For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అదిరిపోయే ఆఫర్లు: పెట్రోల్‌పై ఈ క్రెడిట్ కార్డ్స్ ద్వారా భారీగా ఆదా చేయండి!

|

గత కొంతకాలంగా పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీపావళి సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ పైన రూ.5, డీజిల్ పైన రూ.10 సెస్ తగ్గించడంతో సామాన్యుడిపై భారం కాస్త తగ్గింది. కేంద్రం తగ్గింపు నేపథ్యంలో రాష్ట్రాలపై ఒత్తిడి పెరిగింది. దీంతో పలు రాష్ట్రాలు కూడా వ్యాల్యూ యాడెడ్ ట్యాక్స్‌ను తగ్గించాయి. దీంతో అన్ని ప్రాంతాల్లో సెంచరీ దాటిన పెట్రోల్, డీజిల్ ధరలు పలు ప్రాంతాల్లో ఈ మార్కు దిగువకు వచ్చాయి. తద్వారా సామాన్యుడిపై కాస్త భారం తగ్గింది. దీనికి తోడు గత పదిహేను రోజులుగా అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు పెరగకపోవడంతో దేశీయ చమురు రంగ సంస్థలు కూడా ధరలను పెంచడం లేదు. ఇది కాస్త ఊరట కలిగించే అంశం. పెట్రోల్, డీజిల్ ధరలు అంతర్జాతీయ మార్కెట్ ధరలపై ఆధారపడి ఉంటుంది. త్వరలో క్రూడ్ ధరలు పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అప్పుడు ఇక్కడ కూడా పెరుగుతాయి. ధరలు పెరిగిన, పెరుగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ఫ్యూయల్ క్రెడిట్ కార్డ్స్ ఉపయోగిస్తే కొంత క్యాష్ బ్యాక్, రివార్డ్ పాయింట్స్ ప్రయోజనం ఉంటుంది.

ఒక శాతం సర్‌ఛార్జ్ మినహాయింపు

ఒక శాతం సర్‌ఛార్జ్ మినహాయింపు

సెంచరీ దాటిన చమురు ధరలతో వినియోగదారు జేబుకు చిల్లుపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇంధన ట్రాన్సాక్షన్స్ పైన కొంత మొత్తం ఆదా చేసినా వినియోగదారుకు కొంతలో కొంత ఊరట కలుగుతుంది. క్యాష్ బ్యాక్, ఉచిత ఇంధనం, యాక్సిలరేటర్ రివార్డ్ పాయింట్స్ మొదలైన ఇంధన ట్రాన్సాక్షన్స్ పైన భారీ సేవింగ్స్ అందించే ఐదు మంచి క్రెడిట్ కార్డ్స్‌ను సూచిస్తున్నారు. అవేమిటో తెలుసుకుందాం.

ఎస్బీఐ కార్డ్ - బీపీసీఎల్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ 3.25 శాతం రివార్డ్ పాయింట్లను ఆఫర్ చేస్తోంది. రూ.4000 వరకు బీపీసీఎల్ ట్రాన్సాక్షన్ పైన ఒక శాతం ఇంధన సర్‌ఛార్జీ మినహాయింపు అందిస్తోంది. ఈ కార్డ్ కిరాణా, డిపార్టుమెంటల్ స్టోర్స్, సినిమాలు, డైనింగ్స్‌లో ఖర్చు చేసే ప్రతి రూ.100 పైన 5X రివార్డ్ పాయింట్లను అందిస్తుంది. ఈ క్రెడిట్ కార్డు వార్షిక రుసుము రూ.499.

HDFC భారత్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్

HDFC భారత్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్

HDFC బ్యాంకుకు చెందిన HDFC భారత్ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డ్ పైన నెల ఫ్యూయల్ ఖర్చు పైన 5 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. అలాగే ఒక శాతం ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపు ఉంది. గ్రాసరీ స్పెండింగ్స్ పైన కూడా నెలకు ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది. IRCTC టిక్కెట్స్ బుకింగ్ పైన 5 శాతం క్యాష్ బ్యాక్ ఉంది. ఈ క్రెడిట్ కార్డు ఏడాది ఫీజు రూ.500.

