For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అమరరాజా బ్యాటరీ సహా ఈ స్టాక్స్ అదరగొడతాయి!! అది మాత్రం గుడ్‌న్యూస్

|

ప్రముఖ బ్రోకరింగ్ కంపెనీ షేర్‌ఖాన్ సెప్టెంబర్ నెలకు గాను తన వ్యాల్యూ రిపోర్ట్‌తో ముందుకు వచ్చింది. ఈ సంస్థ వ్యాల్యూ రిపోర్ట్ ప్రకారం తొమ్మిది స్టాక్స్‌ను కొనుగోలు చేయవచ్చునని సూచిస్తోంది. వాస్తవానికి ఈ రిపోర్ట్‌లో చాలా బై-కాల్స్ ఉన్నాయి. అయితే ఇందులో కొన్నింటిని చూద్దాం.

తొమ్మిది స్టాక్స్ ఇవే

- అమరరాజా బ్యాటరీస్ సెప్టెంబర్ నెలలో ధర 720 - టార్గెట్ ధర రూ.1146 - 59% జంప్,

- బాష్ సెప్టెంబర్ నెలలో ధర రూ.14279 టార్గెట్ ధర రూ.18156 - 27% జంప్,

- లూమాక్స్ ఆటో సెప్టెంబర్ నెలలో ధర రూ.139 - టార్గెట్ ధర రూ.207 - 48% జంప్,

- బ్యాంక్ ఆఫ్ ఇండియా సెప్టెంబర్ నెలలో ధర రూ.57.55 - టార్గెట్ ధర రూ.100 - 74% జంప్,

- బజాజ్ కన్స్యూమర్ కేర్ సెప్టెంబర్ నెలలో ధర రూ.251 - టార్గెట్ ధర రూ.355 - 41% జంప్,

- బ్లూస్టార్ సెప్టెంబర్ నెలలో ధర రూ.784 - టార్గెట్ ధర రూ.1200 - 43% జంప్,

- V-గార్డ్ సెప్టెంబర్ నెలలో ధర రూ.262 - టార్గెట్ ధర రూ.311 - 19% జంప్,

- గెయిల్ సెప్టెంబర్ నెలలో ధర రూ.144 - టార్గెట్ ధర రూ.196 - 36% జంప్,

- క్యాడిల్లా హెల్త్ కేర్ సెప్టెంబర్ నెలలో ధర రూ.555 - టార్గెట్ ధర రూ.720 - 30% జంప్.

These stocks to buy from broking firm sharekhan’s value report

అమరరాజా బ్యాటరీస్ షేర్ ధర ఏడాది కాలంలో గత అయిదేళ్లుగా, ఏడాదిగా, 2021 క్యాలెండర్ ఏడాదిలో, ఆరు నెలలుగా ఇలా గత కొంతకాలంగా క్షీణతలోనే ఉంది. ఈ షేర్ 52 వారాల గరిష్టం రూ.1,025. కనిష్టం రూ.665. అయితే ఈ షేర్ మున్ముందు దూసుకెళ్తుందని అంచనా వేస్తున్నారు.

బాష్ కూడా ఏడాదిలో, 2021 క్యాలెండర్ ఏడాదిలో లాభపడింది. అయితే ఐదేళ్లలో చూస్తే మాత్రం నష్టపోయింది. 52 వారాల గరిష్టం రూ.16,830 కాగా, కనిష్టం రూ.11,265. 52 వారాల గరిష్టానికి రూ.2500 దూరంలో ఉంది. అయితే ఈ స్టాక్ కూడా మున్ముందు మంచి ప్రదర్శన కనబరుస్తుందని భావిస్తున్నారు.

ల్యూమాక్స్ ఆటో ఏడాది కాలంలో 44 శాతం లాభపడింది. గత ఆరు నెలల కాలంలో స్వల్పంగా తగ్గింది. 52 వారాల గరిష్టం రూ.181.90 కాగా, కనిష్టం రూ.88.80.

బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్ ధర ఏడాది కాలంలో 25 శాతం కంటే పైగా వృద్ధిని నమోదు చేసింది. 52 వారాల గరిష్టం రూ.101.40 కాగా, కనిష్టం రూ.38.20. బజాజ్ కన్స్యూమర్ కేర్, బ్లూస్టార్, వీ గార్డ్, గెయిల్, కాడిల్లా హెల్త్ కేర్ సంస్థల స్టాక్స్ కూడా సానుకూలంగా ఉన్నాయి. ఈ స్టాక్స్ మున్ముందు భారీగా లాభపడవచ్చునని షేర్ ఖాన్ అంచనా వేస్తోంది. స్టాక్స్ కొనుగోలు చేయడానికి ముందు అప్రమత్తంగా ఉండాలి. ప్రస్తుతం మంచి అంశం ఏమంటే మ్యూచువల్ ఫండ్స్‌లోకి పెద్ద మొత్తంలో డబ్బు ప్రవహిస్తోంది. తద్వారా ఇది మార్కెట్‌కు మద్దతును ఇస్తోంది. ప్రస్తుతం లిక్విడిటీ మార్కెట్లను ముందుకు నడిపిస్తోంది. లిక్విడిటీపై ఒత్తిడి పెరిగితే మాత్రం మార్కెట్లు నష్టపోవడం జరుగుతుంది. కాబట్టి ప్రస్తుతం పెట్టుబడికి ముందు అప్రమత్తంగా ఉండాలి.

ప్రస్తుతం స్టాక్ మార్కెట్లు ఆల్ టైమ్ గరిష్టానికి చేరుకున్నాయి. ఈ పరిస్థితుల్లో ఇన్వెస్ట్ చేసే ముందు అన్నీ ఆలోచించాలి... పరిశీలించాలి. బ్రోకరేజీ నివేదిక ఆధారంగా మాత్రమే ఇన్వెస్ట్ చేయడం సరికాదు. నిపుణుల సలహాలు తీసుకొని, స్టాక్‌ను, స్టాక్ మార్కెట్‌ను అన్ని విధాలుగా పరిశీలించి, ఆ తర్వాత ఇన్వెస్ట్ చేయాలి.

English summary

అమరరాజా బ్యాటరీ సహా ఈ స్టాక్స్ అదరగొడతాయి!! అది మాత్రం గుడ్‌న్యూస్ | These stocks to buy from broking firm sharekhan’s value report

57.55 100 74% Bajaj Consumer Care 251 355 41% Bluestar 784 1200 43% V-Guard 262 311 19% Gail 144 196 36% Cadilla Healthcare 555 720 30%
Story first published: Thursday, September 9, 2021, 14:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X