For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Gold Loans: బంగారంపై అతి తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకులివే

|

ఆర్థిక అత్యవసర పరిస్థితుల్లో ఎంతోమంది వ్యక్తిగత రుణం, పసిడి రుణాల వైపు మొగ్గు చూపుతారు. వ్యక్తిగత రుణం అన్-సెక్యూర్డ్. కాబట్టి దానికి ప్రాసెస్ ఉంటుంది. బంగారం రుణాలు సెక్యూర్డ్. కాబట్టి మిగతా రుణాల కంటే సులభంగా లభిస్తాయి. బ్యాంకు లేదా నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలలో ఈ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇది 18 క్యారెట్ల నుండి 24 క్యారెట్ల మధ్య ఉండాలి. రుణ దరఖాస్తును ఆమోదించడానికి రుణదాత తాకట్టు పెట్టిన బంగారం నాణ్యతను, బంగారం క్యారెట్లను తనిఖీ చేస్తారు. ఆ తర్వాత బంగారం మార్కెట్ ధరను బట్టి రుణం మంజూరు అవుతుంది. ఇది ప్రస్తుత ధర ప్రకారం లెక్కిస్తారు.

టాప్ 5 PSU బ్యాంకుల్లో గోల్డ్ లోన్స్ వడ్డీ రేటు

టాప్ 5 PSU బ్యాంకుల్లో గోల్డ్ లోన్స్ వడ్డీ రేటు

పంజాబ్ అండ్ సింద్ బ్యాంకులో వడ్డీ రేటు 7.00 శాతం నుండి 7.50 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడాలో వడ్డీ రేటు 7.30 శాతం నుండి 8.95 శాతం, కెనరా బ్యాంకులో వడ్డీ రేటు 7.35 శాతం, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వడ్డీ రేటు 7.5, ఆంధ్రా బ్యాంకులో వడ్డీ రేటు 7.60 శాతం నుండి ఉన్నాయి.

టాప్ 5 ప్రయివేటు బ్యాంకుల్లో గోల్డ్ లోన్స్ వడ్డీ రేటు

టాప్ 5 ప్రయివేటు బ్యాంకుల్లో గోల్డ్ లోన్స్ వడ్డీ రేటు

HDFC బ్యాంకులో వడ్డీ రేటు 8.95 శాతం నుండి 17.20 శాతం వరకు, ఫెడరల్ బ్యాంకులో వడ్డీ రేటు 8.50 శాతం నుండి, కరూర్ వైశ్య బ్యాంకులో వడ్డీ రేటు 8.60 నుండి 9.60 శాతం వరకు, ICICI బ్యాంకు నుండి వడ్డీ రేటు 9.00 శాతం నుండి 19.76 శాతం, ధనలక్ష్మి బ్యాంకులో వడ్డీ రేటు 9.65 శాతం నుండి ప్రారంభమవుతుంది.

టాప్ 5 NBFCలలో గోల్డ్ లోన్స్ వడ్డీ రేటు

టాప్ 5 NBFCలలో గోల్డ్ లోన్స్ వడ్డీ రేటు

IIFL ఫైనాన్స్‌లో వడ్డీ రేటు 9.24 శాతం నుండి 24 శాతం, శ్రీరాం ట్రాన్సుపోర్ట్ ఫైనాన్స్ కంపెనీ లిమిటెడ్11.5 శాతం నుండి ప్రారంభం, ముథూట్ ఫైనాన్స్ 11.99 శాతం, బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ 11.99 శాతం నుండి ప్రారంభం, మణప్పురం ఫైనాన్స్ లిమిటెడ్ 12.00 శాతం నుండి ప్రారంభం.

English summary

Gold Loans: బంగారంపై అతి తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంకులివే | Top 5 Lenders With The Cheapest Interest Rates On Gold Loans

When it comes to covering financial emergencies or fulfilling any short-term personal finance goal instantly, availing of a gold loan can be a good move.
Story first published: Tuesday, July 13, 2021, 9:17 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X