For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

2021లో మంచి రిటర్న్స్ అందించే 5 రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్

|

రిటైర్మెంట్ ఫండ్ నిర్మాణానికి మ్యూచువల్ పండ్స్(MF) అద్భుతమైన ప్రత్యామ్నాయం. మ్యూచువల్ ఫండ్స్ మీ నగదును వివిధ షేర్లు, డెట్ స్టాక్స్, మనీ మార్కెట్ సెక్యూరిటీలలో ఇన్వెస్ట్ చేస్తాయి. దీర్ఘకాలిక మ్యూచువల్ ఫండ్స్ చాలా వరకు అధిక రాబడులు అందించాయి. దీర్ఘకాలంలో మ్యూచువల్ ఫండ్స్ మీకు రిటైర్మెంట్ అనంతరం ఎంతో ఆర్థిక భరోసాను అందిస్తాయి. మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు గుడ్డిగా పెట్టడం సరికాదు. మీ మ్యూచువల్ పండ్స్ ఆర్థిక పోర్ట్‌పోలియోను వైవిధ్య పరచాలి. వివిధ రంగాల్లో ఇన్వెస్ట్ చేసే ఫండ్స్‌లో, వివిధ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా రిస్క్‌ను తగ్గించుకోవచ్చు.

రిటైర్మెంట్ సమయానికి క్రమానుగుణ పద్ధతిలో ప్లాన్ చేసుకోవడానికి సెబి ఈ ప్రణాళికలను ప్రత్యేక కేటగిరీలుగా సిద్ధం చేసింది. ఈ ప్లాన్స్ అయిదు సంవత్సరాలు లేదా విరమణ వరకు ముందుగా నిర్ణయించిన వ్యవధిని కలిగి ఉంటాయి. పెట్టుబడిదారులు తమ పదవీ విరమణ పెట్టుబడి లక్ష్యాలను చేరుకోవడానికి, దీర్ఘకాలంలో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి ఇవి ఉపయోగపడతాయి. మీరు పరిగణించాల్సిన కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఇక్కడ చూడండి.

These Retirement Mutual Fund SIPs To Consider this year

HDFC రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్-ఈక్విటీ ప్లాన్

- HDFC రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్-ఈక్విటీ ప్లాన్ డైరెక్ట్ గ్రోత్ అసెట్ అండర్ మేనేజ్‌మెంట్(AUM) రూ.1777 కోట్లు. ఇది మీడియం సైజ్ ఫండ్ కేటగిరీ. ఈ ఫండ్ ఎక్స్‌పెన్సివ్ రేషియో 0.98 శాతంగా ఉంది. ఇతర మల్టీ క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే ఎక్స్‌పెన్సివ్ రేషియో ఎక్కువగా ఉంది.

- HDFC రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్-ఈక్విటీ ప్లాన్ ఫండ్ గత ఏడాది రిటర్న్స్ 60.08 శాతంగా నమోదయింది. ఈ ఫండ్ ప్రారంభమైనప్పటి నుండి సగటున ప్రతి సంవత్సరం 21.44 శాతం రిటర్న్స్ అందించింది.
ఫైనాన్షియల్, టెక్నాలజీ, కెమికల్స్, ఇంజినీరింగ్, సర్వీస్ రంగాల్లో ఇన్వెస్ట్ చేస్తోంది.

- HDFC రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్-ఈక్విటీ ప్లాన్ టాప్ ఫైవ్ హోల్డింగ్స్‌లో HDFC బ్యాంకు Ltd., ICICI బ్యాంకు Ltd., ఇన్ఫోసిస్ Ltd., రిలయన్స్ ఇండస్ట్రీస్ Ltd., హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పోరేషన్ Ltd ఉన్నాయి.

- మీరు ఈ స్కీంలో సిప్ ద్వారా నెలకు రూ.10,000 పెట్టుబడితో కూడా చేరవచ్చు. ప్రతి నెల రూ.10వేలు ఇన్వెస్ట్ చేస్తే అయిదేళ్ల కాలంలో ఇది రూ.22,297 అవుతుంది. ఇందులో ఔట్ స్టాండింగ్ ప్రాఫిట్స్ రూ.12,297. ఈ మ్యూచువల్ ఫండ్స్‌కు అయిదు సంవత్సరాలు లేదా రిటైర్మెంట్ లాక్-ఇన్-పీరియడ్ ఉంటుంది.

HDFC రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ - హైబ్రిడ్ ఈక్విటీ ప్లాన్

HDFC రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ - హైబ్రిడ్ ఈక్విటీ ప్లాన్ డైరెక్ట్ గ్రోత్ AUM రూ.684 కోట్లు. ఈ ఫండ్ ఎక్స్‌పెన్స్ రేషియో 1.28 శాతంగా ఉంది. ఇతర అగ్రెసివ్ హైబ్రిడ్ ఫండ్స్‌తో పోలిస్తే ఎక్స్‌పెన్సివ్ రేటు ఎక్కువ.

- HDFC రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ - హైబ్రిడ్ ఈక్విటీ ప్లాన్ గత ఏడాది కాలంలో 42.98 శాతం రిటర్న్స్ అందించింది. ఈ ప్లాన్ ప్రారంభమైనప్పటి నుండి సగటున ఏడాదికి 19.13 శాతం రిటర్న్స్ ఇచ్చింది.