ఇండియన్ ఆయిల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్

ఇండియన్ ఆయిల్ యాక్సిస్ క్రెడిట్ కార్డ్

R

ఇండియన్ ఆయిల్, యాక్సిస్ బ్యాంకు క్రెడిట్ కార్డ్ ద్వారా ఫ్యూయల్ పైన ఒక శాతం సర్‌ఛార్జ్ మినహాయింపు ఉంది. ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్స్‌లో రూ.100 ఖర్చు పైన 20 రివార్డ్ పాయింట్స్ ఉన్నాయి. రూ.100 షాపింగ్ చేస్తే 5 శాతం రివార్డ్ పాయింట్స్ ఉంటాయి. ఈ కార్డ్ ఏడాది ఫీజు రూ.500. ఏడాదిలో రూ.50,000, అంతకుమించి ఖర్చు చేస్తే యాన్యువల్ ఫీజు మినహాయింపు ఉంటుంది.

బీపీసీఎల్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆక్టేన్స్

బీపీసీఎల్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆక్టేన్స్

బీపీసీఎల్ పెట్రోల్ బంకుల్లో బీపీసీఎల్ ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆక్టేన్స్ ద్వారా పెట్రోల్, డీజిల్ కొనుగోలుపై 7.25 శాతం వ్యాల్యూ బ్యాక్ ఆఫర్ ఉంది. రూ.4000, అంతకుమించిన బీపీసీఎల్ ట్రాన్సాక్షన్స్ పైన రివార్డ్ పాయింట్ల రూపంలో 6.25 శాతం, సర్‌ఛార్జ్ 1 శాతం మినహాయింపు ఉంది. బీపీసీఎల్ ఫ్యూయల్, లుబ్రీకాంట్స్, భారత్ గ్యాస్ కోసం ప్రతి రూ.100 ఖర్చు పైన 25 రివార్డ్ పాయింట్స్ వస్తాయి. ఈ కార్డు ప్రతి రూ.100 డైనింగ్, డిపార్టుమెంటల్ స్టోర్స్, గ్రాసరీ స్టోర్స్, మూవీస్ ఖర్చు పైన 10X రివార్డ్ పాయింట్లు లభిస్తాయి. ఈ కార్డు యాన్యువల్ ఫీజు రూ.1499.

ఇండియన్ ఆయిల్ సిటీ బ్యాంకు ప్లాటినమ్

ఇండియన్ ఆయిల్ సిటీ బ్యాంకు ప్లాటినమ్

ఇండియన్ ఆయిల్ సిటీ బ్యాంకు ప్లాటినమ్ ద్వారా ఇండియన్ ఆయిల్ పంపులలో ప్రతి రూ.150 ఖర్చు పైన నాలుగు టర్బో పాయింట్స్ ఆఫర్ ఉంది. అలాగే ఒక శాతం ఫ్యూయల్ సర్‌ఛార్జ్ మినహాయింపు ఉంది. గ్రాసరీస్, సూపర్ మార్కెట్లలో రూ.150 ఖర్చు పైన 2 టర్బో పాయింట్స్, ఇతర ఖర్చులకు సంబంధించి రూ.150 స్పెండ్ చేస్తే ఒక టర్బో పాయింట్ ఉంది. ఒక టర్బో పాయింట్ అంటే రూ.1 విలువ చేసే ఉచిత ఫ్యూయల్. ఈ కార్డు వార్షిక ఫీజు దరఖాస్తు సమయంలో తెలుపుతారు.

English summary

అదిరిపోయే ఆఫర్లు: పెట్రోల్‌పై ఈ క్రెడిట్ కార్డ్స్ ద్వారా భారీగా ఆదా చేయండి! | These fuel credit cards that offer the best cashbacks and reward points

The rising cost of fuel is denting the pocket of almost everyone. In such a scenario, saving some money on fuel transactions is something that would make people rejoice.
Story first published: Thursday, November 18, 2021, 14:13 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X