For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రతి మహిళ ఈ నాలుగు ఇన్సురెన్స్ కలిగి ఉండాలి

|

మహిళలు వ్యాపారంలో మంచి రాబడి లేదా ఉద్యోగంలో మంచి వేతనంతో సరిపెట్టుకోవడమే కాదు, మీ కలలను సాధించుకోవడానికి తెలివైన ఆర్థిక కదలికలు అవసరం. మీ భవిష్యత్తును మరింత ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడం కోసం అలాగే, మీకు, మీ కుటుంబ సభ్యులకు సురక్షిత బీమా అండ వంటివి అవసరం. పురుషులు మాత్రమే కాదు, మహిళలు కూడా కుటుంబాన్ని పోషిస్తున్నారు.

కాబట్టి ఇన్సురెన్స్ వంటి అంశాలపై మహిళల కూడా దృష్టి సారించాలి. ప్రస్తుత కాలంలో బీమా చాలా ముఖ్యం. కరోనా మహమ్మారి అనంతరం హెల్త్ ఇన్సురెన్స్ ప్రాధాన్యత పెరిగింది. ఈ నేపథ్యంలో మహిళలు తీసుకోవాల్సిన నాలుగు ఇన్సురెన్స్ స్కీమ్స్ తెలుసుకోండి...

హెల్త్ ఇన్సురెన్స్

హెల్త్ ఇన్సురెన్స్

పురుషుడైనా లేదా మహిళ అయినా ఆర్జన ప్రారంభించగానే మొదట చేయాల్సిన పని హెల్త్ ఇన్సురెన్స్ తీసుకోవడం. నేను యవ్వనంలో ఉన్నాను... ఆరోగ్యంగా ఉన్నాను. నాకు ఎలాంటి హెల్త్ ఇన్సురెన్స్ అవసరం లేదని భావిస్తే అది తప్పే. ఇందుకు కరోనా మహమ్మారి పెద్ద ఉదాహరణ. మీరు హెల్త్ ఇన్సురెన్స్‌ను కొనుగోలు చేస్తే తర్వాత ఏదైనా అనారోగ్య పరిస్థితుల్లో ఖర్చు తగ్గుతుంది.

ఆసుపత్రిలో చేరడం, వైద్య ఖర్చులు, పోస్ట్ కేర్, వైద్యుల ఫీజులు, వైద్య అత్యవసర పరిస్థితులు, ఆపరేషన్, తీవ్రమైన అనారోగ్యం, ప్రసూతి ఖర్చు తదితర వాటికి హెల్త్ ఇన్సురెన్స్ ధైర్యాన్ని ఇస్తుంది. మీ ఇరవై లేదా ముప్పై ఏళ్ల వయస్సులో మీరు రూ.10,000 లోపు ఇన్వెస్ట్ చేస్తే రూ.25 లక్షల వరకు కూడా కవర్ చేయగలిగే పాలసీలు కూడా ఉంటాయి.

ఎండోమెంట్ లైఫ్ ఇన్సురెన్స్

ఎండోమెంట్ లైఫ్ ఇన్సురెన్స్

యువత బీమా గురించి ఆలోచించడం చాలా తక్కువ. ఎందుకంటే వారికి మరణం వంటివి చాలా దూరంగా కనిపిస్తాయి. ఎండోమెంట్ లైఫ్ ఇన్సురెన్స్ అనేది లక్ష్యాన్ని చేరుకునే ఉత్పత్తి. మీరు చెల్లించే ప్రీమియంలో కొంత భాగంతో లైఫ్ కవర్‌కు ఉపయోగపడుతుంది. మిగతాది బీమా కంపెనీ పెట్టుబడిగా పెడుతుంది. మెచ్యూరిటీ తర్వాత పెద్ద మొత్తం చేతికి వస్తుంది. ఎండోమెంట్ ప్లాన్స్ పీరియాడిక్ బోనస్ అందిస్తుంది. మీరు ఈ మొత్తాన్ని ఇల్లు లేదా కారు కొనుగోలు కోసం డౌన్ పేమెంట్‌గా ఉపయోగించవచ్చు.

లేదా మీ భవిష్యత్తు కోసం పెట్టుబడిగా ఉపయోగించవచ్చు. యూనిట్ లింక్డ్ ఇన్సురెన్స్ ప్లాన్(ULIPs) దీర్ఘకాలిక పెట్టుబడిని ప్రారంభించేందుకు ఒక గొప్ప సాధనం. లైఫ్ కవర్‌తో పాటు లాక్-ఇన్‌తో ఈక్విటీ ఎక్స్‌పోజర్‌ని అనుమతిస్తారు. ఇది మీ క్యాపిటల్ పెరగడానికి ఉపయోగపడుతుంది.

వెహికిల్ ఇన్సురెన్స్

వెహికిల్ ఇన్సురెన్స్

మీరు కారు లేదా బైక్ కలిగి ఉంటే వాహన బీమాను కొనుగోలు చేయడం తప్పనిసరి. ఇబ్బందికర పరిస్థితుల్లో ఇది మీకు అండగా నిలుస్తుంది. కారు రిపేర్ అనేది చాలా ఖర్చుతో కూడుకున్న పని. ఇన్సురెన్స్ చేస్తే మీ జేబు నుండి డబ్బులు తీయాల్సిన అవసరం లేదు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వ్యక్తికి లేదా ఆస్తికి నష్టం లేదా గాయమైతే మీ బాధ్యతను తగ్గిస్తుంది. వైద్య ఖర్చులు, ఉపకరణాల కవర్, జీరో డిప్రిసియేషన్ కవర్ ఉంటుంది.

హోమ్/రెంటల్ ఇన్సురెన్స్

హోమ్/రెంటల్ ఇన్సురెన్స్

ప్రతి మహిళ కూడా హోమ్ ఇన్సురెన్స్ (ఆమె ఇంటి యజమాని అయితే) లేదా రెంటల్ ఇన్సురెన్స్(టెనెంట్ అయితే) కలిగి ఉండాలి. చాలామంది రెంటల్ ఇన్సురెన్స్‌ను అంత అవసరమైనదిగా భావించడం లేదు. నష్టం లేదా దొంగతనం ద్వారా వ్యక్తిగత ఆస్తి నష్టం నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీరు ప్రత్యేక అద్దె బీమాను కొనుగోలు చేయాలి.

English summary

ప్రతి మహిళ ఈ నాలుగు ఇన్సురెన్స్ కలిగి ఉండాలి | These insurance should have every woman, Women need to be in control of finances

Health insurance is one of the first insurance investments you should make. It would be foolish to think you are young and healthy and hence won’t need health insurance.
Story first published: Thursday, September 2, 2021, 14:58 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X