For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ట్యాక్స్ సేవింగ్ పెట్టుబడుల కోసం చూస్తున్నారా? వీటిని తెలుసుకోండి

|

ద్రవ్యోల్భణ రేట్లు వేగవంతమవుతున్నప్పుడు, ఈక్విటీ మార్కెట్ అస్థిరంగా ఉన్నప్పుడు సరైన పెట్టుబడి మార్గాన్ని కనుగొనడం కాస్త కష్టతరమే. మూలధనం హామీతో కూడిన పెట్టుబడులు తక్కువ వడ్డీ రేటును అందిస్తాయి. అలాగే, స్టాక్స్‌లో పెట్టుబడి రిస్క్‌తో కూడుకున్న అంశం. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ గరిష్టానికి సమీపంలో ఉన్నాయి. సెన్సెక్స్ 60వేల పాయింట్లను క్రాస్ చేసింది. ఆల్ టైమ్ గరిష్టం వద్ద పెట్టుబడి పెట్టే సమయంలో అన్ని అంశాలను పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతం పెట్టుబడి పెట్టే ముందు అయిదేళ్ల మంచి రికార్డ్ కలిగిన పోర్ట్ పోలియోను ఎంచుకోవాలి. బ్లూచిప్ ఫండ్స్.. స్మాల్ క్యాప్స్ కంటే తక్కువ రాబడిని ఇస్తాయి. కానీ బ్లూచిప్స్ హామీ ఉంటుంది. అలాగే, భద్రతతో కూడిన మెరుగైన వడ్డీరేటును అందించే వాటిని కూడా ఎంచుకోవచ్చు. ఇక, మీరు సీనియర్ సిటిజన్ అయితే, మంచి పెట్టుబడి ఎంపిక కోసం వెతుకుతుంటే కనుక ఈ కింది జాబితా సహాయకరంగా ఉంటుంది. ఒకవేళ మీరు సీనియర్ సిటిజన్ కాకపోయినా స్థిరమైన, సురక్షిత ఆదాయంతో అదే ప్రయోజనాలను పొందడానికి మీరు మీ పేరెంట్స్ పేరిట ఖాతాలను తెరుచుకోవచ్చు.

ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్

ట్యాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్

పన్ను ఆదా FDలు ఇతర FD లాక్-ఇన్ కంటే భిన్నంగా ఉంటాయి. ఈ FD కింద బ్యాంకులో అయిదేళ్లకు ఫిక్స్ డిపాజిట్ చేయాలి. మీరు ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80సీ కింద ఈ FDలో పెట్టుబడులపై పన్ను మినహాయింపు ఉంటుంది. సీనియర్ సిటిజన్స్ కోసం గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు FDలో పెట్టుబడి ద్వారా పన్ను మినహాయింపును పొందవచ్చు. మీ నెలవారీ, త్రైమాసిక లేదా వార్షిక ప్రాతిపదికన వడ్డీని పొందవచ్చు. కాబట్టి ఇన్వెస్ట్ చేయాలనుకునే వారికి FD లాభదాయకమైన ఎంపిక. సాధారణ పౌరుల కంటే సీనియర్ సిటిజన్స్ వడ్డీ రేటును కాస్త అధికంగా పొందుతారు. ఎస్బీఐ ట్యాక్స్ సేవింగ్స్ FD స్కీం పైన 6.20 శాతం వడ్డీ రేటును అందిస్తుంది. ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకు పైన అదే వడ్డీ రేటును అందిస్తోంది.

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్

సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్(SCSS) ఇన్వెస్ట్ చేయాలనుకునే వృద్ధులకు ఓ మంచి స్కీం. దీనిని ఏ బ్యాంకులో అయినా లేదా ఓ పోస్టాఫీస్‌లో అయినా ఓపెన్ చేయవచ్చు. వయస్సు ధృవీకరణ పత్రంతో దీనిని ఓపెన్ చేయవచ్చు. బ్యాంకు లేదా పోస్టాఫీస్‌లో ఓపెన్ చేస్తే ఉండే ప్రయోజనాలు అన్నీ ఇందులో ఉంటాయి. ఇందులో వార్షిక వడ్డీ రేటు 7.4 శాతంగా ఉంది. గరిష్ట FD పరిమితి రూ.15 లక్షలు. ఆదాయపు పన్ను చట్టం 1961 సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ బెనిఫిట్ వర్తిస్తుంది.

నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS)

నేషనల్ పెన్షన్ స్కీమ్(NPS)

పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ (PFRDA) నేషనల్ పెన్షన్ స్కీం(NPS) భారతీయులు ఎవరైనా ఓపెన్ చేయవచ్చు. దీనికి ఏడాదికి కనీసం రూ.6000 కాంట్రిబ్యూట్ చేయవచ్చు. మీరు నెలకు రూ.500 లేదా పెద్ద మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయవచ్చు. దీనికి సంబంధించి వయో పరిమితిని ఇటీవలే సవరించారు. ప్రస్తుతం వయస్సు పరిమితి 70 ఏళ్లు.వడ్డీ రేటు 9 శాతం నుండి 12 శాతం వరకు ఉంది. ఇందులో నుండి అయిదేళ్ల కాలంలో కాంట్రిబ్యూ ట్ చేసిన మొత్తంలో 2 శాతాన్ని మూడుసార్లు ఉపసంహరించుకోవచ్చు.

బాండ్స్, పీపీఎఫ్

బాండ్స్, పీపీఎఫ్

హయ్యెస్ట్ ట్యాక్స్ బ్రాకెట్‌లో ఉన్నవారు ట్యాక్స్-ఫ్రీ బాండ్స్ కోసం మొగ్గు చూపుతారు. IRFC, PFC, NHAI, HUDCO, REC, NTPC, NHPC, ఇండియన్ రెన్యువబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ అథారిటీ (IREDA) వంటి పబ్లిక్ రంగ సంస్థలు ఈ బాండ్స్‌ను ఆఫర్ చేస్తాయి.

అలాగే, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF) కూడా మంచి ఇన్వెస్ట్ సాధనం. ట్యాక్స్ సేవింగ్ కోసం దీనిని కూడా ఎంచుకోవచ్చు.

English summary

ట్యాక్స్ సేవింగ్ పెట్టుబడుల కోసం చూస్తున్నారా? వీటిని తెలుసుకోండి | Top senior citizens investments with tax saving

Finding a correct investment option can be tough when the inflation rates are accelerating and the equity market is quite volatile. Investments with assured income offer low levels of interest rates and investing in stocks can certainly be risky.
Story first published: Sunday, October 10, 2021, 18:55 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X