For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

5 SBI టాప్ రేటెడ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్, FD కంటే ఎక్కువ రిటర్న్స్

|

ఎస్బీఐ డెట్ ఫండ్స్ రుణ, మనీ మార్కెట్ సాధనాల్లో పెట్టుబడులు పెడుతుంది. ఈ ఫండ్స్ పెట్టుబడిదారులకు స్థిర ఆదాయంతో పాటు మూలధన రక్షణను ఇస్తాయి. ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ భారత్‌లో ఉత్తమంగా పని చేసే రుణ నిధులను కలిగి ఉంది. వివిధ పథకాల పనితీరు, AUM, ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని బెస్ట్ ఎస్బీఐ స్కీమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు ఈ ఫండ్స్‌లలో ఇన్వెస్ట్ చేయడాన్ని పరిశీలించవచ్చు. స్థిర ఆదాయం కోసం డెట్ మార్కెట్ ద్వారా ప్రయోజనం పొందవచ్చు.

సురక్షిత పెట్టుబడి...

సురక్షిత పెట్టుబడి...

డెట్ మ్యూచువల్ ఫండ్ ఎక్కువగా ఫిక్స్డ్ ఇన్‌కం సెక్యూరిటీస్‌లో పెట్టుబడిగా పెటుతోంది. గవర్నమెంట్ బాండ్స్, డిబెంచర్స్, కార్పోరేట్ బాండ్స్, ఇతర మనీ మార్కెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇలాంటి వాటిలో పెట్టుబడి పెట్టడం ద్వారా డెట్ మ్యూచువల్ ఫండ్స్ రిస్క్‌ను తగ్గిస్తుంది. ఇది ఓ విధంగా సురక్షిత పెట్టుబడి. సంపద నిర్మాణంలో మీకు ఉపయోగపడుతుంది.

ఎస్బీఐ మాగ్నం మీడియం డ్యురేషన్ డైరెక్ట్

ఎస్బీఐ మాగ్నం మీడియం డ్యురేషన్ డైరెక్ట్

ఎస్బీఐ మాగ్నం మీడియం డ్యురేషన్ డైరెక్ట్ గత ఏడాది 6.67 శాతం రిటర్న్స్‌ను అందించింది. ఈ స్కీం ప్రారంభమైనప్పటి నుండి సగటున ప్రతి సంవత్సరం 9.98 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్ ఎక్స్‌పెన్స్ రేషియో 0.68 శాతం. ఈ స్కీంలో రూ.1000 నుండి పెట్టుబడి పెట్టవచ్చు. ఈ ఫండ్ టాప్ హోల్డింగ్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మహీంద్రా రూరల్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్, టాటా రియాల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్, ఫ్లోమేటాలిక్ ఇండియా వంటివి ఉన్నాయి.

ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్

ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్

ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్ AMU జూలై 17, 2021 నాటికి రూ.14,078 కోట్లుగా ఉంది. మార్నింగ్ స్టార్ నుండి ఈ ఫండ్‌కు ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది. ఎస్బీఐ బ్యాంకింగ్ అండ్ పీఎస్‌యూ ఫండ్ వన్ ఇయర్ రిటర్న్స్ 4.16 శాతంగా ఉంది. ఇది ప్రారంభమైనప్పటి నుండి ప్రతి సంవత్సరం సగటున 8.77 శాతం రిటర్న్స్ ఇచ్చింది. ఈ ఫండ్ టాప్ హోల్డింగ్స్ ఆయిల్ అండ్ నేచరల్ గ్యాస్ కార్పోరేషన్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నేషనల్ హౌసింగ్ బ్యాంకు, రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్, యాక్సిస్ బ్యాంకు ఉన్నాయి.

ఎస్బీఐ మాగ్నం ఇన్‌కం ఫండ్

ఎస్బీఐ మాగ్నం ఇన్‌కం ఫండ్

ఇది మీడియం నుండి లాంగ్ టర్మ్ డెట్ ఫండ్. సాధారణంగా బ్యాంకుల్లోని ఫిక్స్డ్ డిపాజిట్స్ కంటే ఎస్బీఐ మాగ్నం ఇన్‌కం ఫండ్‌లో పెట్టుబడి ద్వారా ఎక్కువ రిటర్న్స్ వస్తాయి. గత ఏడాది కాలంగా 5.76 శాతం రిటర్న్స్ ఇస్తోంది. ఈ ఫండ్ ప్రారంభమైనప్పటి నుండి సగటున 8.85 శాతం రిటర్న్స్ అందిస్తోంది. ఈ ఫండ్ హోల్డింగ్స‌లో ఆర్బీఐ, ఇండియన్ బ్యాంకు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎంబ సీ ఆఫీస్ పార్క్స్ ఆర్ఈఐటీ, టాటా రియాల్టీ తదితరాలు ఉన్నాయి.

ఎస్బీఐ సేవింగ్స్ ఫండ్

ఎస్బీఐ సేవింగ్స్ ఫండ్

ఎస్బీఐ సేవింగ్స్ ఫండ్ AMU రూ.22,380.83 కోట్లు. వ్యాల్యూ రీసెర్చ్ ఈ ఫండ్‌కు ఫోర్ స్టార్ రేటింగ్ ఇచ్చింది. ఈ ఫండ్ ప్రారంభమైనప్పటి నుండి సగటున 7.25 శాతం వడ్డీని అందిస్తోంది. టాప్ హోల్డింగ్స్‌లో మనీ మార్కెట్ ఫండ్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, యాక్సిస్ బ్యాంకు, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చరల్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ ఉన్నాయి.

ఎస్బీఐ క్రెడిట్ రిస్క్ ఫండ్

ఎస్బీఐ క్రెడిట్ రిస్క్ ఫండ్

ఎస్బీఐ క్రెడిట్ రిస్క్ ఫండ్ ప్రధానంగా క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీల నుండి తక్కువ రేటింగ్ లేదా ఏఏ క్రెడిట్ రేటింగ్ కలిగిన వాటిలో ఇన్వెస్ట్ చేస్తుంది. ఇన్వెస్టర్లకు డబ్బులు తిరిగి రావడంపై రిస్క్ ఉంటుంది. అంటే ఈ ఫండ్ డెట్ ఫండ్ కేటగిరీలో ప్రమాదకరమైనవి. అయితే ఈ బాండ్స్ అత్యధిక రేటింగ్ కలిగిన బాండ్స్ కంటే ఎక్కువ వడ్డీ రేట్లను చెల్లించే అవకాశం ఉంటుంది.

వ్యాల్యూ రీసెర్చ్ నుండి ఫోర్ స్టార్, మార్నింగ్ స్టార్ నుండి ఫైవ్ స్టార్ రేటింగ్ ఉంది.మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, రిటర్న్స్ మార్కెట్ లాభనష్టాలకు అనుగుణంగా ఉంటాయి. స్కీంకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ కూలంకుషంగా చదవాలి. ఈ కథనం ఆధారంగా పెట్టుబడులు సరికావు. నిపుణుల సలహాలు తీసుకొని, అన్నీ పరిశీలించి పెట్టుబడులు పెట్టాలి.

English summary

5 SBI టాప్ రేటెడ్ డెట్ మ్యూచువల్ ఫండ్స్, FD కంటే ఎక్కువ రిటర్న్స్ | These SBI Debt Mutual Fund Investments give better returns than FDs

Debt and money market instruments are invested in by SBI Debt Funds. These funds provide investors with a steady stream of income as well as capital protection. These funds are best for conservative investors with a long-term investment horizon.
Story first published: Monday, July 19, 2021, 12:33 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X