For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ 3 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు భారీగా నష్టపోయినట్లే!!

|

ముంబై: స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కొంతకాలానికి పెద్ద మొత్తాన్ని జమ చేయవచ్చు. దీర్ఘకాలిక పెట్టుబడులద్వారా మంచి రిటర్న్స్ పొందవచ్చు. వివిధ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టడం ద్వారా కొన్ని కారకాలతో ఆ స్టాక్స్ దెబ్బతింటే మీ పెట్టుబడుల్లో కోత పడే అవకాశాలు కూడా ఉంటాయి. గత కొంత కాలాన్ని పరిశీలిస్తే పెట్టుబడిదారులకు లాభాన్ని తెచ్చిపెట్టిన స్టాక్స్‌తో పాటు నష్టాలను తెచ్చిపెట్టిన స్టాక్స్ కూడా ఉన్నాయి. ఇన్వెస్ట్ చేసిన మూలధనంలోనే భారీగా కోతపడిన స్టాక్స్ ఉన్నాయి. అలాంటి వాటిలో రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, పీసీ జ్యువెల్లర్స్, యస్ బ్యాంకు ఉన్నాయి. పెట్టుబడిదారులను నష్టపరిచిన స్టాక్స్ కొన్ని...

రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్

రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్

అనిల్ ధీరుబాయ్ అంబానీ గ్రూప్‌కు చెందిన కంపెనీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ సంస్థ ప్రధానంగా ఇన్ఫ్రా రంగంలో ఉంది. కోర్ సెక్టార్స్ ఎనర్జీ, ఇన్ప్రాస్ట్రక్చర్, ఈ అండ్ సీ, డిఫెన్స్. కంపెనీ వెబ్ సైట్ ప్రకారం టర్నోవర్ రూ.18,852 కోట్లు. ముంబై మెట్రో వన్‌లో అద్భుత అభివృద్ధికి గాను ఈ కంపెనీ 'బెస్ట్ మెట్రో ఆఫ్ ఇండియా 2016' అవార్డును గెలుచుకుంది.

ఈ స్టాక్ ప్రైస్ జర్నీని గమనిస్తే 2018లో ఈ స్టాక్ ఆల్ టైమ్ గరిష్టం రూ.2641

వద్ద ట్రేడ్ అయింది. అయితే ఈ స్టాక్ ఇటీవలి సెషన్లో రూ.76.85 వద్ద ట్రేడ్ అయింది. 52 వారాల గరిష్టం రూ.109, కనిష్టం రూ.19.2గా ఉంది. క్రితం త్రైమాసికంలో ఈ స్టాక్ ఏకంగా రూ.3,000 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. కంపెనీ ఫైనాన్షియల్స్, డెట్ ఈక్విటీ ఒక శాతం కంటే తక్కువగా ఉంది.

PC జ్యువెల్లర్స్

PC జ్యువెల్లర్స్

ప్రతి అకెషన్‌కు ఆకర్షించేలా కొత్త కొత్త డిజైన్స్ తీసుకు వస్తుంది పీసీ జ్యువెల్లర్స్. ఉచిత షిప్పింగ్, బిస్ హాల్‌మార్క్, 100% సెర్టిఫైడ్ జ్యువెల్లరీ, లైఫ్ టైమ్ ఎక్స్చేంజ్, బెస్ట్ అండ్ ట్రాన్సుపరంటే ధరలు, యూనిక్ డిజైన్స్ సహా ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. 2012లో ఈ కంపెనీ ఇండియన్ స్టాక్ మార్కెట్‌లో అడుగు పెట్టింది. అప్పుడు షేర్‌కు రూ.135గా ఉంది. 2018 నాటికి రూ.600కు చేరుకుంది. అయితే జూలై 20, 2021 నాటికి ఈ స్టాక్ ధర రూ.26.40కి పడిపోయింది. కంపెనీ ప్రమోటర్లు తమ బిజినెస్ అంశాలను దాచినట్లుగా వార్తలు రావడం ప్రభావం చూపింది. అంతేకాదు, కంపెనీలోని ఓ ప్రమోటర్ మార్కెట్ ట్రాన్సాక్షన్ ద్వారా తన వాటాను తన కుటుంబ సభ్యులకు బహుమతిగా ఇచ్చారు.

యస్ బ్యాంకు

యస్ బ్యాంకు

దేశంలో ఉనికిలో ఉన్న బ్యాంకుల్లో యస్ బ్యాంకు ఒకటి. ఈ బ్యాంకు ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్, మర్చంట్ బ్యాంకింగ్ అండ్ బ్రోకరేజ్ బిజినెస్ (యస్ సెక్యూరిటీస్ ద్వారా), మ్యూచువల్ ఫండ్ బిజినెస్(యస్ అసెట్ మేనేజ్మెంట్ ద్వారా) వ్యాపారాలు నిర్వహిస్తోంది. ఈ బ్యాంకు స్టాక్ 2018లో రూ.404కు చేరుకుంది. కానీ ఈ స్టాక్ చివరి ట్రేడ్‌లో రూ.12.95కు పడిపోయింది. 52 వారాల గరిష్టం రూ.20.75, కనిష్టం రూ.11.1గా ఉంది.

English summary

ఈ 3 స్టాక్స్‌లో ఇన్వెస్ట్ చేసిన వారు భారీగా నష్టపోయినట్లే!! | These three stocks destroyed investors wealth

For stock market investing it is said that you can build a good corpus amount by remaining invested in them for a longer life span but likewise there can be erosion also of your wealth if the fundamentals and the various other factors around the scrip/stock and industry at large are not in favour.
Story first published: Wednesday, July 21, 2021, 13:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X