For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధర పడిపోతే మరింత తాకట్టు: రుణం తీసుకుంటే గుర్తుంచుకోవాల్సినవి...

|

న్యూఢిల్లీ: నగదు అవసరమైనప్పుడు చాలామంది లోన్స్ తర్వాత పసిడి రుణాలకు ప్రాధాన్యత ఇస్తారు. పసిడిపై రుణాలు వేగంగా వస్తాయి. పసిడి రుణాలకు ఎలాంటి సిబిల్ స్కోర్ కూడా అవసరం లేదు. అలాగే, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని కూడా అంచనా వేయవు. ఇందుకు ప్రధాన కారణం రుణానికి వ్యతిరేకంగా బంగారాన్ని తాకట్టు పెట్టడమే. చిన్న వ్యాపారులకు, సామాన్యులకు అత్యవసర సమయంలో తాత్కాలిక నగదు సమస్య ఏర్పడినప్పుడు ఇది ఎంతో ఉపయోగపడుతుంది. బ్యాంకింగ్, ఎన్బీఎఫ్‌సీలు బంగారం రుణాలు అందిస్తాయి.

బ్యాంకులో వడ్డీ తక్కువ.. ఎన్‌బీఎఫ్‌సీలో వేగవంతం

బ్యాంకులో వడ్డీ తక్కువ.. ఎన్‌బీఎఫ్‌సీలో వేగవంతం

బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు రెండు కూడా బంగారం రుణాలు అందిస్తాయి. బ్యాంకుల్లో వడ్డీ రేటు తక్కువగా ఉంటుంది. ఎన్బీఎఫ్‌సీలో వడ్డీ రేటు ఎక్కువ ఉంటుంది. అయితే బంగారం వ్యాల్యూను బ్యాంకుల కంటే ఎన్బీఎఫ్‌సీలు ఎక్కువ కడుతున్నాయి. బ్యాంకులు, ఎన్బీఎఫ్‌సీలు బంగారం విలువలో 75 శాతం రుణాన్ని అందిస్తాయి. అయితే అయితే బ్యాంకులు కట్టే వ్యాల్యూ కంటే ఎన్‌బీఎఫ్‌సీలు కాస్త ఎక్కువ కట్టే అవకాశాలు ఉంటాయి. బంగారంపై రుణాలిచ్చే ఎన్‌బీఎఫ్‌సీ వ్యాల్యూ చేసేటప్పుడు వేగంగా రుణాలు అందిస్తుంది. బ్యాంకులు నిబంధనల ప్రకారం జారీ చేస్తాయి. కాబట్టి కాస్త ఆలస్యమవుతుంది.

గోల్డ్ బార్స్-రుణాలు

గోల్డ్ బార్స్-రుణాలు

బంగారాన్ని బ్యాంకులు ఎక్కువ ఎన్‌బీఎఫ్‌సీలు తాకట్టు పెట్టుకునే సమయంలో కనీసం స్వచ్ఛత 18 క్యారెట్లను పరిగణలోకి తీసుకుంటాయి. ఆభరణాలు తాకట్టు పెడితే అందులోని వజ్రాలు, రాళ్లకు వ్యాల్యూ కట్టరు. కేవలం బంగారాన్ని లెక్కిస్తారు. బరువుపై పరిమితులు ఉంటాయి. పలు బ్యాంకులు గోల్డ్ బార్స్ పైన రుణాలు ఇవ్వవు.

బంగారం ధర పడిపోతే

బంగారం ధర పడిపోతే

రుణాలు తిరిగి చెల్లించే సమయంలో చాలా వరకు ముందస్తు ఛార్జీలు తీసుకోవు. కొన్ని మాత్రం ఛార్జీలు విధిస్తాయి. రుణంలో ఒక శాతం వరకు ఉంటాయి. వ్యాల్యుయేషన్ ఛార్జీ, ప్రాసెసింగ్ ఫీజులు ఉండవచ్చు. తిరిగి చెల్లించేందుకు ఆప్షన్స్ ఉంటాయి. నెల వాయిదాల్లో చెల్లించవచ్చు లేదా ప్రతి నెల వడ్డీ చెల్లించి చివరలో ఒకేసారి కూడా చెల్లించవచ్చు. రుణాలు తిరిగి చెల్లించకుంటే వాటిని విక్రయించే హక్కు ఉంటుంది. బంగారం ధర పడిపోతే అదనపు బంగారం తాకట్టు కావాలని అడగవచ్చు.

English summary

బంగారం ధర పడిపోతే మరింత తాకట్టు: రుణం తీసుకుంటే గుర్తుంచుకోవాల్సినవి... | Things to keep in mind before taking gold loan

Gold loans can help one tide over a temporary cash crunch. You can get a loan quickly with minimum paperwork. The lender doesn't check credit scores or evaluate the borrower's repayment capacity while giving a loan against gold.
Story first published: Saturday, February 20, 2021, 21:03 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X