- ఈ ఫండ్ స్టాక్ అలోకేషన్ 66.08 శాతం కాగా, డెట్ అలోకేషన్ 15.85 శాతంగా ఉంది.

- HDFC రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ - హైబ్రిడ్ ఈక్విటీ ప్లాన్ టాప్ ఫైవ్ హోల్డింగ్స్‌లో HDFC బ్యాంకు Ltd., ICICI బ్యాంకు Ltd., ఇన్ఫోసిస్ Ltd., పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ Ltd., రిలయన్స్ ఇండస్ట్రీస్ Ltd ఉన్నాయి.

These Retirement Mutual Fund SIPs To Consider this year

టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ ప్రోగ్రెసివ్ ప్లాన్

- టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ప్రోగ్రెసివ్ ప్లాన్ డైరెక్ట్ గ్రోత్ AUM రూ.1,127 కోట్లు. ఈ ఫండ్ ఎక్స్‌పెన్సివ్ రేషియో 0.68 శాతంగా ఉంది. ఇతర మల్టీ క్యాప్ ఫండ్స్‌తో పోలిస్తే ఈ ఎక్స్‌పెన్సివ్ రేషియో ఎక్కువే.

- టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ప్రోగ్రెసివ్ ప్లాన్ డైరెక్ట్ గ్రోత్ ఏడాది రిటర్న్స్ 39.79 శాతంగా ఉన్నాయి. ఈ ఫండ్ ప్రారంభమైనప్పటి నుండి సగటున ఏడాదికి 17.02 శాతం రిటర్న్స్ ఇచ్చింది.

- టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ ఫండ్ ప్రోగ్రెసివ్ ప్లాన్ డైరెక్ట్ గ్రోత్ టాప్ హోల్డింగ్స్‌లో ఐసీఐసీఐ బ్యాంకు లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ లిమిటెడ్, HDFC బ్యాంకు లిమిటెడ్ ఉన్నాయి.

- ఫైవ్ ఇయర్ కాలపరిమితికి రూ.10,000తో సిప్ ఇన్వెస్ట్ చేస్తే ఈ కాలంలో రూ.9.35 లక్షలు వస్తాయి. రూ.3.35 లక్షల రిటర్న్స్ అందుతాయి.

టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ మోడరేట్ ఫండ్

- టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ మోడరేట్ ఫండ్ ప్లాన్ డైరెక్ట్ గ్రోత్ AMU రూ.1,493 కోట్లుగా ఉంది. ఈ ఫండ్ ఎక్స్‌పెన్సివ్ రేషియో 0.66 శాతంగా ఉంది.

- ఈ ఫండ్ స్టాక్ అలోకేషన్ 78.38 శాతంగా ఉంది. డెట్‌లో 16.14 శాతంగా ఉంది.

- టాటా రిటైర్మెంట్ సేవింగ్స్ మోడరేట్ ఫండ్ వన్ ఇయర్ రిటర్న్స్ 34.14 శాతంగా ఉన్నాయి. ఈ ఫండ్ ప్రారంభమైనప్పటి నుండి సగటున ఏడాదికి 16.92 శాతం రిటర్న్స్ ఇచ్చింది.

- ఈ ఫండ్ టాప్ ఫైవ్ హోల్డింగ్స్‌లో GOI, రిలయన్స్ ఇండస్ట్రీస్ Ltd., ఇన్ఫోసిస్ Ltd., టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ Ltd., HDFC బ్యాంకు Ltd ఉన్నాయి. సిప్ రూపంలో అయిదేళ్ల పాటు రూ.10,000 ఇన్వెస్ట్ చేస్తే ఈ కాలంలో రూ.8.93 లక్షల కోట్లు వస్తాయి. ఇందులో ప్రాఫిట్ రూ.2.93 లక్షలు.

నిప్పోన్ ఇండియా రిటైర్మెంట్ ఫండ్ - వెల్త్ క్రియేషన్ స్కీం

- నిప్పోన్ ఇండియా రిటైర్మెంట్ ఫండ్ - వెల్త్ క్రియేషన్ స్కీం డైరెక్ట్ గ్రోత్ AUM రూ.2,169కోట్లుగా ఉంది. ఈ ఫండ్ ఎక్స్‌పెన్సివ్ రేషియో 1.15 శాతంగా నమోదయింది. ఇతర మల్టీ క్యాప్ ఫండ్స్ ఎక్స్‌పెన్సివ్ రేషియో కంటే ఇది ఎక్కువ.

- నిప్పోన్ ఇండియా రిటైర్మెంట్ ఫండ్ వెల్త్ క్రియేషన్ స్కీం డైరెక్ట్ - గ్రోత్ రిటర్న్స్ ఏడాది కాలంలో 48.49 శాతం అందించింది. ఈ స్కీం ప్రారంభమైనప్పటి నుండి సగటున ఏడాదికి 9.34 శాతం రిటర్న్స్ అందించింది. రూ.10,000తో ఫైవ్ ఇయర్ సిప్ ప్రారంభిస్తే రూ.8.29 లక్షల రిటర్న్స్ అందించాయి. ఇందులో ప్రాఫిట్ రూ.2.29 లక్షలు.

English summary

2021లో మంచి రిటర్న్స్ అందించే 5 రిటైర్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ | These Retirement Mutual Fund SIPs To Consider this year

Mutual funds are a fantastic alternative for constructing a retirement fund since they invest your money in a variety of shares, debt stocks, and money market securities.
Story first published: Monday, August 23, 2021, 16:18 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X