతం: రాష్ట్రాల ఒత్తిడి, సెస్ పెంచనున్న

2001 నుంచి 173 షేర్లు

2001 నుంచి 173 షేర్లు

2001 జనవరి నుంచి 2019 డిసెంబర్ వరకు చూస్తే దీశీయ స్టాక్ మార్కెట్లో 173 షేర్లు ఇన్వెస్టర్లకు అదిరిపోయే లాభాలు ఇచ్చాయి. ఇందులో ఎన్నో స్టాక్స్ 10 రెట్ల లాభాలు ఇచ్చాయి. కొన్ని స్టాక్స్ ఏకంగా 2,00,000 శాతం లాభాలు అందించాయి. అంత పెద్ద మొత్తంలో లాభాలు ఇచ్చిన టాప్ 5 కంపెనీలు ఇవే...

2 లక్షల రెట్లకు పైగా పెరిగిన సింఫోనీ

2 లక్షల రెట్లకు పైగా పెరిగిన సింఫోనీ

సింఫోనీ కంపెనీ షేర్లుఈ ఇరవై ఏళ్ల కాలంలో 2,16,860 శాతం ర్యాలీ చేసింది. డిసెంబర్ 29, 2000లో ఈ షేర్ ధర 0.50 వద్ద ఉండగా, డిసెంబర్ 6, 2019 నాటికి రూ.1,095.70కి చేరుకుంది. ప్రస్తుతం రూ.1.091కి పైన ఉంది.

19 ఏళ్ల క్రితం మీరు ఇందులో రూ.10,000 ఇన్వెస్ట్ చేసి ఉంటే ఇప్పుడు మీ వద్ద రూ.2.17 కోట్లు ఉండేవి. ఈ షేర్‌ను ఇప్పటికైనా కొనుగోలు చేయవచ్చునని HDFC సెక్యూరిటీస్ సిఫార్స్ చేస్తోంది. షేర్ ధర రూ.1,812కు చేరవచ్చునని అంచనా వేస్తోంది.

సెప్టెంబర్ 2019 క్వార్ర్ నాటికి కంపెనీ నెట్ ప్రాఫిట్ రూ.57 కోట్లు నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.34 కోట్లు నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 67.65 శాతం ప్రాఫిట్ నమోదయింది.

అలాగే నెట్ సేల్స్ 31.75 శాతం పెరిగాయి.

బజాజ్ ఫైనాన్స్ అండ్ UPL

బజాజ్ ఫైనాన్స్ అండ్ UPL

NBFC మేజర్ బజాజ్ ఫైనాన్స్, ఆగ్రో కెమికల్స్ కంపెనీ UPL షేర్ కూడా గత ఇరవై ఏళ్లలో భారీగా పుంజుకుంది. 19 ఏళ్ల కాలంలో బజాజ్ ఫైనాన్స్ 1,53,459 శాతం ర్యాలీ చేయగా, UPL 1,15,318 శాతం పుంజుకుంది. ఈ రెండు షేర్లు కూడా కొనవచ్చునని రేటింగ్ ఏజెన్సీలు చెబుతున్నాయి.

63 శాతం నెట్ ప్రాఫిట్

63 శాతం నెట్ ప్రాఫిట్

బజాజ్ ఫైనాన్స్ ఇటీవలి సెప్టెంబర్ క్వార్టర్‌లో 63 శాతం పెరిగి నెట్ ప్రాఫిట్ రూ.1,506.29 నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.923.47 కోట్ల ప్రాఫిట్ నమోదు చేసింది. UPL కూడా కొనదగిన షేరుగా చెబుతున్నారు. 2018 జూలైలో ఇది అమెరికాకు చెందిన అరిస్టా లైఫ్ సైన్స్‌ను 4.2 బిలియన్ డాలర్లకు కొనుగోలు చేసింది.

బాలకృష్ణ ఇండస్ట్రీస్ అండ్ ఐచర్

బాలకృష్ణ ఇండస్ట్రీస్ అండ్ ఐచర్

బాలకృష్ణ ఇండస్ట్రీస్, ఐచర్ మోటార్స్ షేర్లు కూడా ఈ రెండు దశాబ్దాల్లో భారీగా ర్యాలీ అయ్యాయి. బాలకృష్ణ ఇండస్ట్రీస్ 98,777 శాతం, ఐచర్ మోటార్స్ 75,996 శాతం ర్యాలీ చేసింది. టాప్ ఫైవ్ గెయినర్స్ లిస్టులో ఇవి ఉన్నాయి. సెప్టెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌లో బాలకృష్ణ ఇండస్ట్రీస్ నెట్ ప్రాఫిట్ రూ.294.31 నమోదు చేసింది. గత ఏడాది ఇదే సమయంలో రూ.210.30 నమోదు చేసింది. బాలకృష్ణ ఇండస్ట్రీస్ వాహన విడిభాగాల సంస్థ. రాయల్ ఎన్ ఫీల్డ్ వాహనాలను తయారు చేసే సంస్థ ఐచర్ మోటార్స్. ఈ షేర్లు కూడా కొనుగోలు చేయవచ్చునని అంటున్నారు. అయితే మార్కెట్ నిపుణుల సలహాలు తీసుకొని నిర్ణయం తీసుకోవడం మంచిది.

English summary

20 ఏళ్ల క్రితం రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే.. 2 లక్షల రెట్లు ప్రాఫిట్: ఈ 5 కొనొచ్చు!! | Up to 2,00,000% returns in 20 years: Brokers are still bullish on these 5 stocks

Dalal Street produced many multibaggers since the beginning of this century despite challenges in the form of the global financial crisis, liquidity crunch, credit crisis and a slowdown in the domestic economy.
Story first published: Thursday, December 12, 2019, 13:11 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X